స్త్రీల కన్నా పురుషలదే చెత్త డ్రైవింగ్ - తాజా అధ్యయనం

కానీ అదే స్త్రీల విషయానికి వచ్చే సరికి ప్రతి 20 మందిలో ఒకరు మాత్రమే తమ పరధ్యానం కారణంగా ప్రమాదాలకు గురైనట్లు చెప్పారు. ప్రతి మూడో పురుషుడు ఏకాగ్రత లోపించిన కారణంగా కొన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. కానీ అదే ఆడవాళ్ల విషయంలో ప్రతి ఐదో స్త్రీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. కాగా.. ఈ ప్రమాదాలకు సంబంధించిన పరధ్యానానికి గల సర్వసాధారమైన కారణం కార్ స్టీరియోను అడ్జస్ట్ చేయడం, 76 శాతం మంది స్టీరియోను అడ్జస్ట్ చేస్తూ.. రోడ్డుపై దృష్టిని కోల్పోయి ప్రమాదాలకు గురైనట్లు చెప్పారు. శాంటండర్ ఇన్సూరెన్స్ సర్వే ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు.
మూడొంతుల్లో రెండొంతుల మంది సాఫ్ట్ డ్రింక్ సేవించడం మూలానో లేక ఏదైనా తినడం మూలానో పరధ్యానానికి లోనైట్లు చెప్పగా, సగం మంది సీడీని హ్యాండ్లింగ్ చేయడం వల్ల ఏకాగ్రత కోల్పోయామని చెప్పారు. కాలు భాగానికి పైగా డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగించడం వల్ల ప్రమాదాలకు గురైనట్లు వెల్లడించినట్లు డైలీ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. 96 శాతం మంది డ్రైవర్లు కారు నడుపుతుండగా టెక్స్టింగ్ (మేసేజింగ్) చేయడం ప్రమాదకరమని చెప్పగా.. కాలు భాగం మందికి ఇప్పటికే అదే పనిని చేస్తున్నట్లు తెలిపారు. మ్యాప్-రీడింగ్, షేవింగ్, కిస్సింగ్, న్యూస్ పేపర్ చదవడం వంటివి పురుషుల్లో ప్రమాదాలు సంభవించడానికి సర్వసాధారణమైన కారణాలని ఆ అధ్యయనంలో తేలింది.
వీటన్నిటిని బట్టి చూస్తే.. పురుషుల కన్నా ఆడవాళ్లు సగానికి పైగా తక్కువగా పరధ్యానానికి లోనవడం జరుగుతుంది. అంటే.. స్త్రీలది మంచి డ్రైవింగ్, పురుషులది చెత్త డ్రైవింగ్ అన్నమాట. అంటే.. డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం, రోడ్డును గమనించకుండా రోడ్డు పక్కన నడిచి వెళ్లే అమ్మాయిలను గమనించడం, కార్లలో రొమాన్సులు మానుకోవడం చేస్తే పరధ్యానం వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. కాబట్టి డ్రైవింగ్ చేసే సమయంలో కాస్తంత పారాహుషార్‌గా ఉండండి మరి..!!


Click it and Unblock the Notifications








