మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

ఇండియన్ క్రికెట్ టీమ్ 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో మంచి పర్ఫామెన్స్ చూపించిన ఆరుగురు క్రికెటర్లకు కొత్త థార్ ఎస్‌యూవీని గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

ఇటీవల టి. నటరాజన్ మహీంద్రా థార్ డెలివరీ పొందాడు. అయితే ఇప్పుడు మహ్మద్ సిరాజ్‌ కూడా మహీంద్రా థార్ పొందారు. మహ్మద్ సిరాజ్ ఇటీవల సోషల్ మీడియాలో థార్ డెలివరీ చేస్తున్న ఫోటోలను పంచుకోవడమే కాకుండా, ఆనంద్ మహీంద్రా కు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

థార్ డెలివరీ చేసుకున్న తరువాత టి నటరాజన్ తన సంతకం చేసిన టి షర్టును ఆనంద్ మహీంద్రాకు గిఫ్ట్ గా పంపారు. ప్రస్తుతం టి.నటరాజన్ మరియు మహమ్మద్ సిరాజ్ థార్ డెలివెరీ చేసుకున్నారు. మిగిలిన ఆటగాళ్లకు ఈ ఎస్‌యూవీ చేరిందా లేదా అనేదాని గురించి స్పష్టమైన సమాచారం లేదు.

MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

భారత జట్టులో ఉన్న యువ ఆటగాళ్లను, కొత్త ఆటగాళ్లను సిరీస్ చేయడానికి ప్రోత్సహించదానికే ఈ మహీంద్రా థార్ ఎస్‌యూవీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతోందని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఆటగాళ్లను ఉత్సాహపరచడానికి ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

మహీంద్రా థార్ మహీంద్రా కంపెనీ నుండి వచ్చిన లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ. ఈ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత అద్భుతమైన స్పందనను పొందింది. అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో మహీంద్రా థార్ ఒకటి. కావున ఈ ఎస్‌యూవీ కోసం ఇప్పటికే బుకింగ్స్ ఎక్కువయ్యాయి. ఈ కారణంగా వెయిటింగ్ పీరియడ్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంది.

MOST READ:భర్త ఇచ్చిన గిఫ్ట్‌కి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

కొత్త మహీందర్ థార్ ఎఎక్స్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు ట్రిమ్లలో లభిస్తుంది. దీని ఎఎక్స్ వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్‌లలో మాత్రమే మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ప్రవేశపెట్టబడింది మరియు పెట్రోల్ ఇంజిన్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మరియు మాన్యువల్ మరియు ఆటోమేటిక్‌తో డీజిల్ అందుబాటులో ఉంది.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

ఇది కొత్త పెట్రోల్ మరియు అప్‌గ్రేడ్ డీజిల్ ఇంజిన్‌తో పరిచయం చేయబడింది. ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక దాని 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

ఇది కొత్త 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. తొలిసారిగా థార్ పెట్రోల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం స్టాండర్డ్ గా ఇవ్వబడుతుంది. ఇది దేశంలో చౌకైన ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఎస్‌యూవీ.

Most Read Articles

English summary
Mohammed Siraj Receives Mahindra Thar SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X