మహమ్మద్ షమీ గ్రౌండ్‌లో హీరో మాత్రమే కాదు.. ఈ లగ్జరీ కార్లకు కూడా బాస్.!!
2023 క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ మహమ్మద్ షమీ(Mohammed Shami).. తన అద్భుతమైన బౌలింగ్‌తో 7 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు.
అంతే కాకుండా నిన్నటి సెమీఫైనల్ మ్యాచ్‌లో మహమ్మద్ షమీ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో 50 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. అదే విధంగా, వరల్డ్ కప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధికంగా 5 వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ రికార్డు సాధించాడు.

భారత్‌లో సినిమా రంగం తర్వాత అంత క్రేజ్ ఉన్న ఫీల్డ్ ఏది అంటే క్రికెట్ మాత్రమే. అందుకే ఈ రెండు రంగాల సెలబ్రిటీలకు సంబంధించిన ఈ వార్త అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతుంది. అంతగా వారి గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో మహమ్మద్ షమీ కూడా మరే ఇతర స్టార్ నటులకు తీసిపోడనే చెప్పవచ్చు.
సినీ, క్రికెట్ రంగాల్లో సెలబ్రిటీలకు ఖరీదైన లగ్జరీ కార్లతో పాటు స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి. టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి కూడా కార్లంటే చాలా క్రేజ్. అతని వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. మహమ్మద్ షమీ ఈ ఏడాది కొనుగోలు చేసిన కార్ల వివరాలు చూద్దాం.

ఈ ఏడాది ప్రారంభంలో షమీ.. సరికొత్త జాగ్వార్(Jaguar F-Type Sports) ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారును కొనుగలో చేశాడు. కొత్త జాగ్వార్ కారును షమీ.. ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకున్నాడు. జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు రూ. 99.98 లక్షల నుండి రూ. 1.53 కోట్ల(ఎక్స్ షోరూమ్) ధరలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
కొత్త జాగ్వార్ స్పోర్ట్స్ కారు 2.0-లీటర్ 4-సిలిండర్ సూపర్ ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు 295 Bhp గరిష్ట శక్తిని, 400 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 8 - స్వీడిష్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

కొత్త జాగ్వార్ స్పోర్ట్స్ కారు గరిష్ఠంగా 249 Kmph వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 5.7 సెకన్లలో 0 - 100 kmph వేగంతో దూసుకుపోతుంది. ఈ స్పోర్ట్స్ కారులో అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఖాళీ సమయాల్లో షమీ.. ఈ స్పోర్ట్స్ కారులో చక్కర్లు కొడుతుంటాడు.
మహమ్మద్ షమీ వద్ద BMW 5 సిరీస్ సెడాన్ కారు కూడా ఉంది. ఈ కారు భారత మార్కెట్లో రూ. 68.90 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. BMW 5 సిరీస్ సెడాన్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో అందుబాటులో ఉంది.

కొత్త BMW 5 సిరీస్ 17.42 kmpl మైలేజ్‌ని ఇస్తుంది. ఇందులో అధునాతన లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే సిస్టమ్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్తో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఇంకా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది.
మహమ్మద్ షమీ వద్ద ఉన్న మరో SUV.. టయోటా ఫార్చ్యూనర్. ఈ కారు వేరియంట్ ప్రకారం రూ.33.43 లక్షల నుండి రూ.51.44 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇది 7 సీట్ కాన్ఫిగరేషన్ సిస్టమ్. ఇందులో 2.7 - లీటర్ పెట్రోల్, 2.8 - లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.
టయోటా ఫార్చ్యూనర్(Toyota Fortuner) 6 - స్పీడ్ మాన్యువల్, 6 - స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ SUV 10.0 kmpl మైలేజ్‌ని ఇస్తుంది. ఇందులో 2WD (టూ వీల్ డ్రైవ్), 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) టెక్నాలజీని కలిగి ఉంది.
టయోటా ఫార్చ్యూనర్‌లో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ AC మరియు క్రూయిజ్ కంట్రోల్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది.
ఇక మహమ్మద్ షమీ వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ(Royal Enfield Continental GT) 650 బైక్ కూడా ఉంది. ఈ బైక్‌తో షమీ స్టిల్‌ను ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ బైక్ ధర రూ. 3.18 లక్షల నుంచి రూ. 3.44 లక్షల(ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది. ఇందులో 647 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఆప్షన్ ఉంది.


Click it and Unblock the Notifications








