లగ్జరీ కారు కొనుగోలు చేసిన MP విజయ్ వసంత్: దీని ధర అక్షరాలా..

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) ఒకటి. ల్యాండ్ రోవర్ కంపెనీ గత ఏడాది భారతీయ మార్కెట్లో తన లగ్జరీ డిఫెండర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ SUV అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ గా నిలిచింది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన MP విజయ్ వసంత్: దీని ధర అక్షరాలా..

ఎక్కువమంది సెలబ్రెటీలు ఇష్టపడే వాహనాలలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒకటి. అయితే ఇటీవల ఒక రాజకీయ నాయకుడు ఈ పాపులర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. ఈ లగ్జరీ కారుని కొనుగోలు చేసిన నాయకుడు MP 'విజయ్ వసంత్'. బహుశా ఈ కొత్త డిఫెండర్ SUVని కొనుగోలు చేసిన మొదటి భారతీయ రాజకీయ నాయకుడు కూడా ఇతడే కావడం గమనార్హం.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన MP విజయ్ వసంత్: దీని ధర అక్షరాలా..

విజయ్ వసంత్ ఈ ఏడాది ప్రారంభంలో కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఇతడు కేవలం రాజకీయ నాయకుడే కాదు, తమిళ పరిశ్రమలో ప్రముఖ వ్యాపారవేత్త కూడా. విజయ్ వసంత్‌కి ఇప్పటికే టయోటా ఫార్చ్యూనర్‌ ఉంది. ఇప్పుడు ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో ఆ టయోటా స్థానంలో చేరింది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన MP విజయ్ వసంత్: దీని ధర అక్షరాలా..

విజయ్ వసంత్ కొనుగోలు చేసిన ఈ కొత్త ల్యాండ్ రోవర్ రెడ్ కలర్ లో ఉంది. అంతకుముందు తనవద్ద ఉన్న టయోటా ఫార్చ్యూనర్ కూడా రెడ్ కలర్ లోనే ఉంది. దీన్ని బట్టి చూస్తే అతనికి రెడ్ కలర్ కార్లంటే ఇష్టమని తెలుస్తుంది. వీటితో పాటు విజయ్ వసంత్ గ్యారేజీలో ఇతర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన MP విజయ్ వసంత్: దీని ధర అక్షరాలా..

విజయ్ వసంత్ గ్యారేజీలో పోర్స్చే కయెన్ ఉన్నట్లు కూడా సమాచారం. అయితే ఇది ఉందా.. లేదా అనేదానిపైన ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. విజయ్ వసంత్ ఉపయోంగించే కార్లను గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికి కొన్ని కార్ల గురించి సమాచారం తెలుస్తోంది. ఇందులో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒక లగ్జరీ SUV.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన MP విజయ్ వసంత్: దీని ధర అక్షరాలా..

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో కూడిన SUV. ఈ SUV ఆఫ్-రోడింగ్ యొక్క అనేక వీడియోలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ SUV ధర రూ. 1.08 కోట్లు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రశంసలు పొందిన ఐకానిక్ ఆఫ్-రోడ్ SUV.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన MP విజయ్ వసంత్: దీని ధర అక్షరాలా..

ఈ ప్రసిద్ధ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొత్త D7X ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది మరియు మోనోకోక్ ఛాసిస్‌ను కలిగి ఉంది. ల్యాండ్ రోవర్ దాని డిఫెండర్ SUV ఆఫ్-రోడ్ కోసం ఉపకరణాలను కూడా కలిగి ఉంది. డిఫెండర్ SUV నాలుగు ఆఫ్-రోడ్ యాక్సెసరీస్ ప్యాకేజీలను కలిగి ఉంది. ఇందులో ఎక్స్‌పెడిషన్ ప్యాక్, కంట్రీ ప్యాక్, అర్బన్ ప్యాక్ మరియు అడ్వెంచర్ ప్యాక్ ఉన్నాయి.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన MP విజయ్ వసంత్: దీని ధర అక్షరాలా..

ఈ కొత్త డిఫెండర్ SUV కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU) గా భారతదేశానికి తీసుకురాబడింది. ఇది ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని 3-డోర్ మోడల్ డిఫెండర్ 90 అయితే 5-డోర్ మోడల్‌ను డిఫెండర్ 110 అని పిలుస్తారు. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ SUV 5,018 మి.మీ పొడవు, 2,105 మి.మీ వెడల్పు, 1,967 మి.మీ ఎత్తు మరియు 3,022 మి.మీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన MP విజయ్ వసంత్: దీని ధర అక్షరాలా..

ఇండియా-స్పెక్ డిఫెండర్ SUV 2.0-లీటర్, ఫోర్-సిలిండర్, బిఎస్ 6 పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 292 బిహెచ్‌పి పవర్‌ మరియు 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కొత్త డిఫెండర్ ల్యాండ్ రోవర్ యొక్క టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్‌ను కూడా అందుకుంటుంది. ఇది డిఫెండర్ SUV యొక్క 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ ఎంపికతో కూడా వస్తుంది. ఈ ఇంజన్ 296బిహెచ్‌పి పవర్ మరియు 650ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన MP విజయ్ వసంత్: దీని ధర అక్షరాలా..

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ SUVలో టార్క్ వెక్టరింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆల్-వీల్ డ్రైవ్, హిల్ లాంచ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, అడాప్టివ్ డైనమిక్స్, ట్విన్-స్పీడ్ ట్రాన్స్‌ఫర్ బాక్స్ మరియు మరిన్ని వంటి ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉన్నాయి. డిఫెండర్ యొక్క న్యూమాటిక్ సస్పెన్షన్ వెర్షన్ గరిష్టంగా 291 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను పొందుతుంది. మొత్తానికి ఇది ఆఫ్ రోడింగ్ చేయడానికి అద్భుతమైన SUV.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన MP విజయ్ వసంత్: దీని ధర అక్షరాలా..

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో వాహన వినియోగదారులకు కావాల్సిన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ SUV ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

Most Read Articles

English summary
Member of parliament vijay vasanth bought brand new land rover defender details
Story first published: Thursday, November 4, 2021, 12:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X