6x6 పికప్ ట్రక్కుగా మారిన మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్ గురించి మనకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ఈ లగ్జరీ పికప్ ట్రక్‌కు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. జర్మన్ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ 2017లో తొలిసారిగా ఈ పికప్ ట్రక్కును విడుదల చేసింది. అయితే, కొన్ని కారణాల వలన కంపెనీ దీనిని 2020లో నిలిపివేసింది.

6x6 పికప్ ట్రక్కుగా మారిన మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్ 4x4 డ్రైవ్ (ఫోర్-వీల్ డ్రైవ్) ఆప్షన్‌తో లభించేంది. లగ్జరీ ఇంటీరియర్స్‌తో రూపుదిద్దుకున్న ఈ ఎక్స్-క్లాస్ పికప్ ట్రక్ దాని అధిక ధరల కారణంగా మార్కెట్లో ఆశించిన విజయాలను సాధించలేకపోయింది. పైపెచ్చు మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ నుండి కస్టమర్లు సెడాన్లు, ఎస్‌యూవీలు మరియు స్పోర్ట్స్ కార్లపైనే ఎక్కువ ఆసక్తి కనబరచారు.

6x6 పికప్ ట్రక్కుగా మారిన మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్

నిజానికి మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్ పికప్ ట్రక్కు ఓ అద్భుతమైన కారుగా చెప్పుకోవచ్చు. దాని డిజైన్ సాధారణ పికప్ ట్రక్కు మాదిరిగానే ఉన్నప్పటికీ, అందులోని ఇంటీరియర్స్ మరియు ఇంజన్ పెర్ఫార్మెన్స్ వంటి విషయాల్లో ఇది చాలా మెరుగ్గా ఉండేది.

MOST READ:రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

6x6 పికప్ ట్రక్కుగా మారిన మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్

అలాంటి ఓ మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్ పికప్ ట్రక్కును కార్‌లెక్స్ డిజైన్స్ అనే కార్ కస్టమైజేషన్ సంస్థ 6x6 (సిక్స్ వీల్ డ్రైవ్) పికప్ ట్రక్కుగా మోడిఫై చేసింది. ఒరిజినల్ ఎక్స్-క్లాస్ పికప్ ట్రక్కు కొలతల్లో ఎలాంటి మార్పు చేయకుండా, పికప్ బెండ్ క్రింద స్వల్ప మార్పులు చేసి, దీనిని అదనంగా మరో రెండు టైర్లను జోడించారు.

6x6 పికప్ ట్రక్కుగా మారిన మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్

ఈ కస్టమ్-మేడ్ మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్ సిక్స్ వీలర్‌ను కంపెనీ యొక్క ఎక్స్350డి వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించారు. ఇందులో శక్తివంతమైన 3.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి ఆరు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది.

MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?

6x6 పికప్ ట్రక్కుగా మారిన మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్

ఈ వాహనాన్ని మెర్సిడెస్ జి63 ఏఎమ్‌జి 6X6 నుండి ప్రేరణ పొంది డిజైన్ చేశారు. దీని ఫ్రంట్ డిజైన్‌లో భారీ మార్పులు చేశారు. సరికొత్త ఫ్రంట్ బంపర్, మోడిఫైడ్ హెడ్‌ల్యాంప్స్, పెద్ద వీల్ ఆర్చెస్ మరియు పెద్ద నాబీ టైర్లు, బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్, పికప్ వెనుక భాగంలో మోడిఫై చేసిన రోల్-బార్ వంటి మార్పులు ఇందులో ఉన్నాయి.

6x6 పికప్ ట్రక్కుగా మారిన మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్

పికప్ బెడ్ క్రింది భాగంలో వాహనం యొక్క సబ్‌ఫ్రేమ్‌కు అదనపు యాక్సిల్ మరియు రెండు అదనపు చక్రాలకు జోడించారు. ఈ మార్పు వలన సస్పెన్షన్ 10 సెం.మీ ఎత్తు పెరుగుతుంది. అన్ని చక్రాలు ఆఫ్-రోడ్ మరియు ఆన్-రోడ్‌కు అనుగుణంగా ఉన్నాయి. ధృడమైన స్టీల్ రిమ్స్‌పై ఎల్‌టి285/65 ఆర్18 ప్రొఫైల్ ఆల్-టెర్రైన్ టైర్లను ఉపయోగించారు.

MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

6x6 పికప్ ట్రక్కుగా మారిన మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్

ఇంకా ఇందులో మెర్సిడెస్ జిటిఆర్ ఫ్రంట్ గ్రిల్, మజిక్యులర్ ఫెండర్ మరియు కస్టమ్ డోర్ ప్రొటెక్టర్లను కూడా ఉపయోగించారు. దీని ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్‌ను మార్చలేదు, స్టాక్ స్థితిలోనే ఉంచారు. ఓవరాల్‌గా ఈ పికప్ ట్రక్కు చూడటానికి చాలా గంభీరమైన వైఖరిని కలిగి ఉంటుంది.

6x6 పికప్ ట్రక్కుగా మారిన మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్

ఇంటీరియర్స్‌లో మార్పులు చాలా పరిమితంగా ఉన్నాయి. స్టాక్ మోడల్‌లో కనిపించిన అన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌ను ఈ మోడిఫైడ్ 6x6 పికప్ ట్రక్కులో కూడా చూడొచ్చు. ఈ మోడిఫైడ్ పికప్ ట్రక్కును క్లాసిక్ యంగ్‌టైమర్స్‌ డాట్‌కామ్‌లో అమ్మకానికి ఉంచారు.

MOST READ:చదివింది ఇంజనీరింగ్; చేసేది దొంగతనం.. చివరకు పోలీసులచే అరెస్ట్

6x6 పికప్ ట్రక్కుగా మారిన మెర్సిడెస్ బెంజ్ ఎక్స్-క్లాస్

ఈ మోడిఫైడ్ మెర్సిడెస్ ఎక్స్-క్లాస్ ఇంజన్‌లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులోని 3.0 లీటర్, టర్బోచార్జ్డ్ వి6 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 3,600 ఆర్‌పిఎమ్ వద్ద 258 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1,600 ఆర్‌పిఎమ్ వద్ద 550 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సెవన్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Mercedes Benz X-Class Modified Into An Aggressive 6x6 Pickup, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X