ఇది లంబోర్ఘిని కారు కాదు.. ఇంకేదో చెప్పుకోండి చూద్దాం!
లంబోర్ఘిని అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది సిజర్ టైప్ డోర్స్. అందరికి లంబోర్ఘిని కారులో తిరగాలని ఉంటుంది, కానీ ధర ఎక్కువ కావడం వల్ల అది సాధ్యం కాదు. కొంతమంది మాత్రమే తమ నైపుణ్యాన్ని ఉపయోగించి కార్లకు సిజర్ టైప్-డోర్స్ అమర్చుకుంటారు.
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. ఒక స్కోడా కారుకు లంబోర్ఘిని లాంటి డోర్స్ ఉండటం చూడవచ్చు. బహుశా ఇలాంటి డోర్స్ కలిగిన మొట్ట మొదటి స్కోడా కారు ఇదే అని చెబుతున్నారు. ఇది స్కోడా కంపెనీకి చెందిన 'ర్యాపిడ్' (Skoda Rapid). చూడటానికి ఇది చాలా స్టైలిష్‌గా ఉండటం చూడవచ్చు. ఒక్క చూపుతోనే ఆకర్శించబడే ఈ కారు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ పొందుతుంది.

భారతదేశంలో మొదటి కారు..
స్కోడా కారుకు లాంబో డోర్స్ అమర్చడం సాధ్యం కాదని ప్రారంభంలో చాలా మంది అన్నట్లు కారు ఓనర్ అన్నారు. కానీ అదంతా తప్పు అని కారు ఓనర్ నిరూపించారు. కారులో లంబోర్ఘిని స్టైల్ డోర్స్ అమర్చినప్పుడు.. కారు మొత్తం ధ్వంసమవుతుందని కూడా చాలా మంది పేర్కొన్నారని, అయితే ఇది భారతదేశంలో మొదటి కారు అయిందని ఓనర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది చూడటానికి కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
స్కోడా ర్యాపిడ్ పవర్‌ట్రెయిన్‌లో కూడా మోడిఫికేషన్స్ చేసిన తెలుస్తోంది. కాబట్టి ఇది 108 బీహెచ్‌పీ పవర్ అందిస్తుందని తెలుస్తోంది. ముంబైలోని కోడ్9 ట్యూమర్లు నుంచి స్టేజ్ 2 ట్యూన్ అందించిన తర్వాత 35 బీహెచ్‌పీ పెరిగిందని వెల్లడించారు. ఇందులో 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ అమర్చినట్లు పేర్కొన్నారు. ఎగ్జాస్ట్‌ను కూడా కస్టమైజ్ చేశారు. ఈ కారణంగా సౌండ్ కూడా చాలా పెద్దగా రావడం గమనించవచ్చు.

ఈ కారు చెప్పుకోదగ్గ డోర్స్ విషయానికి వస్తే... ఇవి డబుల్ బోల్ట్ సిస్టం పొందుతాయి. అంతే కాకుండా చాలా క్వాలిటీతో కూడుకున్నట్లు పేర్కొన్నారు. ఇతర లంబోర్ఘిని డోర్స్ మాదిరిగా కాకుండా కారు కదులుతున్న సమయంలో ఈ డోర్స్ ఓపెన్ కావు అని కూడా వారు పేర్కొన్నారు. డోర్ కిట్ మొట్ట ఢిల్లీ నుంచి కొనుగోలు చేసినట్లు కారు ఓనర్ స్పష్టం చేశారు.
నిజానికి భారతదేశంలో ఇలాంటి కారు మరెక్కడా లేదని ఓనర్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి కార్లను వినియోగించడం కొంత కష్టమనే చెప్పాలి. ఎందుకంటే సాధారణ కారు డోర్స్ మాదిరిగా కాకుండా ఇవి పైకి లేస్తాయి. కాబట్టి దీనికి అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. అయితే భారతదేశంలో మోడిఫైడ్ కార్లు పూర్తిగా నిషిద్ధం. కాబట్టి దీనివల్ల ఆ కారు ఓనర్ తప్పకుండా ఇబ్బందులుపడాల్సి వస్తుందని భావిస్తున్నాము.
నిజానికి 2011లో భారతదేశంలో అడుగుపెట్టిన స్కోడా ర్యాపిడ్ 2017లో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలైంది. ఇది మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ కలిగి ఉండటం వల్ల చాలా మంది వారికి నచ్చిన వేరియంట్ కొనుగోలు చేయగలిగారు. అంతే కాకుండా ఇవి మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి మంచి పనితీరును అందించేలా రూపొందించబడ్డాయి. కాగా కాలక్రమంలో ఈ కార్లకు డిమాండ్ తగ్గింది.. కొత్త కార్లకు ఆదరణ పెరిగింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








