భారత్‌ను స్వాగతించిన లండన్: మోడి కోసం లండన్ ఎక్స్‌ప్రెస్ బస్సు.
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు లండన్‌లో బ్రిటన్ ఎక్స్‌ప్రెస్ బస్సు మీద యాత్రలో పాల్గొన్నారు. భారత సమాజంలో అత్యంత ఆధరణ కలిగిన తమ నాయకుడు లండన్‌లో ఒక బస్సు మీద కనిపించబోతున్నందుకు. అక్కడ ఉన్న భారతీయులు తెగ సంతోషపడుతున్నారు.
భారత ప్రధాన మంత్రి గారి అన్ని సందర్శనలకు బస్సు యాత్ర ఎంతో ప్రసిద్ది చెందినది. ఎందుకంటే మోడీ గారు గుజరాత్ లో కూడా ఎక్స్‌ప్రెస్ బస్సు యాత్ర మరియు అనేక పార్టీ యాత్రలలో బస్సు యాత్ర ఎంతో ప్రత్యేకమైనది.

భారత్‌లో మోడీని అందరూ చాయ్ వాలా అని సంభోదిస్తారు. అది అందరికి తెలిసిన విషయమే కాని లండన్ వాసులు మోడి బస్సు మీద కొన్ని చోట్ల ఛాయ్ వాలా అని వచ్చేట్లు ఏర్పాట్లు చేశారు.

దాదాపుగా 400 వరకు కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు మోడీ యాత్రకు స్వాగతం పలుకడానికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది కూడా పూర్తిగా ఒలంపిక్స్ స్టైల్‌లో.

నరేంద్ర మోడీ గారి బస్సు యాత్రలు బాగా సఫలం చెందుతున్న నేఫథ్యంలో ఎన్నో నగరాలను సందర్శించాడు. అందులో ఈలింగ్ వెంబ్లియా అనే నగరం కూడా ఒకటి.

మోడీ యాత్రకు స్వాగతం పలకడానికి దాదాపుగా 60,000 మంది ప్రజలు వరకు వస్తున్నట్లు అంచనా . అందుకే కాబోలు మోడీ మంత్రం బాగా పనిచేస్తుందని కొందరి అభిప్రాయం.

లండన్‌లో ప్రదాని యాత్ర సందర్భంగా లండన్ మరియు భారతీయుల మద్య సత్సంభందాలు బాగా మెరుగుపడతాయని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications








