విమాన ప్రయాణీకులకు డబుల్ బెడ్, ప్రైవేట్ బాత్రూమ్!

By Ravi

'జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు' అన్నట్లుగా డబ్బుండాలే కానీ ఎన్ని విలాసాలైనా చూడొచ్చు. విమానాల్లో బడ్జెట్ కేటగిరీ నుంచి లగ్జరీ కేటగిరీ వరకు వివిధ విభాగాల్లో సేవలు లభిస్తున్నాయి. అయితే, ఇకనుంచి విమానాల్లో లగ్జరీ హోటల్లలో లభించే సౌకర్యాలు కూడా లభ్యం కానుంది. స్పెషల్ బెడ్‌రూమ్, అటాచ్డ్ బాత్‌‌రూమ్, రూమ్‌బాయ్ ఇలా హోటళ్లలో లభించే అనేక సేవలు విమానాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి.

అబుదాబీకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టనుంది. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానమైన ఎయిర్‌బస్ ఏ380లోని రెండవ అంతస్తు(అప్పర్ డెక్)లో ఈ సేవలను పరిచయం చేయనున్నారు. డబుల్ బెడ్‌రూమ్, బాత్‌రూమ్, పర్సనల్ బట్లర్‌తో మొబైల్ ఫోన్ వినియోగించుకునే సౌకర్యాన్ని కూడా ఈ విమానంలో కల్పించనున్నారు.

Mideast Airline Etihad Offers Bed And Bath Suites

సాధారణంగా విమానాల్లో మొబైల్ ఫోన్లు పనిచేయవు, కొన్ని విమానయాన సంస్థలు మొబైల్‌ను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వవు. కానీ ఈ ఎయిర్‌బస్ ఏ380 విమానంలో మొబైల్ ఫోన్ సేవలతో పాటుగా అంతర్జాలాన్ని (ఇంటర్నెట్) వినియోగించుకునేందుకు వైఫై సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ప్రపంచంలో పూర్తిస్థాయి ప్రైవేట్ సూట్స్‌తో కూడిన తొలి విమాన అపార్ట్‌మెంట్స్‌ను ఎయిర్‌బస్ ఏ380లో ఎతిహాద్ ఏర్పాటు చేస్తోంది.

ఈ లగ్జరీ సూట్‌లలో రిక్లైనింగ్ లాంజ్ సీట్, లగ్జరీ హోటల్‌లో ఉండే విధంగా ఫుల్‌లెంగ్త్ బెడ్, మినీ బార్, వార్డ్‌రోబ్ మొదలైన సదుపాయాలుంటాయి. మంచి సౌండ్‌నిచ్చే హెడ్‌సెట్, వీడియో టచ్‌స్క్రీన్‌తో కూడిన హ్యాండ్‌సెట్స్, గేమింగ్, హైడెఫినిషన్ స్క్రీన్స్ వంటి సరికొత్త సదుపాయాలను కూడా ఇందులో ఆఫర్ చేయనున్నారు. మరికొద్ది రోజుల్లో భారత్‌‌కు కూడా ఎయిర్‌బస్ ఏ380 విమాన సేవలు రానున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో ఇలాంటి లగ్జరీ సేవలు కూడా ఇండియాకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 7, 2014, 11:32 [IST]
English summary
Etihad Airways laid out plans to offer passengers who find first-class seats a bit too tight a miniature suite featuring a closed-off bedroom, private bathroom and a dedicated butler. It's just the latest push by airlines worldwide to attract high-spending customers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+