మెగాస్టార్‌ చిరంజీవి కార్ల కలెక్షన్‌ చూశారా? జగదేకవీరుడి గ్యారేజీలో ఓ పెద్ద లగ్జరీ కార్ల షోరూమే ఉంది!

మెగాస్టార్‌ చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్‌ భారత దేశంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని ఆయన సంపాదించారు. వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మంత్ర ముగ్దుల్నీ చేస్తాడు ఈ జగదేకవీరుడు. ఆయన సినీ జీవితంలో, నిజ జీవితంలో ఎన్నో విజయాలను సాధించారు. ఆ తర్వాత రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. నేడు మెగాస్టార్‌ 69 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ వెండితెర వీరుడు తన పుట్టినరోజు సందర్భంగా నేడు తిరుమల వెంకటేశ్వర స్వామిని కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు.

చిరంజీవి లైఫ్‌స్టైల్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన డ్రెస్సింగ్, ఇతర స్టైలింగ్‌తో ఎవ్వరూ పోటిపడలేరు అంటే అర్థం చేసుకోండి. మెగాస్టార్‌కి కార్లంటే పిచ్చి ఆయన గ్యారేజీలో డజన్ల కొద్ది కార్లు వచ్చి వెళ్లాయి. వింటేజ్‌ కార్ల నుంచి సూపర్‌ లగ్జరీ కార్ల వరకు చిరంజీవి గ్యారేజీలో బోలెడన్ని అధునాతన కార్లు ఉన్నాయి. ఆయన తనయుడు రామ్‌చరణ్‌కి కూడా కార్లంటే క్రేజ్‌ ఎక్కువ. మెగా గ్యారేజీలో కార్ల షోరూమే ఉంది.

Megastar Chiranjeevi Birthday

రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌(Rolls-Royce Phantom): మెగాస్టార్‌ గ్యారేజీలో అత్యంత ఖరీదైన కారు. ఈ కారు ధర రూ. 11 కోట్లుగా ఉంది. ఇది 6.7 ట్విన్ టర్బో V12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 570 ps శక్తిని 900 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇందులో పెద్ద ఇన్ఫోటైనమ్‌మెంట్ యూనిట్‌, ఫ్రంట్‌ మసాజ్‌ సీట్లు, వెంటిలేటెడ్‌ సీట్లు ఉన్నాయి. దీనిని ఎలాంటి పత్యర్థి కార్లు లేవు.

టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ 4th జనరేషన్‌ (Toyota Land Cruiser 4th Generation): ఇది రెండు ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. పెట్రోల్‌ ట్విన్‌ టర్బో ఇంజిన్ 3.4 లీటర్‌ V6 ఇంజిన్ 409 hp, 479 టార్క్‌ని, టర్బో డీజిల్‌ ట్విన్‌ టర్బో 3.3 లీటర్‌ V6 ఇంజిన్‌ 304 hp, 516 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 1.50 కోట్లు.

Megastar Chiranjeevi Cars Collections

రేంజ్‌ రోవర్ ఆటోబయోగ్రఫీ (Range Rover Autobiography): ఇందులోని 2996 సీసీ ఇంజిన్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 5500 rpm వద్ద 394 bhp మరియు 2000 rpm వద్ద 550 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. రోంజ్ రోవర్ ఢిపెండర్‌ ఓక్టా, ల్యాండ్‌ క్రూయిజర్‌ 300ZX, పోర్శే 911 క్యారెర్రా వంటి వాటికి పోటిని ఇస్తుంది. దీని ధర రూ. 2.75 కోట్లు.

టయోటా వెల్‌ఫైర్‌ (Toyota Vellfire): 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ 193 ps శక్తిని 240 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇ-సీవీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ లగ్జరీ కారు నంబర్‌ (TS 09 GB 1111) కోసం చిరు రూ. 5 లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. ఇది మెర్సిడెస్‌ బెంజ్‌ వీ-క్లాస్‌ లగ్జరీ కారుతో పోటీ పడుతుంది. దీని ధర 1.22 కోట్లుగా ఉంది.

Megastar Chiranjeevi Toyota Vellfire

వీటితో పాటు చిరూ గ్యారేజీలో 3rd జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్‌ కూడా ఉంది. దీని ధర రూ. 90 లక్షలుగా ఉంది. తాజాగా మెగా ఫ్యామిలీ గ్యారేజీలో అధునాతన ఈవీ రోల్స్‌ రాయిస్‌ స్పెక్ట్రె ఈవీ (Rolls Royce Spectre EV) వచ్చి చేరింది. కొద్ది రోజుల క్రితమే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో రామ్‌ చరణ్‌ ఈ కారులో కనిపించారు. దీని ధర అక్షరాల రూ. 7.50 కోట్లుగా ఉంది.

చిరంజీవి ఫ్యామిలీ వద్ద ఇంకా మరెన్నో కార్లు ఉన్నాయి. అంతే కాకుండా ఓ ప్రైవేట్‌ జెట్‌ని సైతం కలిగి ఉన్నాడు. కుటుంబంతో కలిసి దీనిలో ప్రయాణిస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మెగాస్టార్‌ విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 10న విడుదల కానుంది. బింబిసార సినిమాతో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 22, 2024, 11:41 [IST]
English summary
Megastar chiranjeevi cars collections check price and specifications here
Read more on: #celebrity cars #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+