Just In
- 8 hrs ago ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- 9 hrs ago నానో కంటే చిన్న కారు ఉందని మీకు తెలుసా.. టాటా మోటార్స్‌కు ఆ కారు చాలా ప్రత్యేకం
- 10 hrs ago అందం బైక్ రైడ్ చేస్తే ఇలాగే ఉంటుందా? మతిపోగొడుతున్న వీడియో
- 11 hrs ago BYD SEAL ఎలక్ట్రిక్ సెడాన్ డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ వీడియో
Don't Miss
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- News తెలంగాణలో నాల్గోరోజు 144 మంది నామినేషన్లు: ప్రముఖులు వీరే
- Movies టెలిఫోన్ ట్యాపింగ్‌లో సమంత, రకుల్? .. మరో 13 హీరోయిన్లను లొంగదీసుకొని అలా బ్లాక్ మెయిల్ అంటూ
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
వైద్య పరికరాల తయారీలో నేనే సైతం అంటున్న మెర్సిడెస్ బెంజ్
ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన వైరస్ కరోనా. చైనాలో పుట్టిన ఈ వైరస్ నేడు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే చామంది ప్రజలు చనిపోయారు. అంతే కాకుండా ఈ వైరస్ ప్రభావానికి లోనవుతున్న ప్రజల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.
ఈ వైరస్ ని నివారించడానికి ప్రభుత్వాలు చాలా కట్టు దిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలకు తమ వంతు సహాయంగా ఇప్పటికే చాల కంపెనీలు వైద్య పరికరాలను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి సహాయం చేతియడానికి మరియు కరోనా బాధితులను కాపాడటానికి లగ్జరీ కార్ల సంస్థ అయిన బెంజ్ ఇప్పుడు నేను సైతం అంటోంది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన మెర్సిడెస్ బెంజ్ 3 డి ప్రింటర్ల సహాయంతో వైద్య పరికరాల ఉత్పత్తికి తన మద్దతును అందిస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
మెర్సిడెస్ బెంజ్ ఎజి ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్ యొక్క బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యుడు జోర్గ్ బర్జర్ మాట్లాడుతూ, అత్యంత సమర్థవంతమైన మా బృందం 3 డి ప్రింటింగ్ టెక్నాలజీతో వైద్య పరికరాల ఉత్పత్తికి సహకారం అందిస్తోంది.
అంతే కాకుండా తాము బాడెన్-వుర్టంబెర్గ్ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తున్నాము. బాగా నైపుణ్యం కలిగిన నిపుణులు వీటి ఉత్పత్తికి సహాయం చేస్తారు. ఇప్పుడు మా ఉత్పత్తులు కరోనా వైరస్ నివారణకు ఉపయోగపడే వైద్యపరికరాల తయారీ అన్నారు. మా 3 డి ప్రింటర్లు వైద్య సదుపాయానికి అవసరమయ్యే పరికరాలను తయారు చేయడం కోసం ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయి.
మెర్సిడెస్ బెంజ్ ప్రతి సంవత్సరం దాదాపు 150,000 ప్లాస్టిక్ మరియు లోహ భాగాలను ఉత్పత్తి చేయడానికి 3 డి ప్రింటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ నిర్దారించింది. ఈ సామర్థ్యాన్ని ఇప్పుడు పూర్తిగా వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నామన్నారు.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు
ప్రస్తుతం మరింత విస్తరిస్తున్న కరోనాని అరికట్టడానికి మెర్సిడెస్ బెంజ్ తన వంతుగా తమ 3 డి ప్రింటింగ్ టెక్నాలజీతో వైద్య పరికరాల ఉత్పత్తికి సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
MOST READ:కరోనా గుడ్ న్యూస్: సూపర్ ఫాస్ట్ టెస్టింగ్ కిట్ సిద్దం చేసిన బాష్