మెర్సిడెస్ బెంజ్ బుల్లెట్‌ప్రూఫ్ ఎస్600 ఆవిష్కరణ

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ విఐపిల భద్రత కోసం ఓ బుల్లెట్ ప్రూఫ్ కారును విడుదల చేసింది. 'మెర్సిడెస్ బెంజ్ ఎస్600 గార్డ్' (Mercedes-Benz S600 Guard) పేరిట కంపెనీ ఈ మోడల్ విడుదలైంది. కంపెనీ అందిస్తున్న రెగ్యులర్ ఎస్-క్లాస్ కారుకు సాయుధ వెర్షనే ఈ ఎస్600 గార్డ్.

ఇది కూడా చదండి: బ్రేకులు లేని బైకులతో రేస్

బుల్లెట్ దాడులు, బాంబు దాడులను సమర్థవంతంగా తట్టుకుని, కారు లోపల ఉన్న ప్రయాణీకులకు పూర్తి రక్షణ కల్పించేలా దీనిని ప్రత్యేకమైన, ధృడమైన స్టీల్‌తో తయారు చేశారు. ఇది పాలీకార్బోనేట్ కోట్‌ని కలిగి ఉండి, లోపల ఉన్న ప్రయాణీకులను సురక్షితంగా ఉంచడంలో సహకరిస్తుంది.


ఈ కారులో పవర్‌ఫుల్ 6.0 లీటర్ వి12 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 530 బిహెచ్‌పిల శక్తిని, 830 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7జి-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఎస్-క్లాస్ గార్డ్ గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు.

ఇది కూడా చదండి: ప్రపంచంలో కెల్లా అతిచిన్న బైక్

రెగ్యులర్ ఎస్-క్లాస్‌కు మరియు సాయుధ ఎస్-క్లాస్ గార్డ్ కార్లకు మధ్య ఎలాంటి వ్యత్యాసం కనిపించకుండా ఉండేలా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. ఈ రెండు రకాల కార్లను పక్కపక్కనే ఉంచితే, ఇందులో ఏది రెగ్యులర్ కారు లేక ఏది బుల్లెట్ ప్రూఫ్ కారు అనేది గుర్తించడం కష్టమవుతుంది (సెక్యూరిటీ కోసమే ఇలా చేశారు).

Bulletproof S600

సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించిన అన్ని టెస్టులను ఈ కారు పాస్ అయ్యింది. ఇందులోని గ్లాస్ ఏరియాని లోపలి వైపు నుంచి పాలీకార్బోనేట్‌తో కోటింగ్ చేశారు, ఇంకా ఇది ల్యామినేటెడ్ స్ట్రక్చర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో పానిక్ అలారమ్ సిస్టమ్, ఓపాక్యూ రోలర్ బ్లైండ్స్, ఎమర్జెన్సీ ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్, హైడ్రాలిక్ సైడ్ విండో, గింబాల్ రియర్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, స్పెషల్ రియర్ కూలింగ్ కంపార్ట్‌మెంట్, హీటెడ్ విండ్‌స్క్రీన్ అండ్ సైడ్ విండోస్ ఇందులో చెప్పుకోదగిన సేఫ్టీ ఫీచర్లు.

More from DriveSpark

Article Published On: Thursday, August 7, 2014, 9:44 [IST]
English summary
German automobile manufacturers are popularly known for their build quality. Mercedes-Benz has been successful with their S-Class and provide more than adequate protection with it. However, now VIPs can opt for a bulletproof version of the vehicle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+