మహ్మద్ షమీ గ్యారేజిలో చేరిని అత్యంత ఖరీదైన కారు: ధర అక్షరాలా..
భారతీయ క్రికెట్ ఆటగాడు 'మహ్మద్ షమీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎదుకంటే ఇండియన్ క్రికెట్ టీమ్ లో తనదైనరీతిలో మంచి పర్ఫామెన్స్ చూపిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. క్రికెటర్ గా అందరికీ పరిచయమున్న షమీ కార్ల ప్రేమికుడు కూడా.. ఈ కారణంగానే యితడు అప్పుడప్పుడు ఆధునిక కార్లను కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల 'జాగ్వార్' (Jaguar) బ్రాండ్ యొక్క లగ్జరీ కారుని కొనుగోలు చేసాడు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, మహ్మద్ షమీ జాగ్వార్ ఎఫ్-టైప్ (Jaguar F-Type) లగ్జరీ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశాడు. ఈ లగ్జరీ కారు ధర అక్షరాలా రూ. 98.13 లక్షలు (ఎక్స్-షోరూమ్). అంటే దాదాపు కోటిరూపాయలు అన్నమాట. ఇప్పుడు ఈ ఖరీదైన కారు షమీ గ్యారేజీలో చేరిపోయింది.

జాగ్వార్ ఎఫ్-టైప్ లగ్జరీ స్పోర్ట్స్ కారు అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 295 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ విడుదల చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

జాగ్వార్ స్టాండర్డ్ మోడల్ కాకుండా, ఎఫ్-టైప్ కూపే వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మరింత శక్తివంతమైన 5.0-లీటర్ వి8 ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 445 బిహెచ్‌పి పవర్ మరియు 580 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుందని కంపెనీ పేర్కొంది. అంతే కాకూండా దీని గరిష్ట వేగం గంటకు 285 కిలోమీటర్లు.

జాగ్వార్ ఎఫ్-టైప్ లగ్జరీ స్పోర్ట్స్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఇందులో లెదర్ సీట్లు, ఫ్లేమ్ రెడ్ స్టిచింగ్‌తో కూడిన డిజైనర్ డ్యాష్‌బోర్డ్, యాంబియంట్ లైట్లు మరియు మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా 12.3-ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.0- ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఉన్నాయి.

ఇందులో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

జాగ్వార్ ఎఫ్-టైప్ మల్టిపుల్ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అయితే షమీ కొన్న కారు కాల్డెరా రెడ్ కలర్ లో చూడ చక్కగా ఉంది. కంపెనీ వీటిని సిబియు మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి చేస్తుంది. కావున ఎక్కువ ధర వద్ద లభిస్తాయి.

ఇప్పటికే మహమ్మద్ షమీ బిఎండబ్ల్యు 5 సిరీస్ మరియు ఆడి వంటి అనేక లగ్జరీ కార్లతో పాటు టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కూడా కలిగి ఉన్నాడు. ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి.

షమీ కొనుగోలు చేసిన 'రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650' బైక్ సిల్వర్ కలర్ లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. 'కాంటినెంటల్ జిటి 650' ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 3.04 లక్షలు. అయితే షమీ కొనుగోలు చేసిన ఈ బైక్ టాప్ వేరియంట్ అయిన క్రోమ్ మోడల్, కావున దీని ధర సుమారు రూ. 3.31 లక్షల వరకు ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 బైక్ 648 సిసి, ప్యారలల్-ట్విన్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ 47 బిహెచ్‌పి పవర్ మరియు 52 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
మహమ్మద్ షమీ కొనుగోలు చేసిన 'జాగ్వార్ ఎఫ్-టైప్ లగ్జరీ' కారు చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు కొత్త బైకులు & కార్లను గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








