దేశ ప్రజలకు నరేంద్రమోడీ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్‌..? సామాన్యులకు భారీ ఊరట!

దేశ ప్రజలకు నరేంద్రమోడీ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Petrol Diesel Prices) తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటిపై సుమారు రూ.10 తగ్గించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా చాలా రోజుల నుంచి ఇంధన ధరల్లో మార్పు లేదు. దీంతో దేశప్రజలకు ఇంధన ధరలు తగ్గించి దీపావళి కానుక (modi govt diwali gift) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 12న దీపావళి పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. అప్పటిలోగా దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీనిపై అధికారులలో సంబంధిత శాఖ మంత్రి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

petrol and diesel prices latest news

ప్రకటన ఎప్పుడు రానుంది..! : 2021 సంవత్సరంలోనూ దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా తగ్గింపు ప్రకటన ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ ముందు ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

పెట్రోల్ ఉత్పత్తికి ఎంత ఖర్చు అవుతుంది : భారత్‌ ఎక్కువగా పెట్రోల్‌, డీజిల్‌ కోసం ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఆయా దేశాల నుంచి పెద్దమొత్తంలో ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ ముడిచమురు ధర ఆధారంగా దేశంలో ఇంధన ధరల్లో మార్పులు ఉంటాయి. దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ఉత్పత్తికి రూ.57.35 ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఈ ధరపై ఎక్సైజ్‌ సుంకం, వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌, డీలర్ కమీషన్‌ను కలిపి ధరను నిర్ణయిస్తున్నారు.

fuel prices may down diwali 2023

వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు ఎందుకో తెలుసా? : ఈ ఇంధన ధరకు అదనంగా రవాణా ఖర్చును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రవాణా ఖర్చులు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అందుకే నగరాన్ని బట్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలుంటాయి. అయితే ఇంధన ధరల తగ్గింపు నిర్ణయం ప్రకటన వెలువడితే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఉపసమనం కలుగుతుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలు సహా దేశంలో పెరుగుతున్న కాలుష్యం సహా ఇతర కారణాలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాలపై ఎక్కువగా దృష్టిపెట్టింది. ఫలితంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు FAME-2 కింద సబ్సిడి అందిస్తోంది. ఫలితంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతారని భావిస్తోంది.

ఎలక్ట్రిక్‌ వాహనాలతోపాటు ఇథనాల్‌తో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తోంది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ తరహా వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 2025 నాటికి ఈ ఇథనాల్‌తో నడిచే వాహనాలు గణనీయంగా ఉండాలని భావిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, November 3, 2023, 15:52 [IST]
English summary
Modi government may cut fuel prices for diwali 2023 gift
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+