బ్లాక్ అండ్ వైట్ మహీంద్రా థార్.. దీని స్టైలే వేరు గురూ..

మహీంద్రా అందిస్తున్న ఐకానిక్ జీప్ స్టైల్ థార్ అంటే ఇష్టపడని ఆఫ్-రోడ్ ప్రియులు ఉండరు. ప్రత్యేకించి కస్టమైజ్డ్ థార్ మోడళ్లకు ఉండే క్రేజే వేరు. కార్ కస్టమైజేషన్ కంపెనీలు మరియు కస్టమైజేషన్ కోరుకునే కస్టమర్లు తమలో ఉన్న సృజనాత్మకతను అంతా కలిపి అద్భుతమైన థార్ మోడళ్లను తయారు చేస్తుంటారు.

బ్లాక్ అండ్ వైట్ మహీంద్రా థార్.. దీని స్టైలే వేరు గురూ..

ఇదివరకటి కథనాల్లో మనం కొన్ని మోడిఫైడ్ 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీల గురించి తెలుసుకున్నాం. ఈ కథనంలో కూడా అలాంటి ఓ మోడిఫైడ్ థార్ గురించి తెలుసుకుందాం రండి. ఈ ఫొటోలో కనిపిస్తున్న కొత్త మహీంద్రా థార్‌ను బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో కస్టమైజ్ చేశారు.

మహీంద్రా థార్‌లో వైట్ కలర్ పెయింట్ స్కీమ్ అందుబాటులో లేదు. దీంతో ఓ ఔత్సాహిక థార్ కస్టమర్ తనకు నచ్చిన రీతిలో ఈ కారును కస్టమైజ్ చేయించుకున్నారు. వైట్ కలర్ పెయింట్‌పై బ్లాక్ కలర్ వినైల్ స్టిక్కర్లను అమర్చి అందంగా తీర్చిదిద్దారు.

MOST READ:నిజంగా ఈ బైకర్స్ అదృష్టవంతులే సుమీ.. ఎందుకో వీడియో చూడండి

బ్లాక్ అండ్ వైట్ మహీంద్రా థార్.. దీని స్టైలే వేరు గురూ..

అంతేకాకుండా, దీని హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్ మరియు బంపర్లను కూడా మోడిఫై చేశారు. స్టాక్ లైట్ల స్థానంలో ఎల్ఈడి లైట్లను అమర్చారు. అలాగే, ముందు మరియు వెనుక బంపర్లను మరియు వీల్ ఆర్చెస్‌ను కూడా నలుపు రంగులో ఫినిష్ చేశారు.

బ్లాక్ అండ్ వైట్ మహీంద్రా థార్.. దీని స్టైలే వేరు గురూ..

అలాగే, గన్ మెటల్ బూడిద రంగులో ఉన్న స్టాక్ అల్లాయ్ వీల్స్‌ను గ్లోసీ బ్లాక్‌లో ఫినిష్ చేశారు. ఈ మోడిఫికేషన్లన్నీ కలిపి థార్ యొక్క మొత్తం రూపాన్ని మరింత అందంగా మరియు ఆకర్షణీయంగా మారుస్తాయి. ఈ మోడిఫికేషన్ కోసం ఉపయోగించింది మహీంద్రా థార్ యొక్క 4 సీటర్ సాఫ్ట్ టాప్ కన్వర్టిబుల్ వెర్షన్. ఈ ఎస్‌యూవీలోని లోపలి భాగాన్ని కూడా మొత్తం బ్లాక్ థీమ్‌లో డిజైన్ చేశారు.

MOST READ:గురుగ్రామ్‌లో 55 శాతం తగ్గిన ట్రాఫిక్ ఫైన్స్.. దీనికి కారణం ఇదే

బ్లాక్ అండ్ వైట్ మహీంద్రా థార్.. దీని స్టైలే వేరు గురూ..

మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ 'థార్'కి మార్కెట్లో విడుదలైనప్పటి నుండి మంచి ఆదరణను పొందుతోంది. ఈ కొత్త తరం థార్‌ను కేవలం ఆఫ్-రోడ్ ప్రియులనే కాకుండా ఇటు రోజూవారీ సిటీ ప్రయాణాలు చేసే వారిని కూడా దృష్టిలో ఉంచుకొని కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసింది. సరికొత్త డిజైన్, స్టైల్, కంఫర్ట్ మరియు సేఫ్టీ ఫీచర్లతో కొత్త 2020 థార్‌ను రూపొందించారు.

బ్లాక్ అండ్ వైట్ మహీంద్రా థార్.. దీని స్టైలే వేరు గురూ..

ఇక కొత్త 2020 మహీంద్రా థార్ విషయానికి వస్తే, మార్కెట్లో దీని ధరలు రూ.9.80 లక్షల నుండి రూ.13.75 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. కొత్త మహీంద్రా థార్ మూడు రూప్ టాప్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో సాఫ్ట్ టాప్, కన్వర్టిబుల్ టాప్ మరియు హార్డ్ టాప్ / ఫిక్స్‌డ్ టాప్‌లు ఉన్నాయి.

MOST READ:లంబోర్ఘినితో చేతులు కలిపిన అమెరికన్ సింగర్ లేడీ గాగా ; ఎందుకో తెలుసా ?

బ్లాక్ అండ్ వైట్ మహీంద్రా థార్.. దీని స్టైలే వేరు గురూ..

ఇటీవల గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్టులో కొత్త 2020 మహీంద్రా థార్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ మరియు రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా థార్ కొత్త 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

బ్లాక్ అండ్ వైట్ మహీంద్రా థార్.. దీని స్టైలే వేరు గురూ..

పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇవి రెండూ కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పెట్రోల్ వెర్షన్‌లో టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

MOST READ:ఈ రూల్స్ సాధరణ వాహనాలకు మాత్రమే కాదు పోలీస్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.. ఆ రూల్స్ ఏవో మీరూ చూడండి

బ్లాక్ అండ్ వైట్ మహీంద్రా థార్.. దీని స్టైలే వేరు గురూ..

ఇదిలా ఉంటే కొత్త తరం థార్‌లో కంపెనీ మరో కొత్త కలర్ ఆప్షన్‌ను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిల్వర్ కలర్‌లో పెయింట్ చేయబడిన ఓ వేరియంట్‌ను మహీంద్రా భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. పాక్షికంగా క్యామోఫ్లేజ్ చేయబడిన ఈ మోడల్‌లో స్టీల్ వీల్స్‌ను ఉపయోగించారు.

Most Read Articles

English summary
New 2020 Mahindra Thar Modified in White Colour With New Tyres And LED Lights. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X