బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కిన బుడతడు.. తర్వాత ఏం జరిగిందంటే?

భారతదేశంలో మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనాలు డ్రైవింగ్ చేయడానికి నిర్దిష్టమైన వయో పరిమితి ఉంది. దీని ప్రకారం వాహనాలను నడపడానికి మరియు డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ప్రజా రహదారుల మీద వాహనాలు నడపడానికి అర్హత పొందుతారు.

బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కిన బుడతడు.. తర్వాత ఏం జరిగిందంటే?

మనదేశంలో 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలు డ్రైవింగ్ చేయడానికి అనర్హులు. ఈ వయసులోపు ఉన్న పిల్లలు డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదం కేవలం వాహనదారునికి మాత్రమే కాదు, చుట్టూ ఉన్న జనానికి కూడా చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది.

బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కిన బుడతడు.. తర్వాత ఏం జరిగిందంటే?

అయితే మనదేశంలో చాలామంది ఈ నియమాలన్నింటిని పెడచెవిన పెడుతున్నారు. మనం నిత్య జీవితంలో కూడా అక్కడక్కడా చిన్నపిల్లలు వాహనాన్ని డ్రైవ్ చేయడం గమనిస్తూ ఉంటాము. ఇలాంటి సంఘటనే ఇటీవల మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో ఒక చిన్న పిల్లవాడు బైక్ నడుపుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది.

బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కిన బుడతడు.. తర్వాత ఏం జరిగిందంటే?

కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మహారాష్ట్రలో కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ కర్ఫ్యూ సమయంలో ప్రజలు కర్ఫ్యూ నియమాలు అనుసరిస్తున్నారా.. లేదా అనే విషయంపై పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఆ చిన్న పిల్లవాడు బైక్ రైడ్ చేస్తూ పట్టుబడ్డాడు.

బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కిన బుడతడు.. తర్వాత ఏం జరిగిందంటే?

ఈ చిన్నపిల్లవాడు వయస్సు సుమారు 8 నుంచి 10 సంవత్సరాలలోపు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. సాధారణంగా ఈ వయస్సు వారు ఏ మోటారు వాహనాన్ని నడపలేరు. కానీ ఈ పిల్లవాడు బైక్ రైడ్ చేస్తూ పోలీసులకు దొరికాడు. పోలీసులను ఈ బాలున్ని ఆపి విచారిస్తున్నప్పుడు బాలుడు గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. ఈ సంఘటన మీరు వీడియోలో చూడవచ్చు.

బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కిన బుడతడు.. తర్వాత ఏం జరిగిందంటే?

ఆ బాలుడు గట్టిగా ఏడవడం వల్ల పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టారు. తరువాత ఆ బాలుడు తానూ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన బైక్ ను సెల్ఫ్ స్టార్ట్ ద్వారా స్టార్ట్ చేసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఆ బాలుడు వెళ్లే సమయంలో ఒక పోలీసు అధికారి తన మొబైల్ ఫోన్‌లో ఈ సంఘటనను రికార్డ్ చేశాడు.

ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా వీక్షించారు. పాత మోటారు వాహన నిబంధనలు ఇలాంటి సంఘటనకు వాహనదారులకు రూ. 25 వేల లేదా మూడు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తాయి. కానీ ఇప్పుడు చట్టం ప్రకారం మోటారు వాహనాలను నడిపే మైనర్ల తల్లిదండ్రులకు జరిమానా మరియు జైలు శిక్ష విధించే శిక్ష.

బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కిన బుడతడు.. తర్వాత ఏం జరిగిందంటే?

మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటనలో బాలుడు నిజంగా అదృష్టవంతుడు. అతనికి పోలీసులు ఎటువంటి జరిమానా విధించలేదు. అంతే కాకూండా అతని తండ్రి మరియు తల్లి ఎటువంటి చర్య తీసుకోలేదు. అయినప్పయికి తల్లితండ్రులు వారి పిల్లలు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా చూసుకోవాలి. లేకుంటే తల్లిదండ్రులే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది.

Most Read Articles

English summary
Kid Busted For Breaking Lockdown On A Motorcycle. Read in Telugu.
Story first published: Friday, June 18, 2021, 15:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X