టయోటా ఇన్నోవాతో రోడ్డుపై బీభత్సం సృష్టించిన మైనర్‌ బాలుడు.. వీడియో వైరల్‌..!!

భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. అతివేగం సహా, నిర్లక్ష్యం ఇందుకు ప్రధాన కారణాలు. దీంతోపాటు చిన్నారులకు వాహనాలు ఇవ్వడం కూడా ఇందుకు పెద్ద కారణం. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఈ తాజా ఘటన ముంబైలో జరిగింది. ఓ 14 ఏళ్ల బాలుడు.. తన తల్లిదండ్రుల టయోటా ఇన్నోవా MPV కారుపై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వారు నివాసం ఉంటున్న సొసైటి గేట్‌ వెలుపల వరకు సక్రమంగా డ్రైవింగ్‌ చేశాడు. అయితే ప్రధాన రోడ్డుపైకి వచ్చిన తర్వాత కారుపై నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా అక్కడున్న ఆటోను ఢీకొట్టాడు. అనంతరం అదే రోడ్డులో నడుస్తున్న సీనియర్‌ సిటిజన్‌ను ఢీకొట్టాడు.

 minor boy rams old man with Toyota Innova

వీడియో వైరల్‌ : ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సీనియర్‌ సిటిజన్‌ను ఢీకొట్టిన తర్వాత కారు మరింత వేగంగా దూసుకెళ్లి, నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అనంతరం కారు నుంచి బయటకు వచ్చిన 14 సంవత్సరాల బాలుడు.. అక్కడ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.

ఘటన జరిగిన అనంతరం అక్కడున్న స్థానికులు.. గాయపడిన వృద్ఢుడిని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు మూడు నెలలపాటు రెస్ట్‌ తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇన్నోవా కారును డ్రైవింగ్‌ చేసిన 14 సంవత్సరాల బాలుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని తెలిపారు. కానీ గాయపడిన వృద్ధుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు చెప్పారు.

 minor boy rams old man with Toyota Innova

అయితే టయోటా తల్లిదండ్రులకు వారు నివాసం ఉంటున్న సొసైటి 5 వేల రూపాయల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. పోలీసులు తీసుకున్న వాంగ్మూలంలో గాయపడిన వృద్ధుడు కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన పిల్లవాడి తల్లి తనను హాస్పిటల్‌లో కలిశారని, క్షమాపణ చెప్పారని తెలిపారు అయితే తన బిడ్డ తాము చెప్పేది వినడం లేదని చెప్పినట్లు వృద్ధుడు తెలిపారు. పిల్లల చేసిన తప్పులకు తల్లిదండ్రులదే బాధ్యతని చెప్పినట్లు తెలిపారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా MPV ప్రస్తుతం రూ.24.39 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు 2.4 లీటర్ టర్బోఛార్జడ్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 145bhp శక్తి, 343Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 minor boy rams old man with Toyota Innova

డ్రైవ్‌స్పార్క్‌ వ్యాఖ్య : 14 ఏళ్ల బాలుడిని కారు నడిపేందుకు చాలా మంది తల్లిదండ్రులు అనుమతించరు. అయితే మరికొందరు మాత్రం అనుమతి ఇవ్వడం గమనార్హం. అయితే కొంత మంది మాత్రం పిల్లలకు కారు తాళాలు అందుబాటులో ఉంచి వారిలో కారు డ్రైవింగ్‌పై ఆశలు రేకెత్తించి, వారు తప్పులు చేసేందుకు ఒక రకంగా కారణం అవుతున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, September 22, 2023, 15:54 [IST]
English summary
Minor boy crashed old man with toyota innova video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+