60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

By Anil

60 లక్షల ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీతో ఇలా నారు మడులను దున్నడం ఎప్పుడైనా చూశారా...? ఇవాళ్టి కథనంలో వీడియోతో పాటు ఆ రైతు వివరాలు కూడా చూద్దాం రండి. మిత్సుబిషి మోంటెరో లగ్జరీ ఎస్‌యూవీ వ్యక్తిగత వాహనంగా ఇండియన్ మార్కెట్లో పెద్ద రాణించలేకపోయింది. అయితే పంజాబ్ రాష్ట్రంలోని నారు మడులలో ట్రాక్టర్ శైలిలో మంచి పనితీరును కనబరిచింది.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

నారు మడులలో దున్నడం పూర్తయిన తరువాత చదును చేయాడనికి పంజాబ్‌లోని ఓ రైతు తన మిత్సిబిషి మోంటెరో ఎస్‌యూవీని వినియోగించాడు. ట్రాక్టర్ చేయాల్సిన పనులను ఈ లగ్జరీ ఎస్‌యూవీతో పూర్తి చేశాడు.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ఓ రకంగా చెప్పాలంటే ఈ రైతు మంచి ధనవంతుడే. ఇతని వద్ద రూ. 60 లక్షల విలువైన మిత్సుబిషి మోంటెరో లగ్జరీ ఎస్‌యూవీతో పాటు టయోటా ల్యాండ్ క్రూయిజర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వాహనాలు కూడా ఉన్నాయి.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ఒకప్పుడు లండన్‌కు వెళ్లిన మన భారతీయ రాజుకు రోల్స్ రాయిస్ షోరూమ్‌లో అవమానం జరిగిందని, రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసి వాటిని వీధుల్ని శుభ్రం చేయడానికి వినియోగించాడని విన్నాం కదా, ఈ పంజాబ్ రైతు కూడా అదే తరహాలో అత్యంత ఖరీదైన వాహనాలతో వ్యవసాయం చేస్తున్నాడు.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ట్రాక్టర్ ఉపయోగించి సేద్యం చేయడం ఈ రైతుకి అసౌకర్యంగా ఉందని, పూర్తిగా పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నేసిన తరువాత, సౌకర్యవంతంగా తన లగ్జరీ ఎస్‌యూవీని వినియోగించి మొత్తం పొలాన్ని చదును చేసుకున్నాడు.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

సాధారణ పొలాలు కాకుండా నారు మడులలో ఇలాంటి ఎస్‌యూవీలతో సేద్యం ఎలా సాధ్యం ట్రాక్టర్లు సైతం మట్టిలో ఇరుక్కుపోతున్నాయి కదా అని ఆలోచిస్తున్నారా...? 60 లక్షల కన్నా ఎక్కువ ధర ఉన్న ఈ వెహికల్‌లో మనకు తెలియని అనేక ఫీచర్లు ఉన్నాయి. బురద మట్టిలో సైతం సులభంగా ప్రయాణించే డ్రైవ్ సిస్టమ్ ఇందులో ఉంది.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

జపాన్ దిగ్గజం మిత్సుబిషి ఈ మోంటెరో ఎస్‌యూవీని నిర్మించింది. ఇందులో 3.2-లీటర్ల సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు, ఇది 3,800ఇంజన్ వేగం వద్ద 196పిఎస్ పవర్ మరియు 2,000 ఇంజన్ వేగం వద్ద 441ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ అన్ని చక్రాలకు అందించడానికి ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. అత్యుత్తమ డ్రైవింగ్ అదే విధంగా అన్ని రకాల భూబాగాల్లో సునాయాసంగా ప్రయాణించడానికి 4-వీల్ స్లిప్ కంట్రోల్ మరియు 4-వీల్ ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థలను అందివ్వడం జరిగింది.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

సాధారణ ప్రయాణ సమయాల్లో ఇది లీటర్‌కు 11.56కిమీలు మరియు హై వే డ్రైవింగ్ పరిస్థితుల్లో 10కిమీల మైలైజ్ ఇస్తుంది. మరి ఇలా పొలాల్లో వ్యవసాయానికి వినియోగిస్తే ఏ మేరకు మైలేజ్ వస్తోందో ఆ రైతుకే తెలియాలి మరి.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

లాడర్ (నిచ్చెన) ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా నిర్మించిన ఈ మిత్సుబిషి మోంటెరో ఎస్‌యూవీలో భద్రత పరంగా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆక్టివ్ స్టెబిలిటి, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ మరియు ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ముందు వైపు రెండు, ప్రక్క వైపుల రెండు మరియు రెండు కర్టన్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. వీటితో పాటు లగ్జరీ లెథర్ అప్‌హోల్‌స్ట్రే, 60:40 నిష్పత్తిలో మలిపే వీలున్న మధ్య వరుస సీటింగ్ మరియు చివరి వరుస సీటును పూర్తిగా మలిపేయవచ్చు.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్-సిరీస్ లగ్జరీ వాహనాలతో పోటీపడే ఈ మిత్సుబిషి మోంటెరోలోని డ్రైవర్ మరియు కో ప్యాసింజర్ సీట్లను వ్యక్తిగతంగా 8 విధాలుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

పంజాబ్ రైతు మిత్సుబిషి మోంటెరో వాహనంతో నారు మడులను దున్నడాన్ని స్వయంగా వీక్షించండి...

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

దిగ్గజ రోల్స్ రాయిస్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ చేత క్షమాపణలు చెప్పించుకునేటట్లు చేసిన ఓ భారతీయ రాజు కథ...!

Most Read Articles

English summary
Read In Telugu Mitsubishi Montero used as tractor by this Punjab farmer
Story first published: Friday, June 2, 2017, 16:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X