భారత్‌లో ఈ ఎలక్ట్రిక్‌ కారుకు తొలి యాక్సిడెంట్‌.. ఈ ఫీచర్లు కాపాడాయి..!

భారత్‌లో కొన్ని నెలల క్రితం ప్రముఖ కార్ల తయారీ సంస్థ MG కొత్త కారును విడుదల చేసింది. ఈ MG Comet EV కారు అతి తక్కువ కాలంలోనే అందరి ప్రశంసలు అందుకుంది. చిట్టి కారుగా అందరికి గుర్తుండి పోయింది. ఎంజీ కామెట్‌ ఎలక్ట్రిక్‌ కారు డిజైన్‌, ఆకట్టుకొనే పరిమాణం వినియోగదారులను త్వరగానే ఆకర్షించింది.

ఈ ఎంజీ కామెట్‌ కారు భారతదేశంలో ప్రారంభించిన తర్వాత తొలిసారిగా ప్రమాదానికి గురైంది. ఓ జంక్షన్‌లో హ్యుందాయ్‌ i10 NIOS, ఎంజీ కామెట్‌ కార్లు ఢీకొన్నాయి. ఎంజీ కామెట్‌ కారు డ్రైవర్ అతి వేగంగా వచ్చి హ్యుందాయ్‌ కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. హ్యుందాయ్‌ వాహనం భారీగా డ్యామేజీ అయింది.

MG comet EV first crash in india

అయితే ఈ ఘటనకు సంబంధించిన లైవ్‌ వీడియో అందుబాటులో లేదు. కానీ ప్రమాదానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనలో MG కామెట్‌, హ్యుందాయ్‌ కార్లలోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో హ్యుందాయ్ i10 నియోస్‌ కారు ముందు, సైడ్‌ భాగాల్లో బాగా డ్యామేజీ అయింది. ఎంజీ కారు ముందు బాగా మాత్రం కొద్దిగా దెబ్బతింది. ప్రమాదం సమయంలో ఎంజీ కామెట్‌ కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. ఫలితంగా డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డారు.

MG comet EV first crash in india

MG కామెట్‌ ఎలక్ట్రిక్‌ కారు ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. కొద్ది క్షణాల్లోనే ఆకట్టుకుంటుంది. ఈ కారు లోపలి భాగం 10.25 అంగుళాల స్క్రీన్‌లుంటాయి. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్‌, మరొకటి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌. తెలుపు, బూడిద రంగు ఇంటిరియర్‌ను కలిగి ఉంటుంది.

ఎంజీ కామెట్‌ ఈవీ టూ స్పోక్‌ 9 టచ్‌ స్టీరింగ్‌ వీల్‌, వైర్‌లైస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, కీలెస్‌ ఎంట్రీ, పుష్‌ బటన్‌ స్టార్ట్‌, డిజిటల్‌ కీ, పవర్‌ విండోస్‌, స్టైలిస్‌ గ్రే ఇంటీరియర్ థీమ్, లెదర్‌ స్టీరింగ్‌ వీల్‌ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారు 12 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాహనాలు కంటే చిన్న చక్రాలను కలిగి ఉంటాయి. వెనుకవైపు ఆకర్షణీయమైన విండో కారుకు అదనపు ఆకర్షణను తీసుకొస్తుంది. వెనుకవైపు ఎంజీ కామెట్‌ ఎలక్ట్రిక్ కారు హోరిజోన్‌ కనెక్టింగ్‌ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది.

భద్రతా పరంగా ఎంజీ కామెట్‌ ఎంతో సురక్షితంగా ఉంటుంది. డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS+ EBD, వెనుక పార్కింగ్ కెమెరా, సెన్సార్‌లు, ISOFIX చైల్డ్‌ సీట్‌ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. ఎంజీ కామెట్‌ ఈవీ 17 హాట్‌ స్టాంపింగ్ ప్యానల్స్‌తో అధిక బలం కలిగిన వాహనంగా నిర్మాణం చేశారు. ప్రమాదాల్లో కారు లోపలి భాగాలు ప్రభావితం కాకుండా ఇవి తగినంత రక్షణ ఇస్తాయి. ఫలితంగా మెరుగైన భద్రతను పొందుతారు.

ఈ కారు 2,974mm పొడవు, 1,505mm వెడల్పు, 1,613mm ఎత్తు, 2,010, వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఎండీ కామెట్‌ ఈవీ 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. సాధారణ ఛార్జర్‌తో 0-100 శాతం ఛార్జింగ్‌ అయ్యేందుకు 7 గంటల సమయం పడుతుంది. ఈ కారు ఎలక్ట్రిక్‌ మోటార్‌ గరిష్ఠంగా 42PS శక్తిని, 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, July 28, 2023, 16:19 [IST]
English summary
Mg comet ev records first crash in india video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+