ఆటోవాలా సాయంతో మునుకెళ్లిన మెర్సిడెస్ బెంజ్ కారు - వీడియో

నిజానికి భారతదేశంలో ఎటువంటి సమస్యనైనా సమయస్ఫూర్తితో ఎదుర్కునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కారం వెతికేస్తారు. అది చూసే వారికి కొంత వింతగా అనిపించే అవకాశం ఉంటుంది, కానీ సమస్య అప్పటికి పరిష్కారమయిపోతుంది. అలాంటి సంఘటన ఇటీవల పూణేలో జరిగింది.

నివేదికల ప్రకారం, పూణేలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో ఒక మెర్సిడెస్ బెంజ్ కారుని ఆటో వాలా తన ఆటో రిక్షాలో కూర్చుని నెట్టుకుంటూ వెళ్ళాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే మెర్సిడెస్ బెంజ్ కారు బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల దానిని వర్క్ షాప్ కి తీసుకెళ్లడానికి ఆటో వాలా సాయం చేస్తున్నాడు. ఒక పక్క ఆటో నడుపుతూనే తన కాలితో బెంజ్ కారుని ముందుకు నెడుతున్నాడు.

ఆటోవాలా సాయంతో మునుకెళ్లిన మెర్సిడెస్ బెంజ్ కారు

ఒక వేళా రద్దీగా ఉండే ప్రదేశాల్లో వాహనాలకు బ్రేక్ డౌన్ అయితే దానిని వర్క్ షాప్ కి తీసుకెళ్లడానికి ఏదైనా ట్రక్కునే లేదంటే ఇతర పెద్ద వాహనాలనో ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో అలాంటి పెద్ద వాహనాల కోసం వేచి ఉండకుండా, ఆటో సహాయంలో ముందుకు వెళుతున్నారు. ఇది మంచి సమయస్ఫూర్తి అనే చెప్పాలి. కానీ దీని వెనుక ప్రమాదం కూడా దాగి ఉంటుంది.

ఆటో డ్రైవర్ ఆటో నడుపుతూ కారుని ముందుకు నెడుతున్నప్పుడు, ఆటోని కంట్రోల్ చేసే అవకాశాలు తక్కువ. అంతే కాకుండా అతను ఒక కాలుతో నెడుతున్న సమయంలో ఇతర వాహనాల వల్ల అతని కాలికి కూడా ఏదైనా ప్రమాదం జరగవచ్చు. కావున ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండటం వీలైనంత వరకు మంచిది. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదు. దీని వల్ల లాభం తక్కువే కానీ ప్రమాదం జరిగితే అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది.

ఈ సంఘటన పూణేలోని కోరేగావ్ పార్కులో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో మనకు కనిపించే కారు మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ అని తెలుస్తుంది. ఈ లగ్జరీ కారు బరువు సుమారు 1,500 కేజీల కంటే ఎక్కువగా ఉంటుంది. అలంటి వాహనాన్ని రద్దీగా ఉండే రోడ్డు మీద ఈ రకంగా ముందుకు తీసుకెళ్లడం చాలా ప్రమాదం. ఇది కేవలం ఆ వాహన వినియోగదారులకు మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులను కూడా ప్రమాదంలోకి నెట్టివేస్తుంది.

ఇందులో బ్రేక్ డౌన్ అయినా కారుని ఆటో సాయంతో ముందుకు తీసుకెళుతున్నారు. ఆ సమయంలో ఆ బెంజ్ కారు ఒక వేళా వేగంగా ముందుకు నెట్టబడితే అది ఎదురుగా ఉండే ఇతర వాహనాల మీదికి వెళ్లొచ్చు. ఆ సమయంలో ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మనమే ఊహించవచ్చు. నిజానికి ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు ఎక్కడో ఒక దగ్గర వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి.

ప్రజా రహదారుల మీద వెళ్ళేటప్పుడు రోడ్లు చాలా రద్దీగా ఉంటాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కావున వాహన వినియోగదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అలా పాటించని సందర్భాల్లో మన ఊహకు అందని అనర్థాలే జరుగుతాయి. ఇలాంటి వాటిని ఎప్పుడు ప్రోత్సహించకూడదు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకోవాలి. లేకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి.

భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, కావున ఎల్లప్పుడూ రోడ్లు చాలా రద్దీగా ఉంటాయి. అయితే ఢిల్లీ, పూణే మొదలైన నగరాల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. కావున వాహనాలకు బ్రేక్స్ డౌన్ అయితే వాటిని తరలించడానికి సరైన వాహనాలను ఎంచుకోవాలి. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, December 17, 2022, 10:35 [IST]
English summary
Mercedes benz pushed by auto rickshaw pune video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+