సరికొత్త డ్రెస్ కిట్‌తో మోడిఫై చేసిన మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, ఇది ఈ విభానికే లీడర్‌గా కొనసాగుతుంది. యవ కొనుగోలుదారులు ఎక్కువగా స్విఫ్ట్ కారును తమ ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకుంటుంటారు.

సరికొత్త డ్రెస్ కిట్‌తో మోడిఫై చేసిన మారుతి సుజుకి స్విఫ్ట్

మనం ఇప్పటికే అనేక రకాల మోడిఫైడ్ మారుతి స్విఫ్ట్ కార్లను చూశాం. తాజాగా, స్పోర్ట్స్ కార్ రూపంలో మోడిఫై చేయబడిన స్విఫ్ట్ ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇందులో ఓ బ్లూ కలర్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారును సరికొత్త బాడీ కిట్‌తో మోడిఫై చేశారు. ఇది చూడటానికి చాలా స్పోర్టీగా అనిపిస్తుంది.

ఇటీవల, స్విఫ్ట్ స్పోర్ట్ యొక్క సవరించిన మెక్సికన్ మోడళ్ల చిత్రాలు ఇంటర్నెట్‌లో చాలా వైరల్ అవుతున్నాయి. ఈ కారు రేసింగ్ కారు రూపంలో సవరించబడిందని చెబుతారు. ఈ కారులో చాలా ఆకర్షణీయమైన బ్లూ రేసింగ్ బాడీ కిట్ ఉంది. కారు ముందు భాగం పూర్తిగా మార్చబడింది.

సరికొత్త డ్రెస్ కిట్‌తో మోడిఫై చేసిన మారుతి సుజుకి స్విఫ్ట్

ఇందులో ఫ్రంట్ గ్రిల్‌ను తొలగించి పూర్తిగా బ్లాక్ కలర్ హనీకోంబ్ గ్రిల్‌తో రీప్లేస్ చేశారు, గ్రిల్ మధ్యలో బ్లాక్ అండ్ సిల్వర్ కలర్‌లో సుజుకి లోగో ఉంటుంది. అలాగే ఫ్రంట్ బంపర్‌ను కూడా పూర్తిగా రీడైన్ చేశారు. బంపర్ దిగువ స్థానంలో స్టైలిష్ స్కిడ్ ప్లేట్‌ను అమర్చారు. ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌ను కూడా రీడిజైన్ చేశారు.

ఇంకా ఇందులో ఒరిజినల్ హెడ్‌ల్యాంప్స్ స్థానంలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను మార్చారు. ఈ మోడిఫైడ్ స్విఫ్ట్ కారులో ఫ్రంట్ బంపర్ నుండి బానెట్, రూఫ్ మీదుగా రియర్ బంపర్ వరకూ సాగే బ్లాక్ అండ్ రెడ్ కలర్ స్ట్రైప్స్‌తో అంటించిన స్టిక్కర్ ఇందులో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది, ఇది కారు మరింత స్పోర్టీ రూపాన్ని ఇస్తుంది.

సరికొత్త డ్రెస్ కిట్‌తో మోడిఫై చేసిన మారుతి సుజుకి స్విఫ్ట్

సైడ్ ప్రొఫైల్ డిజైన్‌లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు. అయితే, ఇందులో 07 అంకెతో కూడిన రేసింగ్ స్టైల్ గ్రాఫిక్స్ మరియు స్పోర్టీ అల్లాయ్ వీల్స్, వాటిపై లోప్రొఫైల్ ఫాల్కన్ టైర్లను గమనించవచ్చు. సైడ రన్నర్‌పై బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంటుంది, దానిపై రెడ్ కలర్ స్ట్రైప్ ఉంటుంది.

ఇక కారు వెనుక ప్రొఫైల్‌ను గమనించినట్లయితే, రియర్ బంపర్‌ను కూడా పూర్తిగా రీడిజైన్ చేశారు. బంపర్ దిగువ భాగంలో బ్లాక్ క్లాడింగ్ అమర్చారు. వెనుక వైపు విండ్‌స్క్రీన్ పైభాగంలో బ్లాక్ కలర్ స్పాయిలర్‌ను అమర్చారు, ఇది దీని స్పోర్టీ రూపాన్ని మరింత పెంచడంలో సహకరిస్తుంది.

సరికొత్త డ్రెస్ కిట్‌తో మోడిఫై చేసిన మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ మోడిఫైడ్ కారులో కాస్మెటిక్ మార్పులు మినహా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇది 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 83 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తున్న స్విఫ్ట్ స్పోర్ట్ 1.4-లీటర్ బూస్టర్‌జెట్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది 140 బిహెచ్‌పి శక్తిని మరియు 230 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సరికొత్త డ్రెస్ కిట్‌తో మోడిఫై చేసిన మారుతి సుజుకి స్విఫ్ట్

మోడిఫైడ్ స్విఫ్ట్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, మారుతి సుజుకి స్విఫ్ట్ దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్. పెర్ఫార్మెన్స్, మైలేజ్, స్టైల్, డిజైన్ మరియు హ్యాండ్లింగ్ వంటి అనేక అంశాల్లో ఇది మెరుగ్గా ఉంటుంది. మరి ఈ మోడిఫైడ్ స్విఫ్ట్ కారుపై మీ అభిప్రాయం ఏంటి?

Most Read Articles

English summary
Maruti Suzuki Swift modified into sports car details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X