సరదా కోసం ఎమర్జెన్సీ చైన్‌ లాగిన వ్యక్తికి చుక్కలు.. ఇది తెలిస్తే ముట్టుకోవడానికి కూడా మీరు సాహహం చేయరు!

ఇప్పటికీ పేదలకు రైలు ప్రయాణం అనేది ఓ వరంగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో ప్రయాణ ఖర్చు చాలా తక్కువ. సుదూర ప్రాంతాలకు బస్సులు, ఇతర ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌తో పోల్చితే ఖర్చు సగానికి తక్కువగా ఉంటుంది. ‌అందువల్ల సామాన్య ప్రజలు రైలు ప్రయాణానికి జై కొడుతుంటారు. అంతే కాకుండా రైళ్లలో తమకు నచ్చిన విధంగా లగేజీని తీసుకెళ్లవచ్చు. వీటిపై ఆంక్షలు ఉన్నా కానీ ఎవ్వరూ దీనిని పట్టించుకోరు. అందువల్ల ఎక్కువ లగేజీ ఉన్నవారు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. అయితే రైలు కనెక్టివిటీ కొన్ని ప్రాంతాలకు తక్కువ. అయితే దగ్గర్లోని మెయిన్‌ స్టేషన్‌కి చేరుకోవడం ద్వారా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఇప్పుడు చాలా వరకు దేశంలోని కీలక నగరాలకు రైల్వే లైన్‌ విస్తరించింది.

పైన చెప్పిన విధంగా తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సాధనం కావడంతో భారతదేశంలో ప్రతిరోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. వీరి సేఫ్టీ, సౌకర్యాన్ని భారతీయ రైల్వే ఎప్పటికప్పుడూ ట్రాక్‌ చేస్తూ ఉంటుంది. రైళ్లలోనూ ప్రయాణం ముగిసే వరకు రక్షణ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో చైన్ లాగడం ద్వారా రైలుని నిలువరించవచ్చు. అయితే దీనికి కూడా కొన్ని నిమయాలు ఉన్నాయి. దీనిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కూడా ఉన్నాయి.

Train Emergency Braking

ఎమర్జెన్సీ లేదా మీరు ప్రయాణిస్తున్న కంపార్ట్‌మెంట్‌లో ఏదైనా క్రైమ్‌, ఆకస్మాత్తుగా మంటలు చెలరేగిన సందర్భాల్లో మాత్రమే మీరు ఈ గొలుసును లాగాలి. దీంతో రైలు వెంటనే ఆగిపోతుంది. తద్వారా మీకు కావాల్సిన సహాయం రైల్వే పోలీసు లేదా సిబ్బంది ద్వారా అందుతుంది. ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. కానీ చాలామందికి రైళ్లలో ఈ చైన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలియదు.

మీరు రైలు చైన్‌ లాగినప్పుడు బ్రేక్ పైపులోని ఎయిర్ వాల్వ్ తెరుచుకుంటుంది. పైప్‌లోని గాలి మొత్తం బయటకు పంపబడుతుంది. ఫలితంగా బ్రేకులపై గాలి పీడనం తగ్గడం ప్రారంభమవుతుంది. దీంతో చివరికి రైలు ఆగిపోతుంది. అంతే కాకుండా రైలు లోకో పైలట్స్‌ ఎయిర్‌ ప్రెజర్ మీటర్‌ని చెక్‌ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో గాలి పీడనం తగ్గడం గమనించి తక్షణమే రైలుని నిలిపివేస్తారు.

Train Alarm Chain

కానీ మనలో చాలామంది అనవసరంగా చైన్‌ని లాగుతూ జరిమానా చెల్లిస్తున్నారు. పైన చెప్పన విధంగా కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చైన్‌ని లాగాల్సి ఉంటుంది. కానీ అనవసర కారణాలతో గొలుసు లాగి రైలును నిలిపివేయడాన్ని రైల్వే శాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. దీనిపై భారతీయ రైల్వే ఎన్ని హెచ్చరికలు చేసినా చాలా మంది దీనిని పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ వ్యక్తి అనవసరంగా చైన్‌ లాగుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

దీంతో రైల్వే సిబ్బంది అతనిపై కఠిన చర్యలు తీసుకున్నారు. నవంబర్ 15న అగర్తలా-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. చాలా రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. అదే రోజు బార్పేట రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ ప్రయాణికుడు గొలుసు లాగి రైలును ఆపే ప్రయత్నం చేశాడు. వెంటనే గుర్తించిన సిబ్బంది అతడిని ఆరా తీయగా సరైన సమాధానం ఇవ్వలేదు.

Train Emergency Chain

ప్రయాణీకుడి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో రైలు ఆలస్యంగా నడిచేందుకు లేదా ఆటంకం కలిగించినందుకు రైల్వే చట్టంలోని సెక్షన్ 141 కింద ప్రయాణికుడికి రూ .8,000 భారీ జరిమానా విధించారు. ఈ వార్త తాజాగా ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. సరదాగా చేసి ఉండాడని కొందరూ.. పనిచేస్తుందో లేదో తెలుసుకునే ప్రయత్నం కావచ్చని మరికొందరు కామెంట్‌ చేశారు. ఏదీ ఏమైనా ఈ చర్యకు రైల్వే సిబ్బంది మాత్రం ఘాటుగా స్పందించారు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 4, 2024, 18:38 [IST]
English summary
Men who pulled trains alarm chain without an emergency fined by the railway
Read more on: #rail #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+