కొడుకు కోసం జర్మన్ లగ్జరీ కారు కొన్న R.K. రోజా; ధర రూ. 1.50 కోట్లు

'ఆర్కే రోజా' ఈ పేరు ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఏకందుకంటే నటిగా తెలుగు సినిమారంగంలో అడుగుపెట్టి ఈ రోజు మంత్రి స్థాయికి చేరి ఎంతోమంది ఆదరాభిమానాలు పొందుతోంది. నటిగా అడుగులు ప్రారంభించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మంత్రి 'రోజా' గా నిలిచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రిగా కొనుసాగుతోంది.

అయితే ఇటీవల ఈమె అత్యంత ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కొడుకు కోసం జర్మన్ లగ్జరీ కారు కొన్న R.K. రోజా; ధర రూ. 1.50 కోట్లు

నివేదికల ప్రకారం, ఆర్కె రోజా జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) యొక్క 'జిఎల్ఎస్ 400డి 4మ్యాటిక్ (GLS 400D 4Matic) కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమె కొన్న ఈ లగ్జరీ కారు ధర రూ. 1.50 కోట్లు అని, అంతే కాకుండా ఇది తన కొడుకు 'క్రిష్ణ కౌశిక్' కోసం కొనుగోలు చేసినట్లు తెలిసింది.

కొడుకు కోసం జర్మన్ లగ్జరీ కారు కొన్న R.K. రోజా; ధర రూ. 1.50 కోట్లు

దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇప్పుడుద్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రోజా తన కొడుకుతో ఈ జిఎల్ఎస్ కారుని డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. వీరు కొనుగోలు చేసిన ఈ కొత్త కారు వైట్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. రోజా ఈ కారుని డ్రైవ్ చేస్తుండగా, తన కొడుకు తన పక్కనే కూర్చుని ఉండటం కూడా ఈ వీడియోలో గమనించించవచ్చు.

కొడుకు కోసం జర్మన్ లగ్జరీ కారు కొన్న R.K. రోజా; ధర రూ. 1.50 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ యొక్క జిఎల్ఎస్ 400డి విషయానికి వస్తే, ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ ఫాగ్ లైట్, ఎల్ఈడీ టెయిల్ లాంప్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా దీని ముందు భాగంలో బ్రాండ్ లోగో చూడవచ్చు. డోర్ హ్యాండిల్స్ మరియు రూఫ్ లైన్ వంటివి క్రోమ్ పొందుతాయి. కావున డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

కొడుకు కోసం జర్మన్ లగ్జరీ కారు కొన్న R.K. రోజా; ధర రూ. 1.50 కోట్లు

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేసే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉన్నాయి. వీటితోపాటు వైర్ లెస్ ఛార్జర్, వాయిస్ కమాండ్ ఫీచర్, యూఎస్బి స్లాట్స్ మరియు పానరోమిక్ సన్ రూఫ్ వంటివి ఉన్నాయి.

కొడుకు కోసం జర్మన్ లగ్జరీ కారు కొన్న R.K. రోజా; ధర రూ. 1.50 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 400డి లో 2925 సిసి 6 సిలిండర్ డిఓహెచ్సి డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 3600 ఆర్‌పిఎమ్ వద్ద 326 బిహెచ్‌పి పవర్ మరియు 1200 ఆర్‌పిఎమ్ వద్ద 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇనిన్ కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 238 కిమీ.

కొడుకు కోసం జర్మన్ లగ్జరీ కారు కొన్న R.K. రోజా; ధర రూ. 1.50 కోట్లు

జిఎల్ఎస్ 400డి మంచి డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 9 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ మరియు ఫార్వార్డ్ కొలీషియన్ వార్ణింగ్ వంటివి ఉన్నాయి. కావున వాహన వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

కొడుకు కోసం జర్మన్ లగ్జరీ కారు కొన్న R.K. రోజా; ధర రూ. 1.50 కోట్లు

వైస్సార్సీపీ ఫైర్ బ్రాండ్ రోజ ఎప్పుడూ తన కూతురు మీదనే ప్రేమ చూపిస్తున్నట్లు చాలా సందర్భాల్లో చూసాము. అయితే ఇప్పుడు తన ముద్దుల కొడుకుని ఏకంగా రూ. 1.50 కోట్ల కారుని గిఫ్ట్ గా అందించింది. అయితే ఇప్పుడు ఈ కారుని కొనుగోలు చేయడంపైన ప్రతిపక్ష నేతలు ఎన్నో విమర్శలు కురిపిస్తున్నారు.

కొడుకు కోసం జర్మన్ లగ్జరీ కారు కొన్న R.K. రోజా; ధర రూ. 1.50 కోట్లు

మంత్రిగా పదవి చేపట్టిన అతి తక్కువ కాలంలోనే ఇంత ఖరీదైన కారుని ఎలా కొనుగోలు చేసింది. 'మంత్రి గారికి అపాయింట్ మెంట్ లో బాగానే వస్తున్నట్లు ఉన్నాయి, బాగానే వెనకేసారు'. అంటూ రోజాపైన టీడీపీ కామెంట్ చేసింది. అయితే మరో వైపు జనసైనికులు కూడా మండిపడుతున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ కార్లు కోనప్పుడు రోజ ఎన్నో విమర్శలు కురిపించింది, అయితే ఇప్పుడు రోజ ఈ ఖరీదైన లగ్జరీ కారుని ఎలా కొనింది అంటూ జనసైనికులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

కొడుకు కోసం జర్మన్ లగ్జరీ కారు కొన్న R.K. రోజా; ధర రూ. 1.50 కోట్లు

ప్రేమ తపస్సు అనే తెలుగు సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన రోజ, క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో 100 కు పైగా సినిమాల్లో నటించింది. అంతే కాకుండా గతంలో నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అయితే ప్రస్తుతం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా కొనసాగుతొంది.

కొడుకు కోసం జర్మన్ లగ్జరీ కారు కొన్న R.K. రోజా; ధర రూ. 1.50 కోట్లు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మెర్సిడెస్ బెంజ్ యొక్క జిఎల్ఎస్ 400డి మ్యాటిక్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కారు. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉండి, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ కారు వాహన వినియోగదారులకు లగ్జరీ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 16, 2022, 11:48 [IST]
English summary
Minister roja bought an expensive benz car details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+