రాత్రి పూట డ్రైవింగ్ చాలా ప్రమాదం.. దానికి ఇదే నిదర్శనం: తప్పక చూడండి

ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. కావున నిత్యం ఏదో ఒక మూలన ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రమాదాలకు కారణాలు అనేకం ఉన్నాయి. కాగా ఇటీవల ఒక రాజకీయ నాయకుని కారు బ్రిడ్జ్ మీద నుంచి 50 అడుగుల కిందికి పడింది.

రాత్రి పూట డ్రైవింగ్ చాలా ప్రమాదం.. దానికి ఇదే నిదర్శనం: తప్పక చూడండి

నివేదికల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే 'జయకుమార్ గోరే' కారు గత శనివారం రోజున సతారా జిల్లాలోని ఫాల్తాన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన ప్రయాణించే కారు బ్రిడ్జిపై నుంచి 50 అడుగులు కిందికి పడిపోయింది. ఈ బ్రిడ్జ్ పూణే ఫండర్ పూర్ హైవే సమీపంలో ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ హాని జరగలేదు. కానీ కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలైనట్లు తెలిసింది.

రాత్రి పూట డ్రైవింగ్ చాలా ప్రమాదం.. దానికి ఇదే నిదర్శనం: తప్పక చూడండి

ప్రమాదానికి గురైన కారులో ఎమ్మెల్యే జయకుమార్ తో పాటు, అతని డ్రైవర్ మరియు మరో ముగ్గురు ఉన్నారని, వారందరికీ కూడా గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన ఎమ్మెల్యేను పూణేలోని రూబీ హాస్పిటల్ కి తరలించారు, మిగిలిన వారిని వేరు వేరు హాస్పత్రులకు తరలించారు. వారందరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని డాక్టర్లు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి కారణం అతి వేగం అని పోలీసులు దర్యాప్తులో తెలిపారు.

రాత్రి పూట డ్రైవింగ్ చాలా ప్రమాదం.. దానికి ఇదే నిదర్శనం: తప్పక చూడండి

ప్రమాదానికి గురైన కారు టయోటా ఫార్చ్యూనర్ అని తెలిసింది. కారు వంతెన నుంచి 50 అడుగుల కిందికి పడినప్పటికీ ఎవరికీ ప్రాణహాని జరగలేదు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. ఇందులో కారు ఎంత పెద్ద ప్రమాదానికి గురయ్యిందో స్పష్టంగా కనిపిస్తోంది. టయోటా ఫార్చ్యూనర్ యొక్క ముందు భాగం భారీగా దెబ్బతిన్నట్లు కూడా ఇందులో కనిపిస్తుంది.

రాత్రి పూట డ్రైవింగ్ చాలా ప్రమాదం.. దానికి ఇదే నిదర్శనం: తప్పక చూడండి

కార్లు ప్రయాణించే సమయంలో ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదని పోలీసులు ఊహిస్తున్నారు. ఈ ప్రమాదం కూడా తెల్లవారు జామున జరిగిందని నివేదినచబడింది, కావున డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఇది జరిగి ఉండవచ్చు. ఎందుకంటే సాధారణంగా అందరూ రాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల మధ్యలో ఎక్కువగా నిద్రపోతారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

రాత్రి పూట డ్రైవింగ్ చాలా ప్రమాదం.. దానికి ఇదే నిదర్శనం: తప్పక చూడండి

రద్దీ ఉండే నగరాల్లో ప్రయాణం చేయడానికి చాలా మంది రాత్రి సమయాల్లోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రాత్రి సమయంలో వాహనం నడిపే డ్రైవర్లు చిన్నపాటి కునుకు తీసినప్పటికీ అనుకోని పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. గతంలో కూడా రాత్రి సమయంలో ప్రయాణించే చాలా వాహనాలు ఎక్కువ ప్రమాదాలకు గురైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కావున వీలైనంత వరకు రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.

ఒక వేళా రాత్రి సమయంలో తప్పకుండా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తులు తీసుకోవాలి లేదా కొన్ని టిప్స్ పాటించాలి. ఇందులో ప్రధానంగా చెప్పగోదగ్గవి.. ''తప్పకుండా మీ కారు లైట్స్ బాగా పనిచేస్తాయని ముందుగానే నిర్దారించుకోవాలి. మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయకుండా ఉండటం చాలా వరకు మంచిది. మద్యం సేవించి డ్రైవ్ చేయడం చాలా ప్రమాదం, రాత్రి డ్రైవింగ్ చేయాలనుకునే వారు పగటి పూత తప్పకుండా నిద్రపోవాలి''.

రాత్రి పూట డ్రైవింగ్ చాలా ప్రమాదం.. దానికి ఇదే నిదర్శనం: తప్పక చూడండి

తప్పకుండా ఇలాంటి నియమాలను పాటించినప్పుడే కొంత వరకు రాత్రి పూట జరిగే ప్రమాదాలను నియంత్రించవచ్చు. లేకపోతే అనుకోని, ఊహకందని ప్రమాదాలు జరుగుతాయి. పగటి పూట కంటే రాత్రి పూట ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ ఆదమరిస్తే భయంకరమైన ప్రమాదాలు జరిగుతాయి, ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 27, 2022, 10:20 [IST]
English summary
Mla jaykumar gore toyota fortuner accident be careful for night driving
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+