ఈ కారుతో బట్టలు ఉతుక్కోవచ్చు, వంట కూడా చేసుకోవచ్చు..!!

ఇటీవల జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం, భీకర సునామీల తర్వాత ఆ దేశంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తుకు ఇప్పటికీ అంతరాయం కలుగుతుండటంతో ప్రజలు వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడనేదని, ఆ పరిస్థిని దృష్టిలో ఉంచుకొని ఈ పరికరానికి రూపకల్పన చేశామని మిత్సుబిషి చెబుతోంది. అంతేకాకుండా ఈ పరికరం లేకుండానే ఐ-ఎమ్ఐఈవీ ఎలక్ట్రిక్ కారుతో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లు కూడా చార్జ్ చేసుకోవచ్చు.
అయితే వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ కుక్కర్‌కు మాత్రం అధిక విద్యుత్తు అవసరమవుతుంది, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాటరీ నుంచి అధిక పవర్‌ను సంగ్రహించేలా ఈ చిన్న పరికరాన్ని రూపొందిచినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాదు ఈ కారులో ఉండే 16 కిలోవాట్ల బ్యాటరీని పూర్తిగా చార్జింగ్ చేసినట్లయితే, ఒక సాధారణ కుటుంబానికి అవసరమయ్యే విద్యుత్తును ఒకటి నుంచి ఒకటిన్నర రోజు వరకూ అందిస్తుందట.


Click it and Unblock the Notifications








