లగ్జరీ కారు కొన్న క్రికెటర్ మహమ్మద్‌ సిరాజ్‌.. డ్రీమ్‌ కారుపై ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చిన క్యాప్షన్‌ హైలట్‌!

హైదరాబాద్‌కి చెందిన భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ సరికొత్త లగ్జరీ కారుని కొనుగోలు చేశాడు. శ్రీలంక పర్యటన నుంచి తిరిగి రాగానే తన ఇంట్లోకి మరో కారుని గ్యారేజీలోకి ఆహ్వానించాడు. సరికొత్త రేంజ్ రోవర్ కారును డెలివరీ తీసుకున్న తర్వాత ఆ ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. 30 ఏళ్ల స్పీడ్‌స్టర్‌ తన డ్రీమ్ కారుని కొనుగోలు చేసినట్లు క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు.

దేశంలో సంపనున్నలు, ప్రముఖులు మరియు వ్యాపారవేత్తలు కొంతమంది మాత్రమే కలిగి ఉన్న ఈ సరికొత్త రేంజ్ రోవర్ సిరాజ్‌ కూడా కొనుగోలు చేశాడు. మీ కలలకు పరిమితులు లేవు, ఎందుకంటే అవి మరింత కష్టపడి పనిచేయడానికి మరియు నిరంతరం కృషి చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయని.. నిలకడతో మీరు చేసే ప్రయత్నమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తెలిపాడు.

Mohammed-Siraj-Buys-Range-Rover

ఈ కలల కారును కొనుగోలు చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్బంగా సదరు కారు కంపెనీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే, మీరు అనుకున్నది కూడా సాధించవచ్చని సిరాజ్‌ సూచించాడు. ఈ ఫోటోలు విజువల్స్‌కి భారీ స్థాయిలో పబ్లిక్ నుంచి రెస్పాన్స్‌ వచ్చింది. అందరూ సిరాజ్‌కి కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే మహమ్మద్ సిరాజ్ రేంజ్ రోవర్ లగ్జరీ ఎస్‌యూవీ కచ్చితమైన స్పెసిఫికేషన్ వివరాలు తెలియదు.

ప్రస్తుతం దేశంలో ఈ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ ధర రూ.2.98 కోట్ల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ SV ఆటోబయోగ్రఫీ వేరియంట్ ధర రూ.5.2 కోట్ల వరకు ఉంది. బేస్ వేరియంట్‌లో రేంజ్ రోవర్ 3 లీటర్, ఇన్‌లైన్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 394 bhp పవర్ మరియు 560 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Mohammed-Siraj-Buys-New-Car

8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆల్ వీల్ డ్రైవ్ లేఅవుట్ ద్వారా నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది. ఇది 2.5 టన్నుల బరువు కలిగి ఉంటుంది. బ్రేక్ ఎనర్జీ పునరుత్పత్తి శక్తి కలిగిన ఐడిల్-స్టాప్ సిస్టమ్‌ని కూడా పొందుతుంది. ఇది 0-100 కి.మీ వేగాన్ని కేవలం 5.8 సెకన్లలో అందుకుంటుంది. ఇది గంటకు 242 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ 4.4 లీటర్ V8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 523 bhp శక్తి మరియు 750 గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఆల్‌ వీల్‌ డ్రైవ్ సిస్టమ్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది 0-100 వేగాన్ని కేవలం 4.7 సెకన్లలో అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ 3 లీటర్ టర్బో డీజిల్ 6 సిలిండర్ల ఇంజిన్ 346 bhp-700 nmని, 3 లీటర్ టర్బో పెట్రోల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రైయిన్‌ 503 bhp-700 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ మరియు పెట్రోల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్లు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని కోరుకునే వారి కోసం ఉద్దేశించినవిగా ఉన్నాయి.

ఫీచర్లు మరియు ప్రాణుల సౌకర్యాల విషయానికొస్తే, 24-వే హీటెడ్ మరియు కూల్డ్ ఎగ్జిక్యూటివ్ రియర్ సీట్లు, 13.1-అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రెండు 13.1-అంగుళాల రియర్‌ ఇన్‌ఫోటైన్మెంట్ స్క్రీన్లు, మెరిడియన్ 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్, ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్స్, రియర్-వీల్ స్టీరింగ్ వంటి కొన్ని ఫీచర్లు ఇందుంలో ఉన్నాయి.

గ్యారేజీలో కార్లు: మహమ్మద్ సిరాజ్ గ్యారేజీలో కొత్తగా చేరిన రేంజ్ రోవర్‌తో పాటు, ఆనంద్ మహీంద్రా బహుమతిగా ఇచ్చిన మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, మహీంద్రా థార్, BMW 5-సిరీస్ సెడాన్ మరియు టయోటా ఫార్చ్యూనర్ కూడా ఉన్నాయి. బజాజ్ ప్లాటినా నుంచి ఇప్పుడు రేంజ్ రోవర్‌ కొనే వరకు కష్టపడి పైకి వచ్చాడు. క్రికెట్‌లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దేశానికి వన్నె తెస్తున్న సిరాజ్‌ ఎందరికో స్పూర్తిదాయకం.

More from DriveSpark

Article Published On: Monday, August 12, 2024, 16:38 [IST]
English summary
Mohammed siraj added range rover car in his garage full details in telugu
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+