మోడిఫైడ్ హోండా షైన్ కఫే రేసర్

ఫీల్ ఆన్ వీల్ కస్టమైజేషన్ బృందం ఈ మోడిఫైడ్ హోండా షైన్ కఫే రేసర్ మోటార్ సైకిల్‌కు సైబర్‌ట్రాన్ అనే పేరును పెట్టారు. హోండా షైన్ బైకును ఫ్యూచర్ మరియు రోబోటిక్ డిజైన్ అంశాలతో నియో-రెట్రో స్టైల్లో విన్నూత్

By Anil Kumar

ఇటీవల కాలంలో మోడిఫికేషన్ సంస్థలు ఎలా బైకులనైనా మనకు నచ్చినట్లుగా మార్చేస్తున్నారు. ప్రధానంగా మోడిఫికేషన్స్‌కు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు చాలా అనువుగా ఉంటాయి. కానీ, ఈ వాదనను తప్పుబడుతూ రాజస్థాన్‌కు చెందిన "ఫీల్ ఆన్ వీల్" బృందం హోండా షైన్ బైకులో కఫే రేసర్‌ను సృష్టించారు.

హోండా షైన్ కఫే రేసర్

వినడానికి మాత్రమే కాదు, చూసినా కూడా నమ్మబుద్ది కావడం లేదు. ఓ 125సీసీ బైకు ఇలా ఇటాలియన్ బైకులకు గట్టిపోటీన్చేలా కఫే రేసర్ స్టైల్లోకి మారిపోవడంతో దీనిని చూసిన బైకు ప్రియులంతా ఆశ్చర్యపోతున్నారు.

హోండా షైన్ ఆధారిత కఫే రేసర్ గురించి మరిన్ని వివరాలు....

హోండా షైన్ కఫే రేసర్

ఫీల్ ఆన్ వీల్ కస్టమైజేషన్ బృందం ఈ మోడిఫైడ్ హోండా షైన్ కఫే రేసర్ మోటార్ సైకిల్‌కు సైబర్‌ట్రాన్ అనే పేరును పెట్టారు. హోండా షైన్ బైకును ఫ్యూచర్ మరియు రోబోటిక్ డిజైన్ అంశాలతో నియో-రెట్రో స్టైల్లో విన్నూత్నంగా తీర్చిదిద్దారు.

హోండా షైన్ కఫే రేసర్

ఫ్రంట్ డిజైన్‌లో చాలా అడ్వాన్స్‌డ్ హెడ్ ల్యాంప్ ప్యానల్ మరియు అతి తక్కువ బాడీ ప్యానల్స్‌తో ఆరంబడాలకు దూరంగా చాలా సింపుల్‌గా ఫినిష్ చేశారు. బైకు ఫ్రంట్ చాలా పొట్టిగా, చిన్న పరిమాణంలో ఉన్న ఫెండర్స్ మరియు డ్యూయల్-పర్పస్ టైర్లు ఉన్నాయి.

హోండా షైన్ కఫే రేసర్

బైక్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, షైన్ బైకులో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ స్థానంలో కఫే రేసర్ బైకుల్లో వచ్చే బాక్సు లాంటి ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. బైక్ ఓవరాల్ డిజైన్‌లో ప్రధాన హైలైట్ ఇదేనని చెప్పవచ్చు.

హోండా షైన్ కఫే రేసర్

ఇంజన్ మరియు ఫ్యూయల్ ట్యాంక్, మోడిఫైడ్ సైలెన్సర్ మరియు సింగల్ సీటు మినహాయిస్తే మరెలాంటి డిజైన్ ఎలిమెంట్లు లేవు. ఇంజన్ విడి భాగాలు, సస్పెన్షన్‌తో పాటు ఛాసిస్‌ను కూడా స్పష్టంగా గమనించవచ్చు.

హోండా షైన్ కఫే రేసర్

ఇలాంటి బైకులను ఇండియన్ రోడ్ల మీద నడపడం కాస్త రిస్కుతో కూడుకున్నది. అయినప్పటికీ, కఫే రేసర్ల రేసింగ్ స్టైల్ వారికి ఉండనే ఉంటుందనుకోండి. నిజానికి కఫే రేసర్లకు విదేశీ మార్కెట్లలో డిమాండ్ ఎక్కువ. దేశీయ విపణిలో కూడా వీటి వాడకం మెల్లమెల్లగా పెరుగుతోంది.

హోండా షైన్ కఫే రేసర్

మోడిఫైడ్ హోండా షైన్ కఫే రేసర్ రియర్ డిజైన్‌లో చిన్నగా ఉన్న సీటు కౌల్, మరియు సీటుకు చివరిలో బ్రేకు లైటులా పనిచేసే ఎల్ఇడి స్ట్రిప్ ఉంది. బైకులో ముందు మరియు వెనుక ఇరువైపులా మడ్ గార్డ్స్ లేవు.

హోండా షైన్ కఫే రేసర్

చూడటానికి లక్షలు ఖరీదు చేసే కఫే రేసర్ బైకులా కనిపిస్తున్నప్పటికీ, ఇందులో హోండా షైన్ ఇంజన్ కలదు. 124.7సీసీ కెపాసిటి గల ఫోర్-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ 10.57బిహెచ్‌పి పవర్ మరియు 10.30ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

హోండా షైన్ కఫే రేసర్

ఫీల్ ఆన్ వీల్ కస్టమైజేషన్ బృందం తమ అద్భుతమైన ఇంజనీరింగ్ పనితీరు మరియు ఎంతో శ్రమతో ఓ సాధారణ కమ్యూటర్ బైకును కఫే రేసర్ స్టైల్లోకి మార్చారు. దీని ధర మరియు మోడిఫికేషన్ అయిన ఖర్చు గురించి ఎలాంటి సమాచారం లేదు.

మోడిఫైడ్ హోండా షైన్ కఫే రేసర్ వీడియో....

Source: FEEL ON WHEEL

Most Read Articles

English summary
Read In Telugu: Modified Honda Shine cafe racer motorcycle proves humble can be very cool
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X