కారు ఆపడానికి పోలీస్ గన్ తీయాల్సి వచ్చింది.. హైదరాబాద్‌లో అనూహ్య సంఘటన [వీడియో]

సాధారణంగా పోలీసులు రాత్రి సమయంలో వచ్చే పోయే వాహనాలను చాలా వరకు తనికీ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొంతమంది వాహనదారులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిని పోలీసులు వెంబడింది పట్టుకుంటారు. అయితే హైదరాబాదులో కారుని ఆపడానికి పోలీస్ గన్ చూపించాల్సి వచ్చింది.

నివేదికల ప్రకారం, హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు గత సోమవారం రోజున తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ సమయంలో ఒక కన్వర్టిబుల్ బెంజ్ కారులో కొంతమంది యువకులు పోలీసులను నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ కారుని విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్ ఆపడానికి ప్రయత్నించినప్పుడు వారు ముందుకు కదిలారు, ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ఎస్ఐ గన్ తీసుకుని దిగండి అన్నట్లు చెబుతాడు.

కారు ఆపడానికి పోలీస్ గన్ తీయాల్సి వచ్చింది

గన్ చూసిన వెంటనే ఆ యువకులు కారుని ఆపి కిందికి దిగుతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గమనించినట్లయితే ఆ యువకులు కారు దిగిన తరువాత వెనుక ఉన్న బూట్ లో పోలీసులు తనిఖీ చేయడం చూడవచ్చు. ఆ తరువాత కారుకి సంబంధించిన డాక్యుమెంట్స్ చూసిన తరువాత కారుని, ఆ యువకులను వదిలిపెడతాడు. ఇలాంటి సంఘటన గతంలో కూడా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తనిఖీ చేసేటప్పుడు వాహనాలను ఆపి డాక్యుమెంట్స్ చూడటం సహజమే, కానీ వాహనం ఆపకుండా ముందుకు వెళ్లేవారికి గన్ చూపించి వాహనాలు ఆపడం ఇదే మొదటి సారి కాదు. నిజానికి పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పుడు వాహనదారులు కూడా తప్పకుండా పోలీసులకు సహకరించాలి. అలా సహకరించనప్పుడే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే పోలీస్ తీసిన గన్ ప్రభుత్వం అందించిన లైసెన్స్ కలిగి ఉంది.

తనిఖీలో పోలీస్ గన్ బయటకు తీయడానికి ప్రధాన కారణం ఆ కారుని ఆపడమే, అంతకు మించి ఇతర ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి సంఘటన 2019 లో ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. ఆ సంఘటనలో పోలీసులు సాధారణ వాహన తనిఖీ చేసే సమయంలో వారిపై తుపాకీ చూపించినట్లు తెలిసింది. అప్పట్లో కూడా ఈ సంఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

పోలీసులు ప్రభుత్వం అందించిన లైసెన్స్ కలిగి ఉంటారు, కావున వారు విధుల్లో ఉన్నప్పుడు తప్పని సరి సమయంలో గన్ ఉపయోగించవచ్చు. అయితే ఇది ఒక రకంగా ప్రజలను భయానికి గురి చేస్తుంది. అయినప్పటికీ పోలీసులు తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చు. అనవసరంగా గన్ బయటకు తీసి ప్రజలను భయపెడితే అది తప్పకుండా నేరమే అవుతుంది. హైదరాబాద్ లో జరిగిన సంఘటనలో పోలీస్ కారుని ఆపాలనే ఉద్దేశంతో గన్ బయటకు తీశారనిపిస్తుంది.

గతంలో కొంత మంది విధి నిర్వహణలో ఉన్న అధికారులను గన్ తో కాల్చిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దానిని దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులుకు తుపాకీలు ఇవ్వడం జరుగుతుంది. దీనిని తప్పకుండా ప్రజలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడే పోలీసులను తప్పుగా భావించే అవకాశం ఉండదు. అయితే పోలీసులు కూడా విధి నిర్వహణలో తప్పా సొంత ప్రయోజనాల దృష్ట్యా తుపాకీలు ఉపయోగించకూడదు.

ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి, కావున దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణించే వారి సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే వాహన వినియోగదారులు నిబంధనలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను తెలుసుకోవడంతో పాటు, మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, December 29, 2022, 6:30 [IST]
English summary
Mercedes benz guy refuse to stop in police checking details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+