మంట కలిసిన మానవత్వం.. నిర్దాక్షిణ్యంగా కుక్క మీదుగా బెంజ్‌ కారు పోనిచ్చిన డ్రైవర్‌.. వైరల్‌ వీడియో

ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఒక్కసారిగా కోపం తన్నుకొస్తుంది. ఇంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా ఎలా ప్రవరిస్తారు అనే సందేహం కలుగుతుంది. అంతలా ఓ వ్యక్తి మానవత్వం మరిచి ఓ మూగజీవిని హతమార్చాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లు ఈ సంఘటనపై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే..

సాధారణంగా రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు మూగజీవులు అడ్డు రావడం సహజంగా జరుగుతుంటుంది. ఇంకా కొన్ని చోట్ల కుక్క, పిల్లి లాంటి జంతువులు రోడ్డుపైన అడ్డంగా పడుకొని ఉంటాయి. ఆ సమయాల్లో వాహనదారులు అప్రమత్తమై వాహనాన్ని స్లో చేయడం లేదా.. అవి వెళ్లిపోయాక ప్రయాణించడం చేస్తుంటారు. అది మానవత్వం..

Dog-Killed-By-Mercedes-Benz-Viral-Video

కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం అది మరిచిపోయాడు. ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా ప్రయాణించి ఓ మూగజీవిని బలిగొన్నాడు. అక్కడున్న వారు సైతం చోద్యం చూస్తున్నారు. హఠాత్పరిణామానికి తల్లడిల్లిపోయిన ఆ శునకం.. కొద్ది సేపు చావుతో పోరాటం చేసి చివరికి ప్రాణాలు(Benz Car Driver Kills Dog) కోల్పోయింది. గోవాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ప్రూడెంట్ మీడియా గోవా ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది. మెర్సిడెస్‌ బెంజ్‌ కారు.. గోవాలోని ఓ హౌసింగ్ సొసైటీలోకి ప్రవేశిస్తోంది. ఆ సమయంలో ఓ కుక్క గేటు ముందు నిద్రపోతోంది. అయితే సెక్యూరిటీ గార్డు గేటు తీయగానే.. కుక్క అక్కడి నుంచి కదలకపోయినా.. డ్రైవర్‌ కారును ఆపకుండానే ముందుకు పోనించాడు. ఆ తర్వాత కనీసం పక్కకైనా వెళ్లకుండానే నిద్రిస్తున్న కుక్క మీదుగా కారును నడిపాడు.

Dog-Killed-By-Mercedes-Benz-Viral-Video

హఠాత్పరిణామానికి తల్లడిల్లిన ఆ శునకం వెంటనే నిద్ర లేచింది. కారు(Mercedes Benz) మీద నుంచి వెళ్లిపోవడంతో అరుపులు, కేకలు పెట్టింది. అలాగే కుంటుకుంటూ ఓ పక్కకు వెళ్లిపోయింది. ఆ సమయంలో అక్కడ కొంతమంది ఉన్నా కూడా ఆ దృశ్యాన్ని ఓ చోద్యంలా చూస్తూ ఉండిపోవడాన్ని వీడియోలో చూడవచ్చు.

వీడియోను పరిశీలించినట్లయితే రోడ్డు వెడల్పుగా ఉంది. కారు డ్రైవర్‌ సైడ్‌ తీసుకుని కుక్కను కాపాడవచ్చు. అంతే కాకుండా గేటు దాటుకుని లోపలకు వచ్చే ముందు కారు వేగాన్ని కూడా తగ్గించాడు. అయినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే బెంజ్‌ కారు డ్రైవర్‌.. కుక్క మీదుగా పోనిచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా గాయపడిన కుక్క.. గాయాలతో తల్లడిల్లుతూ 30 నిమిషాల తర్వాత మరిణించినట్లు సమాచారం.

Dog-Killed-By-Mercedes-Benz-Viral-Video

ఈ వీడియో ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు దీనిపై స్పందించారు. కారు యజమాని భరత్‌ నటేకర్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఆ లగ్జరీ కారు యజమాని.. ఇలా కుక్కను చంపడం ఇదే మొదటిసారి కాదట. గతంలోనూ ఇలాగే ఓ కుక్కను చంపినట్లుగా తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, February 24, 2024, 8:45 [IST]
English summary
Mercedes benz car owner runs over sleeping dog in goa video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+