నేటి వీడియో: మ్యాన్ వర్సెస్ మెషీన్ ఛాలెంజ్
మానవుడు సృష్టించిన కారే మానవుడి కన్నా వేగంగా పరుగులు తీస్తుంది కదా.. కానీ అదే మానవుడు తాను సృష్టించిన యంత్రంతో నడిచే కారును కేవలం చెక్క స్కేటింగ్ బోర్డుపై ఓవర్‌టేక్ చేస్తే.. వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..! అయితే, ఈ వీడియోను వీక్షించండి, మీ కళ్లను మీరే నమ్మలేకపోతారు.
ఇది 'మ్యాన్ ఎగైనెస్ట్ మెషీన్' అనే వీడియో. పేరుకు తగినట్లుగానే ఈ వీడియోలో మనిషితో కారుతో పోటీపడుతాయి. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పెర్ఫామెన్స్ వెర్షన్ ఏ-క్లాస్ కారు (ఏ45 ఏఎమ్‌జి)తో డౌన్‌హిల్ ఛాంపియన్ డెసియో లౌరెన్సో పోటీపడుతాడు. అత్యంత ప్రమాదకరమైన ఫీట్‌ను ఎంతో అందంగా చిత్రీకరించారు.
ఇది కూడా చదవండి.. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్..

కొండపై నుంచి క్రిందకు దిగే రోడ్డుపై కేవలం స్కేటింగ్ బోర్డు సాయంతో అత్యంత వేగంతో క్రిందకు రావటం, ఈ రేసులో విజేతలుగా నిలిచిన వారికి డౌన్‌హిల్ ఛాంపియన్ టైటిల్‌ను అందజేయటం జరుగుతుంది. ఈ డౌన్‌హిల్ స్కేటింగ్‌కు అత్యంత నైపుణ్యం కావాలి. కొండ మలుపుల వద్ద ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న భారీ ప్రమాదమే జరుగుతుంది.
అలాంటి స్టన్నింగ్ ఫీట్‌ను డెసియో లౌరెన్సో అత్యంత సునాయాసంగా చేసేశాడు. మరి ఈ మ్యాన్ వర్సెస్ మెషీన్ పోటీలో ఎవరు నెగ్గారు.. మనిషా.. లేక కారా.. తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా ఈ వీడియోను చూసేయండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/n_oGSt0r49g?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








