ప్రచార రథంపై నుంచి ముందుకు ఒరిగిన కేటీఆర్‌.. తప్పిన పెను ప్రమాదం, ఘటనకు కారణాలివే.!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో గురువారం(నవంబర్‌ 9) నాడు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ప్రచార ర్యాలీలో అనుకోని సంఘటన ఎదురైంది. ర్యాలీలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం(Telangana Assembly Elections)లో భాగంగా సీఎం కేసీఆర్‌, మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(Minister KTR) జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సిరిసిల్లలో కేటీఆర్‌ నామినేషన్‌ వేసిన అనంతరం ప్రచారం నిమిత్తం అక్కడి నుంచి ఆర్మూర్‌ వెళ్లారు. అక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌ రెడ్డికి మద్దతుగా నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

KTR-Escapes-Falls-From-Campaign-Vehicle

అయితే ఈ క్రమంలో ర్యాలీలో అనుకోని ప్రమాదం సంభవించింది. రోడ్‌షోలో భాగంగా మంత్రి కేటీఆర్‌(Minister KTR falls from campaign vehicle), జీవన్‌ రెడ్డి, ఎంపీ సురేష్‌ రెడ్డితో పాటు స్థానిక నేతలు ప్రచార రథంపై నిల్చున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు పోతున్నారు. ఈ సమయంలో ప్రచార రథం డ్రైవర్‌ సడెన్‌గా బ్రేక్‌ వేశారు. దీంతో నేతలంతా ఒక్కసారిగా ముందుకు పడిపోయారు.

ప్రచార వాహనంపై నేతలంతా ఒక్కసారిగా ముందుకు పడిపోవడంతో రెయిలింగ్ విరిగిపోయింది. అప్పటివరకు ప్రచారంలో భాగంగా ఎలాంటి సపోర్ట్‌ పట్టుకోకుండా నిల్చున్న నేతలంతా.. సడెన్‌ బ్రేక్‌ వేయడంతో బ్యాలెన్స్‌ తప్పి ముందుకు ఒరిగారు. అయితే అక్కడుండి ప్రత్యక్షంగా చూసిన వారు ఈ ప్రమాదానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో కూడా హాట్‌ టాపిక్‌గా మారింది.

KTR-Escapes-Falls-From-Campaign-Vehicle

ప్రమాదానికి సంబంధించి అసలు కారణమేంటనేది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రచారం నిర్వహిస్తుండగా.. అక్కడ జనాలు ఎక్కువగా లేకపోవడంతో వాహనం కొంచెం స్పీడ్‌గానే ముందుకు వెళుతోందట. కానీ డ్రైవర్‌.. పైన ఉన్న విద్యుత్‌ తీగలను గమనించకపోవడంతో కింద ఉన్న వారు హెచ్చరిస్తూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు.

తీరా దగ్గరికి వచ్చాక డ్రైవర్‌ గమనించడంతో సడెన్‌ బ్రేక్‌ వేశారు. దీంతో నేతలంతా బ్యాలెన్స్‌ తప్పి ముందుకు ఒరిగిపోయారు. రెయిలింగ్‌ కూడా గట్టిగా బిగించకపోవడంతో సడెన్‌ బ్రేక్‌కు అది విరిగిపోవడంతో వారు ముందుకు పడ్డారని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. అంతే కాకుండా వాహనంపై పరిమితికి మించి నేతలు ఎక్కినట్లుగా అర్థమవుతోంది.

KTR-Escapes-Falls-From-Campaign-Vehicle

పరిమితికి మించిన నేతలు ఎక్కడం, రెయిలింగ్‌ సరిగా బిగించకపోవడం తదితర కారణాల ద్వారా సడెన్‌ బ్రేక్ వేయడంతో ఆ బరువుకు రెయిలింగ్‌ విరిగిపోయిందని మరికొందరు చెబుతున్నారు. కాగా ప్రమాద పరిస్థితిపై మంత్రి కేటీఆర్ X(ట్విట్టర్‌) స్పందించారు. అదృష్టవశాత్తు ఘటనలో చిన్న గాయాలు మినహా.. తనకు పెద్దగా ప్రమాదం జరగలేదని వెల్లడించారు. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని తెలిపారు.

కాగా ప్రమాదం సందర్భంలో కేటీఆర్‌ను గన్‌మెన్‌ పట్టుకోవడంతో పెద్దగా గాయాలు కాకుండా బయటపడినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం కేటీఆర్‌.. జీవన్‌రెడ్డితో నామినేషన్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా కొడంగల్‌ చేరుకున్నారు. అక్కడ కూడా అలాంటి ప్రచార రథంపైనే ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, November 10, 2023, 11:57 [IST]
English summary
Minister ktr luckily escaped from falling off the campaign vehicle in armur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+