వేలానికి మైఖేల్ షుమాకర్ ఫెరారీ హైపర్‌కార్లు

By Ravi

ఫార్ములా వన్ గురించి అవగాహన ఉన్న వారికి మైఖేల్ షుమాకర్ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఏడు సార్లు ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన మైఖేల్ షుమాకర్ ఉపయోగించిన వస్తువులంటే ఎవరికైనా ఓ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిని వేలం వేస్తే అసలు ధర కన్నా అత్యధిక వెల పలుకుతాయి. గడచిన ఫార్ములా వన్‌కు గుడ్ బై చెప్పి విశ్రాంతి తీసుకుంటున్న షుమాకర్ ఉపయోగించిన రెండు కార్లు ఇప్పుడు వేలానికి వచ్చాయి.

ఫెరారీ రేసింగ్‌ జట్టుకు అఫీషియల్ డ్రైవర్‌గా ఉన్న షుమాకర్ కోసం ఫెరారీ ప్రత్యేకంగా ఓ కారును అభివృద్ధి చేసింది. ఇదే కాకుండా షుమాకర్ కోసం మరొక హైపర్ కారును కూడా ఫెరారీ అందించింది. అందులో ఒకటి ఎన్జో, మరొకటి ఎన్జో ఎఫ్ఎక్స్ఎక్స్ ట్రాక్ కార్. స్వీడన్‌కు చెందిన సూపర్‌‌కార్ డీలర్‌షిప్ గ్యారేజ్ జెనిత్ ఇప్పుడు ఈ కార్లను వేలం వేస్తోంది. తనకు ఇష్టమైన ఫెరారీ కార్ల నుండి షుమాకర్ ఎందుకు విడిపోవాలనుకుంటున్నాడో మాత్రం తెలియడం లేదు.

షుమాకర్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫెరారీ కారులో, ఆయన అభిరుచికి తగినట్లుగా ఇంటీరియర్లు, ఎక్స్టీరియర్లు కనిపిస్తాయి. ఈ కారు బానెట్ క్రింద అనేక మంది ప్రముఖల సంతకాలు ఉంటాయి. ఇది కేవలం 8,500 కి.మీ. మాత్రమే తిరిగినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఎఫ్1 కారు డ్రైవింగ్ అనుభూతిని కల్పించే రోడ్ లీగల్ ఫెరారీ ఇదే. ఎన్జో ఎఫ్ఎక్స్ఎక్స్ విషయానికి వస్తే, ఇది 900 కిలోమీటర్లు తిరిగినట్లు స్పీడోమీటర్ చూపిస్తోంది. ఈ కారును స్పెషల్ ట్రాక్ డేస్‌పై రేస్ ట్రాక్‌పై నడిందేకు మాత్రమే తయారు చేశారు.

ఫెరారీ కంపెనీ మొత్తం 30 ఎన్జో ఎఫ్ఎక్స్ఎక్స్ కార్లను తయారు చేస్తే, షుమాకర్ వద్ద మాత్రమే నలుపు రంగు కలిగిన కారు ఉంది. ఈ ఫెరారీ కార్లను సొంతం చేసుకోవాలనుకునే వారు ఎన్జో కోసం సుమారు 1.47 మిలియన్ డాలర్లను, ఎన్జో ఎఫ్ఎక్స్ఎక్స్ కోసం 2.67 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.

ఫెరారీ ఎన్జో ఎఫ్ఎక్స్ఎక్స్

ఫెరారీ ఎన్జో ఎఫ్ఎక్స్ఎక్స్

ఫెరారీ ఎన్జో ఎఫ్ఎక్స్ఎక్స్
ఫెరారీ ఎన్జో ఎఫ్ఎక్స్ఎక్స్
ఫెరారీ ఎన్జో ఎఫ్ఎక్స్ఎక్స్
ఫెరారీ ఎన్జో హైపర్‌కారు

ఫెరారీ ఎన్జో హైపర్‌కారు

ఫెరారీ ఎన్జో హైపర్‌కారు
ఫెరారీ ఎన్జో హైపర్‌కారు
ఫెరారీ ఎన్జో హైపర్‌కారు
మైఖేల్ షుమాకర్

మైఖేల్ షుమాకర్

More from DriveSpark

Article Published On: Tuesday, July 2, 2013, 12:11 [IST]
English summary
During his long association with Ferrari, seven time Formula One World Champion Michael Schumacher acquired several high priced assets which only an official driver of his caliber can dream of owning. Two such highly coveted assets once owned by the former F1 driver were two Ferrari hypercars. The first is a one-off Enzo developed specially for Schumacher by Ferrari and the other is an Enzo FXX track car. Both these cars are now up for sale at a recognized Swedish supercar dealership, Garage Zénith.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+