ఎంతో ఇష్టపడి మోడిఫై చేయించుకుంటే పోలీసుల చేతిలో చివరికి ఇలా మిగిలింది

మారుతి బాలెనో కారు ఓనరు, ఎంతో ఖర్చు చేసి, వ్యయప్రయాసలతో అచ్చం మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారును పోలి ఉండే రూపంలోకి మోడిఫై చేయించుకున్నాడు. అయితే, అతని ఆనందం మూన్నాళ్ల ముచ్చటయ్యింది.

By Anil

అందవిహీనంగా... చూడటానికి అసహ్యంగా ఉండే ఎన్నో మోడిఫైడ్ కార్లు మరియు బైకులను మనం ఎన్నో చూసుంటాం. కానీ ప్రతిఒక్కరి దృష్టిని ఆకర్షించే మెర్సిడెస్ ఎ-క్లాస్ రూపంలోకి మోడిఫైడ్ చేయబడిన ఇలాంటి మారుతి బాలెనో మోడిఫైడ్ కారును ఎప్పుడు చూసుండరు.

మెర్సిడెస్ ఏ-క్లాస్ మోడిఫైడ్ మారుతి బాలెనో

మారుతి బాలెనో కారు ఓనరు, ఎంతో ఖర్చు చేసి, వ్యయప్రయాసలతో అచ్చం మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారును పోలి ఉండే రూపంలోకి మోడిఫై చేయించుకున్నాడు. అయితే, అతని ఆనందం మూన్నాళ్ల ముచ్చటయ్యింది. ఎందుకంటే ఆర్‌టిఓ విభాగానికి చెందిన పోలీసులు మోడిఫికేషన్స్ మొత్తాన్ని తొలగించేశారు.

మెర్సిడెస్ ఏ-క్లాస్ మోడిఫైడ్ మారుతి బాలెనో

బాలెనో కారు ఓనర్ తన మోడిఫైడ్ బాలెనో కారులో ఫ్రంట్ బంపర్‌ను మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ బంపర్‌‌తో మార్చేశాడు. అంతే కాకుండా చక్రాలను కూడా మార్కెట్లో లభించే విశాలమైన అల్లాయ్ వీల్స్‌తో మార్పించి ఎంతో ఆకర్షణీయంగా మార్చేశాడు.

Recommended Video

Bangalore City Police Use A Road Roller To Crush Loud Exhausts
మెర్సిడెస్ ఏ-క్లాస్ మోడిఫైడ్ మారుతి బాలెనో

చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేందుకు ఇందులో మెర్సిడెస్ ఏ-క్లాస్ డైమండ్ ఫ్రంట్ గ్రిల్, ఎక్కువ గాలిని గ్రహించే విశాలమైన ఫ్రంట్ గ్రిల్ మరియు మెర్సిడెస్ బెంజ్ లోగో వంటివి ఉన్నాయి.

మెర్సిడెస్ ఏ-క్లాస్ మోడిఫైడ్ మారుతి బాలెనో

రియర్ డిజైన్‌లో కూడా మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ డ్యూయల్ క్వాడ్ ఎగ్జాస్ట్ పైపులు, రియర్ డిఫ్యూసర్ ఉన్నాయి. 5-స్పోక్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు లో ప్రొఫైల్ టైర్లు మోడిఫికేషన్స్‌లో భాగమయ్యాయి.

మెర్సిడెస్ ఏ-క్లాస్ మోడిఫైడ్ మారుతి బాలెనో

ఇంటీరియర్‌లో కూడా చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. కానీ రియల్ లైఫ్‌తో పోల్చుకుంటే కాస్త అసాధ్యమే అనిపించినా, అన్నింటిని తన మోడిఫైడ్ బాలెనో కారులో సాధ్యమని నిరూపించుకున్నాడు. అయితే, సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

మెర్సిడెస్ ఏ-క్లాస్ మోడిఫైడ్ మారుతి బాలెనో

అప్పట్లో మెర్సిడెస్ ఏ-క్లాస్ రూపంలోకి మారిపోయిన మారుతి బాలెనో కారు అని వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఇదే కారు మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, అనధికారికమైన ఈ మోడిఫికేషన్ గురించి కేరళ రవాణా కమీషనర్‌కు ఫిర్యాదు అందడంతో ఆర్‌‌టిఓ అధికారులు ఈ కారు ఓనర్ మీద కేస్ ఫైల్ చేశారు.

Trending On DriveSpark Telugu:

మెర్సిడెస్ ఏ-క్లాస్ మోడిఫైడ్ మారుతి బాలెనో

పోలీసుల సహకారంతో ఆర్‌టిఓ అధికారి మోడిఫైడ్ బాలెనో కారును సీజ్ చేసి, కారు రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేశారు. ఇందుకు కారు ఓనర్ స్పందిస్తూ... సంభందిత అధికారులకు కారును అప్పజెప్పడానికి 15 రోజుల గడువును కోరాడు.

మెర్సిడెస్ ఏ-క్లాస్ మోడిఫైడ్ మారుతి బాలెనో

పరిస్థితి చేయిజారక ముందే అసలు విషయాన్ని అర్థం చేసుకున్న కారు ఓనర్ తన మోడిఫికేషన్స్ మొత్తాన్ని తొలగించేశాడు మరియు తొలకించిన అన్ని మోడిఫైడ్ విడిభాగాలను పోలీసులకు అందజేశాడు. దీనికి దర్యాప్తు చేసి, జరిమానా నిర్ణయిస్తామని ఆర్‌టిఓ అధికారులు పేర్కొన్నారు.

మెర్సిడెస్ ఏ-క్లాస్ మోడిఫైడ్ మారుతి బాలెనో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సాధారణంగా, కేవలం అవసరానికి తగ్గట్లుగా మోడిఫైడ్ చేయించుకున్న వాహనాలకు మాత్రమే ఆర్‌టిఓ అధికారులు అనుమతిస్తారు. చిన్నపాటి మోడిఫికేషన్స్ గల కార్లు సర్వసాధారణం. అయితే, ఆర్‌సి బుక్‌లో ఉన్న వెహిల్ పేరుకు పోలికి లేకుండా మోడిఫికేషన్స్ చేయించుకుంటున్నారు. ఇలా అయితే ఎవ్వరూ అనుమతించరు. ఇలాంటి నేపథ్యంలోనే అత్యంత సుందరంగా మెర్సిడెస్ ఏ-క్లాస్ రూపంలోకి మోడిఫై అయిన కారును విడగొట్టేశారు.

More from DriveSpark

Article Published On: Saturday, December 9, 2017, 21:15 [IST]
English summary
Read In Telugu: Maruti Baleno Modified As Mercedes A-Class — Stripped To Stock By Police And RTO
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+