Chandrayaan-3 సూక్ష్మ కళాకారుడి ప్రతిభ.. బంగారంతో విక్రమ్ ల్యాండర్ తయారీ..!
భారత్ సహా ప్రపంచం మొత్తం చంద్రయాన్-3 వైపు చూస్తోంది. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఇవాళ సాయంత్రం 06:04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించనుంది. దాంతోపాటు చంద్రుడిపై ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి అమెరికా, చైనా, రష్యా తర్వాత నాలుగో స్థానాన్ని సంపాదించుకోనుంది.
ఈ సందర్భంగా తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ బంగారు ప్రతిరూపాన్ని రూపొందించాడు. మినియేచర్ ఆర్టిస్ట్ మరియప్పన్ బంగారంతో చిన్న విక్రమ్ ల్యాండర్‌ను రూపొందించాడు. ఇందుకు 4 గ్రాముల బంగారం వినియోగించాడు. ఈ బంగారం విక్రమ్ ల్యాండర్ ఎత్తు కేవలం 1.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. దీన్ని మరియప్పన్ ట్విట్టర్ (X)లో పోస్టు చేశాడు.

దేశంలో ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు.. బంగారంతో సూక్ష్మ రూపాలను తయారుచేయడం తనకు అలవాటని చెప్పాడు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ విక్రమ్ ల్యాండర్ సూక్ష్మ నమూనాను రూపొందించినట్లు చెప్పాడు. ఇందుకోసం తనకు 48 గంటల సమయం పట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరియప్పన్ పనితీరును నెజిజన్లు ప్రశంసిస్తున్నారు.
చంద్రయాన్-2 నుంచి గుణపాఠాలు నేర్చుకున్న ఇస్రో అత్యంత కచ్చితత్వంతో చంద్రయాన్-3ను ప్రయోగించింది. ఇప్పటి వరకు కీలక ఘట్టాల విజయవంతంగా పూర్తిచేసుకుంది. పరిస్థితులు అనుకూలిస్తే ఇవాళ సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 23 సాయంత్రం 05:27 నుంచి ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది.

చంద్రయాన్-3లో అనేక కెమెరాలు, సెన్సార్లను అమర్చింది. వాటిలో ఎటువంటి సమస్య తెలెత్తినా.. మరొకటి పని పూర్తిచేసే విధంగా సర్వం సిద్ధం చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామనే ధృడ విశ్వాసంతో ఇస్రో ఇంది. విక్రమ్ ల్యాండర్.. ఇప్పటికే చంద్రుడి కక్ష్యలో ఉన్న ఆర్బిటర్‌తోనూ, భూమి మీద ఉన్న బేస్ సెంటర్‌లతోనూ సమాచారం పంచుకోగలదు. అయితే రోవర్ మాత్రం కేవలం ల్యాండర్‌కు మాత్రమే సమాచారం ఇవ్వగలదు.
సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన సుమారు నాలుగు గంటల తర్వాత.. విక్రమ్ ల్యాండర్ లోపల ఉన్న ప్రగ్యాన్ రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుంటుంది. సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంటుంది. అక్కడ 14 రోజులపాటు (చంద్రుడిపై ఒక్క పగలుతో సమానం) పరిశోధనలు చేస్తుంది.

చంద్రయాన్-3లోని ల్యాండర్, రోవర్‌ల జీవితకాలం 14 రోజులు మాత్రమే. ఎందుకంటే చంద్రుడినిపై సూర్యరశ్మి ఉన్నంత వరకే విక్రమ్, ప్రగ్యాన్ వ్యవస్థలు పనిచేస్తాయి. 14 రోజుల తర్వాత (లూనార్ పగలు).. అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీలకు పడిపోతాయి. అలాంటి పరిస్థితులో పరికరాలు డ్యామేజ్ అయ్యే అవకాశాలెక్కువ. ఒకవేళ.. చంద్రుడిపై మళ్లీ సూర్యోదయం అయ్యేవరకు విక్రమ్, ప్రగ్యాన్‌లు డ్యామేజీ కాకుంంటే మరో 14 రోజులపాటు పనిచేసే అవకాశం ఉంటుందని ఇస్రో తెలిపింది.
2008 నుంచి చంద్రునిపై భారత అంతరిక్ష సంస్థ - ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. అప్పట్లో చంద్రయాన్-1ను ప్రయోగించింది. అందులో భాగంగా ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడిపై నీటి ఉనికి తొలిసారిగా కనుగొంది. అనంతరం 2019 జులై 22న ఇస్రో చంద్రయాన్-2ను ప్రయోగించింది.
ఇందులో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండింగ్ చేయాలన్నది ఇస్రో ఆలోచన. అయితే చివరి వరకు అంతా సవ్యంగా జరిగినా.. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలానికి కేవలం 2 కిలోమీటర్లు ఎత్తులో విక్రమ్ ల్యాండర్‌లో సమస్య తలెత్తింది. దీంతో ల్యాండంగ్ అత్యంత వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది.


Click it and Unblock the Notifications








