నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యొక్క మహీంద్రా థార్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో ఆఫ్-రోడర్‌గా చాలా ప్రసిద్ది చెందింది. మహీంద్రా కంపెనీ గత సంవంత్సరం కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ థార్ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి రికార్డు స్థాయిలో అమ్మకాలను జరిపింది.
![నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో] నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]](https://images.drivespark.com/te/img/2021/05/new-mahindra-thar-front-profile-1622033487.jpg)
కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీకి ఇప్పటికి కూడా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. రోజు రోజుకి పెరుగుదల దిశగానే వెళ్తోంది. కావున ఈ ఎస్‌యూవీ కోసం వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికి కూడా దాదాపు ఒక సంవత్సరానికి చేరుకుంది. మహీంద్రా థార్ ఎస్‌యూవీ యొక్క అద్భుతమైన ఆఫ్-రోడ్ సామర్ధ్యం వల్ల, చాలా మంది వాహనదారులు థార్ ఎస్‌యూవీని ఇష్టపడతారు.
![నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో] నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]](https://images.drivespark.com/te/img/2021/05/mitsubishi-pajero-rescue-mahindra-thar1-1622033415.jpg)
అయితే ఇటీవల మహీంద్రా థార్ చిన్న నదిలో చిక్కుకుని బయటకు రాలేకుండా పోతున్న సమయంలో పాత మిత్సుబిషి పజెరో సహాయంతో బయటకు వస్తున్న వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది. ఈ వీడియోలో మీరు గమనించినట్లైతే మహీంద్రా థార్ చిన్న నదిలో చిక్కుకుంది.
![నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో] నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]](https://images.drivespark.com/te/img/2021/05/mitsubishi-pajero-rescue-mahindra-thar2-1622033423.jpg)
నివేదికల ప్రకారం ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా తెలియదు. నదిలో చిక్కుకుని బయటకు రాలేకపోతున్న సమయంలో ఒక పాత మిత్సుబిషి పజెరో ఎస్‌యువి మహీంద్రా థార్ ని బయటకు తీయడంలో సహాయపడింది. వీడియోలో మీరు గమనించినట్లైతే, పజెరో ఎస్‌యూవీకి ఒక తాడులాంటిది కట్టి లాగుతుంది.
![నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో] నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]](https://images.drivespark.com/te/img/2021/05/mitsubishi-pajero-rescue-mahindra-thar3-1622033430.jpg)
మిత్సుబిషి పజెరో మంచి రహదారి సామర్థ్యము కలిగిన పవర్ పుల్ ఎస్‌యూవీ. ఇది థార్ ఎస్‌యూవీని నెమ్మదిగా బయటకు లాగుతుంది. ఈ థార్ లోపల నీరు ఉన్నట్లు తెలుస్తుంది, నీటిలో ఉన్నప్పుడు సరిగ్గా తెలియలేదు, కానీ ఆ థార్ బయటకు లాగిన తర్వాత డ్రైవర్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే నీరు బయటకు వస్తాయి. దీని ప్రకారం ఇది లోతుగా ఉండే నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది.
![నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో] నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]](https://images.drivespark.com/te/img/2021/05/mitsubishi-pajero-rescue-mahindra-thar4-1622033439.jpg)
ఈ థార్ ఎస్‌యూవీలో ఫాగ్ లైట్ నది నుండి బయటకు వచ్చేటప్పుడు ఆన్‌లో ఉంది. కానీ ఆ సమయంలో నీరు ఎక్కువగా చేరటం వల్ల అది కచ్చితంగా పనిచేస్తుందా, లేదా అనేది కచ్చితంగా తెలియదు. కానీ అది బయటకు వాహిని తరువాత బోనెట్ ఓపెన్ చేయడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు.
మహీంద్రా యొక్క థార్ ఎస్‌యూవీని మంచి సామర్థ్యము కలిగి ఉండటమే కాదు, మంచి ఆఫ్-రోడ్ డ్రైవింగ్ నైపుణ్యాలు కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ ఎస్‌యూవీని కఠినమైన రహదారిలో డ్రైవ్ చేసేటప్పుడు కొంత అనుభవం కూడా ఉండాలి. లేదంటే ఈ విధంగా చిక్కుకునే అవకాశం ఉంది.
![నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో] నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]](https://images.drivespark.com/te/img/2021/05/mahindra-thar-unveiled-4-1622033469.jpg)
వాహనం నీటిలో దిగే ముందు, ముందుగా వాహనం యొక్క పరిమితులు తెలుసుకోవాలి. థార్ ఎస్‌యూవీ 650 మిమీ వాటర్ వెయిటింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ వాహనాని నడపడానికి కూడా డ్రైవర్ మంచి నైపుణ్యాలను కలిగి ఉండి, సమయానుకూలంగా వ్యవహారించాలి.


Click it and Unblock the Notifications








