Minor Driving మైనర్ల డ్రైవింగ్.. హల్ చల్ చేస్తున్న యాక్సిడెంట్ వీడియో.. తండ్రిపై కేసు నమోదు..!

నిత్యం రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఆధారంగా యాక్సిడెంట్ జరిగిన తీరును సులభంగా మొబైల్లో చూసుకోగలుగుతున్నాం. దేశంలో చాలావరకు ఇలాంటి వీడియోలు రోజుకి వేళల్లో పుట్టుకొస్తున్నాయి. కొందరు నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతుంటే.. కొందరు ప్రయోగాలు చేస్తూ వీటికి కారణం అవుతున్నారు.

దేశంలో మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చాలా చోట్ల పట్టుబడుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టిన వాటిని కొందరు ఏమాత్రం లెక్కచేయడం లేదు. పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన పెద్దది వారికి వాహనాలను అందిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పిల్లల సరదా కోసం వాహనాలను అప్పచెప్పుతున్న కొంతమంది పేరెంట్స్ కు ఊహించని సంఘటలనల కారణంగా చివరకు గుండె శోకం మిగులుతుంది. తాజాగా జరిగిన ఓ ప్రమాదం ప్రస్తుతం వైరల్ గా మారింది.

mahindra scorpio

గోవాలో మైనర్లు డ్రైవ్ చేస్తూ వెళుతున్న ఓ మహేంద్ర స్కార్పియో ప్రమాదానికి గురైంది. సీసీటీవీ ఫుటేజీలో వేగంగా దూసుకెళ్తున్న ఆ మహీంద్రా స్కార్పియో విజువల్స్ ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. ముగ్గురు మైనర్లతో వెళ్తున్న SUV హై-స్పీడ్ క్రాష్ లో స్తంభాన్ని ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదం నుంచి వారు తృటిలో తప్పించుకున్నారు. తక్కువ వయస్సు గల వ్యక్తిని కారు నడపడానికి అనుమతించినందుకు మైనర్ డ్రైవర్ తండ్రిపై పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు.

ఏప్రిల్ 17 సోమవారం సెయింట్ పీటర్స్ చాపెల్ సమీపంలోని కరంజాలెం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సీసీటీవీలో కనిపించిన మహీంద్రా స్కార్పియో అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. పాఠశాల పిల్లలను తీసుకువెళుతున్న KTC బస్సు య-టర్న్ తీసుకుంటుండగా.. అది వేగంతో వచ్చిన మహీంద్రా స్కార్పియో బస్సు ముందు భాగాన్ని ఢీకొడుతుంది. అనంతరం పక్కకు దూసుకెళ్లి స్తంభాలను ఢీ కొట్టి నిలిచిపోతుంది.

అతి స్పీడ్ గా వస్తున్న మహీంద్రా స్కార్పియో బస్సును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. డ్రైవింగ్ చేస్తున్న మైనర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అదృష్టశా వత్తు కారులో ఉన్న వారికి ప్రాణాపాయం తప్పింది. క్షణాల్లో జరిగిన ఈ సంఘటన అక్కడివారని భయభ్రాంతులకు గురిచేసింది ఏమి జరుగుతుందని తేరుకొనే లోపే ఈ ప్రమాదం సంభవించింది.

స్కార్పియో రోడ్డు పక్కన ఉన్న మూడు వీధి స్తంభాలను ఢీకొట్టింది. దీని ప్రభావంతో దీపపు స్తంభాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణీకులను ప్రథమ చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో వీరికి ట్రీట్మెంట్ జరుగుతుంది. సంఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు.

ఈ ప్రమాదానికి కారణమైన బాలుడితో పాటు అతని తండ్రిపై పంజిమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కారు యజమానిపై మోటారు వాహనాల చట్టంలోని 3,4,5, 181 సెక్షన్ల కింద జువెలైన్ డ్రైవర్, తండ్రి అస్గరాలి రాజబాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, వారిపై IPC సెక్షన్ 279, 338ను నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా వాహనం కేసులు నమోదు చేయబడ్డాయి.

అక్రమంగా వాహనాలను నడుపుతున్న మైనర్ల తల్లిదండ్రులకు చలాన్లు, జరిమానాలు విధిస్తున్నప్పటికీ, చాలా మంది వాటిని పాటించడం లేదు. పోలీసులు గతంలో పెద్ద చలాన్లు జరిమానాలు జారీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ప్రమాద తీవ్రత ఆధారంగా నిరోధకంగా తల్లిదండ్రులను జైలుకు పంపిన సందర్భాలు కూడా జరిగాయి. అయినా కానీ జనాల్లో మార్పు రాకపోవడం చెడు సంకేతాలను అందిస్తుంది.

మైనర్‌గా పబ్లిక్ రోడ్లపై డ్రైవింగ్ చేయడం తీవ్రమైన నేరం. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చట్టబద్ధమైన డ్రైవింగ్ వయస్సు 18 సంవత్సరాల కంటే ముందే తమ పిల్లలను డ్రైవింగ్ చేయడానికి అనుమతించే బాధ్యతరహిత తల్లిదండ్రులపై కోర్టుల్లో అనేక శిక్షలు ఉన్నాయి. హైదరాబాదులో కొన్ని ప్రదేశాల్లో రాత్రికి రాత్రి మైనర్ల తల్లిదండ్రులను జైలుకు పంపిన సందర్భాలు చోటుచేసుకున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, April 22, 2023, 16:46 [IST]
English summary
Minor drives car on heavy speed met with an accident case booked on parents
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+