హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్; ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

భారతదేశంలో రోడ్డుప్రమాదాలు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రోడ్డుప్రమాదాలు పెరగడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, మధ్య తాగి డ్రైవ్ చేయడం మరియు మితిమీరిన వేగం. రోడ్డు ప్రతి సంవత్సరం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, లెక్కకు మించిన జనం ప్రమాదాల భారిన పడి అంగ వైకల్యులుగా మారిపోతున్నారు.

రోడ్డు ప్రమాదాల గురించి మీరు ప్రతి రోజు వార్తల్లో చదువుతున్నారు. ఇదే తరహాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..

బీభత్సం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్; ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

నివేదికల ప్రకారం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బుధవారం ఉదయం ఒక మెర్సిడెస్ బెంజ్ వేగంగా పాదచారుల మీదికి వెళ్ళింది. ఆ ప్రమాదంలో ఒక వృద్ధ మహిళ మృతి చెందింది. అంతే కాదు ఇందులో చాలామంది గాయపడినట్లు తెలిసింది.

బీభత్సం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్; ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

ప్రమాదానికి కారణమైన మెర్సెడ్స్ బెంజ్ కారుని, ఆ కారు యొక్క యజమాని జాయ్‌రైడ్ కోసం బయటకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో అతనితో పాటు ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు. అతడు తన కారుతో ఓల్డ్ సిటీ గుండా వెళుతుండగా కారుపై నియంత్రణ కోల్పోయాడు, కారుపై నియంత్రణ కోల్పోయిన వెంటనే అక్కడున్న ఆటోని డీ కొన్నాడు. అంతే కాకుండా ఎనిమిది మంది పాదచారులపై దూసుకెళ్లాడు.

బీభత్సం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్; ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోలను బట్టి చూస్తే ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. ఈ ప్రమాదంలో 70 ఏళ్ల మహిళను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన 7 మంది గాయాలపాలయ్యారు.

బీభత్సం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్; ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

ఈ సంఘటనలో గాయపడిన 7 మందిని హాస్పిటల్ కి తరలించారు. వీరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన తరువాత కారు ఓనర్ మరియు అతని స్నేహితుడు అక్కడినుంచి పారిపోయారు. అయితే కారు యజమానిపై కేసు నమోదు చేశారు.

బీభత్సం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్; ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

నిందుతుల కోసం షాలిబాండా పోలీసులు ఆ ప్రాంతంలో సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణమైన కారుని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనకు కారణమైన కారు మెర్సిడెస్ జిఎల్-350 గా గుర్తించారు. దీని ధర దాదాపు రూ. 70 లక్షలకు పైగా వుండే అవకాశం ఉంది.

బీభత్సం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్; ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

వాహనదారుల అశ్రద్ధవల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం వాహనదారుని నిర్లక్యం వల్ల జరిగినట్లు తెలుస్తోంది. వాహనదారుడు చేసిన చిన్న తప్పిదం ఎంతోమంది జీవితాలను కుంగదీసింది. వాహదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే వారికీ వారి చుట్టుపక్కల ఉన్న వారికీ క్షేమం.

Most Read Articles

English summary
Mercedes Driver Runs Over Eight Pedestrians, One Killed. Read in Telugu.
Story first published: Friday, June 25, 2021, 12:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X