MiG-21 Crash ఓ ఇంటిపై కూలిన యుద్ధ విమానం.. ముగ్గురు పౌరులు మృతి.. పైలట్ సేఫ్..!
భారతీయ వైమానిక దళానికి చెందిన MiG-21యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. 2023 మే 8న రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాధారణ చెకింగ్ లో భాగంగా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లా సూరత్‌గఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ విమానం బయలుదేరింది. బయలుదేరిన కాసేపటికే ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయట పడ్డాడు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో విమానం ఓ ఇంటిపై విమానం కూలిపోవడంతో ముగ్గురు పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వాయుసేన పైలట్ ను సురక్షితంగా ఉన్నారని తెలిసి సైనిక హెలికాప్టర్ ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

దగ్గర్లోని ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌పై విమానం పడిపోయింది. అదే సమయంలో ఇంట్లోనే ఉన్న ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి భారత వైమానిక దళం కోర్టు విచారణకు ఆదేశించింది.
MiG-21 వైమానిక యుద్ధ నౌకలు చివరి దశలో ఉన్నాయి. ఈ ఫ్లీట్ నుంచి మిగిలిన మూడు విమానాలను 2025 నాటికి నిష్క్రమించేలా ప్రణాళిక చేయబడిందని ANI పేర్కొంది. ఇదే సంవత్సరం జనవరిలో భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్ SU-30, మిరాజ్ 2000 కూలిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా, మరొకటి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదాల్లో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.

గత ఏడాది అక్టోబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన రెండు సంఘటనలు నమోదయ్యాయి. అక్టోబరు 5, 2022లో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో చీతాహ్ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆర్మీ పైలట్ మరణించాడు. ఈ ప్రమాదాలకు గల కారణాలపై విచారణ జరుగుతోంది. ఈ ప్రమాదాలకు గల సాంకేతిక లోపాలపై ఉన్నత అధికారులు ఆరా తీస్తున్నారు.
అక్టోబర్ 21న ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ (వెపన్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్) ALH WSIలో ప్రయాణిస్తున్న ఐదుగురు రక్షణ సిబ్బంది మరణించారు.
గత ఏడాది జూలై 28న రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా సమీపంలో ట్విన్-సీటర్ మిగ్-21 ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోవడంతో అందులోని ఇద్దరు పైలట్లు తీవ్ర గాయాలపాలై మరణించారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

భరత వాయిసేనకు చెందిన విమానాలు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఏప్రిల్‌లో కొచ్చిలో ట్రయల్స్ సమయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చేయడంతో మరో ప్రమాదం జరిగింది. ఈ మార్చిలో ముంబైలో నేవీ హెలికాప్టర్ VVIP విధులు నిర్వర్తించిన తర్వాత కూలిపోయింది.
ఐఏఎఫ్ ప్రవేశ పెట్టిన ఆరు యుద్ధ విమానాల్లో మిగ్-21లు కూడా ఉన్నాయి. సింగిల్-ఇంజిన్, సింగిల్-సీటర్ మల్టీ-రోల్ ఫైటర్/గ్రౌండ్ అటాక్ ప్లేన్‌లు మొదటిసారిగా 1963లో ఇంటర్‌సెప్టర్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా ప్రవేశపెట్టబడ్డాయి. 2025 నాటికి MiG-21 మిగిలిన అన్ని విమానాలను దశలవారీగా తొలగించాలని IAF యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








