1640 మీటర్ల ఎత్తు కొండ నుంచి కిందకు పడిన కారు.. స్థానికులు ఏం చెప్పారంటే?

కొండలు లేదా పర్వతాలపైకి కారులో వెళ్లడం చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికీ చెరగని ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుంది. అదే ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా భారీ ప్రమాదాలకు కారణం అవుతాయి. ఇటువంటి ఘటనే తాజాగా ఒకటి జరిగింది. ఓ కారు భారీ ప్రమాదానికి గురైంది.

సుమారు 1640 అడుగుల ఎత్తైన కొండ పైనుంచి కారు కిందకి పడింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. మిత్సుబిషి పజెరో కారులో కొందరు ప్రయాణికులు కొండపైకి వెళ్తున్నారు. అకస్మాత్తుగా కారు కొండ పైనుంచి సుమారు 1640 మీటర్ల కిందకు పడిపోయింది.

mitsubishi pajero car falls from 1640 feet hill

అయితే కారు ప్రమాదానికి గురికావడానికి గల స్పష్టమైన కారణాలు తెలియలేదు. అయితే కొండపైనున్న పర్యాటక ప్రదేశానికి వెళ్తుండగా బ్రేకులు విఫలం అయ్యి లేదా రోడ్డు చివరన జారిపడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. మనకు అందుబాటులోని ఉన్న కారు ఫోటోలను బట్టి చూస్తే.. వాహనం భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో మిత్సుబిషి పజెరో కారులోని ప్రయాణిస్తున్న పర్యాటకులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని ఘటన స్థలికి చేరుకున్న స్థానికులు చెబుతున్నారు. ఇంత భారీ ప్రమాదంలోనూ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారంటే వారు కచ్చితంగా సీట్‌ బెల్టులు ధరించి ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.

కొండలు లేదా పర్వతాలపై డ్రైవింగ్‌ చేయడం చాలా మంది థ్రిల్‌గా ఫీల్‌ అవుతారు. కానీ అలాంటి చోటే ప్రమాదాలు కూడా ఉంటాయని గుర్తించరు. అలాంటి రోడ్లపై కచ్చితంగా కేటాయించిన లైన్‌లోనే ప్రయాణం చేయాలి. కానీ కొందరు డ్రైవర్లు ఇతర లైన్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇవే ప్రమాదాలకు దారితీస్తాయి.

mitsubishi pajero car falls from 1640 feet hill

అలాగే ముందు ఉన్న వాహనాలను ఓవర్‌టేక్‌ చేసే సమయంలో బ్లైండ్‌ కార్నర్‌లను ఎంచుకోవడం చాలా ప్రమాదకరం. మరియు మలుపులు తీసుకొనే సమయంలో కారును మూడో గేర్‌కు మార్చండి. లేదంటే కారు అదుపుతప్పే ప్రమాదం ఉంటుంది. పర్వతాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నిబంధనలను కచ్చితంగా పాటించాలి.

కార్లలో ప్రయాణికులు చాలా మందికి సీట్‌ బెల్ట్‌ ధరించడం సౌకర్యంగా ఉండకపోవచ్చు. కానీ సురక్షితమైన డ్రైవింగ్‌ కోసం ఇది ఎంతో అవసరం. ఇప్పుడు వాహనాల్లో వెనుక సీట్లలో కూర్చున్నవారు కూడా సీట్‌ బెల్ట్‌లు ధరించడం తప్పనిసరి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సీట్‌ బెల్ట్‌లు అత్యధిక రక్షణ ఇస్తాయి.

కొండలపై డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా పర్వతాల ఉన్న రోడ్లు మంచు, చలి కారణంగా జారిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా టైర్లు ట్రాక్షన్‌ను కోల్పోతాయి. రోడ్లపై తేమ సహా ఇతర కారణాల వల్ల అధికవేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాల బారిన పడే అవశం ఎక్కువగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 21, 2023, 16:33 [IST]
English summary
Mitsubishi pajero car falls from 1640 feet hill area in thiruvananthapuram in kerala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+