Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయబడింది. 2020 మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ ఆకస్మిక లాక్ డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ లాక్ డౌన్ కారణంగా అందరికంటే ఎక్కువ వలస కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వచ్చిన కార్మికులు స్వగ్రామాలకు చేరుకోలేక చాలా కష్టాలను పడుతున్నారు. పని లేకపోవడంతో లక్షలాది మంది కార్మికులు రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నారు. కొంతమంది వాలంటీర్లు మరియు దాతలు కార్మికుల సహాయానికి ముందడుగులు వేసి వారి ఆకలిని తగ్గించడానికి ఆహార వస్తు సామగ్రిని పంపిణీ చేసారు.

దేశ వ్యాప్తంగా దారుణంగా ఉన్న పరిస్థితి కోలుకోవడానికి ఇంకా చాలా నెలలు పడుతుంది. ఈ కారణంగా ఇతర నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు.
MOST READ:XL 100 కొనుగోలుదారులకు గొప్ప ఆఫర్ ప్రకటించిన టివిఎస్

వలస కార్మికులను వారి ఇళ్లకు పంపించడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. రైలు ఖర్చులు భరించలేని వారు కాలినడకన లేదా సైకిల్ ద్వారా వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లకు చేరుకున్నారు.

ఈ పద్ధతిలో తమ ఇళ్లకు చేరుకున్న ముగ్గురు వలస కార్మికులు కటక్ హైవేపై వాలంటీర్ల దృష్టిని ఆకర్షించారు. వాలంటీర్లు అతనిని ప్రశ్నించారు. అతను బెంగళూరు నుండి ఒడిశాలోని బర్ధక్ జిల్లాకు తిరిగి వస్తున్నట్లు చెప్పాడు.
MOST READ:హీరో ఎలక్ట్రిక్ కొత్త ఆన్లైన్ బుకింగ్ స్కీమ్ : ఏంటో తెలుసా !

వాలంటీర్ల విచారణలో, ఒడిశా వలస కార్మికుడు చందన్ మరియు అతని భార్య మరియు స్నేహితుడు తఫన్ బెంగళూరు నుండి తిరిగి వచ్చారు. లాక్ డౌన్ రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో అతను ఆదాయం లేకుండా ఇబ్బందుల్లో ఉన్నాడు.

ఈ కారణంగా వారు తమ స్వగ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. కానీ పట్టణానికి తిరిగి రావడానికి డబ్బు లేదు. ఈ కారణంగానే చందన్ తన భార్య మంగళ సూత్రాన్ని రూ. 15,000 అమ్మి అందులో 5000 రూపాలకు రెండు సైకిల్స్ కొనుక్కుని తన స్వగ్రామానికి తన వారితో బయలుదేరాడు.
MOST READ:లాక్డౌన్ లో కొత్త వాహనం నడుపుతూ కనిపించిన M.S ధోని [వీడియో]

చందన్ అతని భార్య మరియు స్నేహితుడు తఫన్ వారు కొన్న సైకిల్స్‌పై స్వగ్రామానికి తిరిగి వచ్చారు. సైక్లిస్టులు బెంగళూరు నుండి 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి సొంత పట్టణానికి చేరుకున్నారు. వాలంటీర్లు వారికి ఫుడ్ కిట్లు వంటివి అందించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవితాలనే సంక్షోభంలోకి నెట్టివేసింది.