నీటిలో అయితే ఏం.. అక్కడుంది మహీంద్రా కారు - ఫిదా చేస్తున్న వీడియో
దేశంలో అక్కడక్కగా విపరీతమైన వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, ముంబై ప్రాంతాలలో.. దక్షిణ భారతదేశంలో కేరళ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండిపోయాయి. కొందరు వారి నివాసాల్లోనే చిక్కుకుపోయారు. వర్షాభావ ప్రాంతాల్లో ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకుంటూనే ఉన్నాయి. కొందరు యువకులు కూడా రంగంలోకి దిగి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు చేరుస్తున్నారు. ప్రజలను రక్షించడానికి వారు మోడిఫైడ్ కారును ఉపయోగించడం వీడియోలో చూడవచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పాత తరం మహీంద్రా బొలెరో కనిపిస్తుంది. ఇది స్నార్కెల్‌తో మోడిఫైడ్ చేయబడింది. ఈ కారు నీటిలో కూడా ఎటువంటి సమస్య లేకుండా సజావుగా ముందుకు సాగుతోంది. కారు నీటితో నిండిన వరండా వద్దకు వెళ్లడం చూడవచ్చు. కారు లోపలికి కూడా నీరు చేరినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఇది పాత మోడల్ కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా ముందుకు సాగుతోంది.

నీరు ఎక్కువగా నిలిచి ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తులు ఒక పెద్దాయనను కారు బోనెట్ మీద కూర్చోబెట్టుకున్నారు. ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వీడియోలో ఓ మినీ లారీ కూడా పనిచేయని స్థితిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అయితే మహీంద్రా బొలెరో మాత్రం హుందాగా ముందుకు సాగుతూ ప్రజలను కాపాడంలో సహాయం చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
మరో వీడియోలో ఓ పాత మహీంద్రా జీప్ 4x4 కారు కూడా నీళ్లలో తిరుగుతూ ఉండటం చూడవచ్చు. దీనికి పైన పైకప్పు మీద లైఫ్‌బాయ్‌లు మరియు చిన్న తెప్ప ఉండటం కూడా చూడవచ్చు. కారు లోపలికి కూడా సగం వరకు నీరు చేరింది. అయినప్పటికీ ఎలాంటి సమస్య లేకుండా కారు ముందుకు సాగుతోంది. మొత్తం మీద మహీంద్రా కార్లు ప్రజలను కాపాడటానికి ఎంతగానో పాటుపడుతుండం చూడవచ్చు.
ప్రజలకు సహాయం చేయడంలో ఆఫ్-రోడర్లు ముందుకు రావడం ఇదేమీ కొత్త కాదు. 2018లో కేరళ చరిత్రలోనే అతిపెద్ద వరద వచ్చినప్పుడు కూడా చాలామంది 4x4 వాహనాల యజమానులు తమ వాహనాలను ప్రజలను కాపాడటానికి ఉపయోగించారు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు అధికం కావడంతో లోతట్టు ప్రాంతం మొత్తం నీటితో నిండింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మోడిఫైడ్ కారు కనిపిస్తోంది. నిజానికి మోటార్ వెహికల్ యాక్ట్ కింద భారతదేశంలో మోడిఫైడ్ వాహనాలు చట్ట విరుద్ధం. అయితే కొన్ని సార్లు నీటిలో వెళ్లడానికి, బురద వంటి ప్రాంతాల్లో వెళ్ళడానికి సాధారణ కార్లు ఉపయోగపడవు. మోడిఫైడ్ వాహనాలు ఇలాంటి సమయంలో ఉపయోగపడతాయి. ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలను కాపాడంలో మోడిఫైడ్ కార్లు కీలక పాత్ర పోషిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వాన్ని చాలామంది మోడిఫైడ్ వాహనాదారులు, తమ మోడిఫైడ్ వాహనాలను చట్టబద్దం చేయాలని అభ్యర్థిస్తున్నారు. గతంలో వరదల్లో ప్రజలను రక్షించడానికి ఉపయోగించిన మోడిఫైడ్ కార్లకు కూడా కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ జరిమానా విధించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటిని చట్టబద్దం చేస్తే అలాంటి జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








