కారు ధర రూ. 7 లక్షలు.. రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రూ. 1 కోటి వెచ్చించిన వ్యక్తి... నంబర్ చూశారా?
ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. ప్రస్తుతం డిజైన్ పరంగా అతి చిన్న హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఇది కేవలం సిటీలలో తిరిగేందుకు అనువైన కారుగా ఉంటుంది. ఇంత చిన్న కారు కోసం ఓ యజమాని ఏకంగా రూ. రూ.కోటి విలువైన ఫ్యాన్సీ నంబర్ పొందారు. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..
ఈ కారుకు సంబంధించిన నంబర్ ప్లేట్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆటో జర్నల్ పేజీలో రూ .1 కోటి విలువైన ఈ ఫ్యాన్సీ నంబర్‌తో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన చాలా మంది ఈ సమాచారం నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ కారుపై ఉన్న నంబర్ ఢిఫరెంట్‌గా ఉండటమే కారణం.

ఈ కారుకి ఆర్ఎన్‌క్యూ 4 (RNQ 4) అనే నేమ్ ప్లేట్‌తో కనిపించింది. అయితే నంబర్ ఢిఫరెంట్‌గా ఉండటంతో పలువురి కామెంట్ల రూపంలో ఇది ఫేక్‌ని రాసుకొచ్చారు. పైగా ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వలేదనేది పలువురి కామెంట్ చేస్తున్నారు. ఉదాహరణకు రిజిస్ట్రేషన్ నంబర్ (TS 30 J 7340) స్టేట్ కోడ్, ఆర్టీఓ నంబర్, ఇంగ్లీష్ లెటర్ సిరీస్ కోడ్, నాలుగు అంకెల నంబర్లు ఉంటాయి.
కానీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించే రిజిస్ట్రేషన్ నంబర్ పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ఒక ప్రత్యేకతను కూడుకుంది. అయితే ఈ నంబర్ వింటేజ్ కార్లలో కనిపించేవని తెలిసింది. అదే నంబర్‌ని సదరు వ్యక్తి కొత్త కారు కామెట్ ఈవీ కోసం దరఖాస్తు చేసుకుని పొందారని తెలుస్తోంది. ఇలా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
పైన తెలిపిన నంబర్ కోసం ఇతను రూ. కోటి చెల్లినట్లు తెలిసింది. దీనిని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాహన్ సైట్‌లో సెర్చ్ చేయగా రిజిస్ట్రేషన్ నంబర్ నకిలీది కాదని.. కామెట్ ఈవీకి నిజంగానే ఈ నంబర్ రిజిస్టర్ అయిందని తేలింది. ఈ కారు 2024 ఆగస్టు 25న రిజిస్టర్ అయినట్లు స్పష్టం అయ్యింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ నెంబరు విలువ రూ. కోటి అంటే నమ్మశక్యంగా లేదని మరికొందరు అంటున్నారు.
ఇలా మార్చుకునేందుకు ఆర్టీవో ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నంబర్ సిరీస్ తదితర విషయాలు పరిశీలించిన తర్వాత కొత్త వాహనానికి పాత రిజిస్ట్రేషన్ నంబర్‌ని నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఫ్యాన్సీ నంబర్ కోసం ఎక్కువ ఖర్చు లేకుండా సొంతం చేసుకోవచ్చు. నిర్దిష్ట రిజిస్ట్రేషన్ నంబర్‌ని పొందేందుకు కనీసం 3 సంవత్సరాల ముందే రిజర్వ్ చేసుకుంటే తక్కువ ఫీజులో నంబర్‌ని దక్కించుకోవచ్చు.
భారతదేశంలోని కొందరు ధనవంతులు మాత్రం తమకు నచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్‌ని పొందడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇటీవల రాజస్థాన్‌కి చెందిన రాహుల్ తనేజా అనే వ్యాపారవేత్త తన జాగ్వార్ లగ్జరీ కారు కోసం RJ 45 CG 1 నంబర్ కోసం రూ.16 లక్షలు వెచ్చించాడు. అంబానీ నుంచి సినీ తారల వరకు చాలా మంది తమకు నచ్చిన నంబర్ల కోసం లక్షల రూపాయలు కుమ్మరిస్తున్నారు.
డ్రైవ్స్‌పార్క్ ఒపీనియన్: రూ .1 కోటి వెచ్చించి మీరు భారతదేశంలో ఒక లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ మొత్తాన్ని కామెట్ లాంటి బడ్జెట్ కారు నంబర్ ప్లేట్ కోసం ఖర్చు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కామెట్ ఈవీ ఒక ఎలక్ట్రిక్ కారు, ఇది చాలా చిన్నది కాని ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఈ నంబర్‌ని యజమాని బహుశా సెంటిమెంట్ కోసం తీసుకుని ఉంటాడు.


Click it and Unblock the Notifications








