Mohanlal దీరుభాయ్ అంబానీ వాడిన కారుని కొనుగోలు చేసిన మలయాళం స్టార్ హీరో.. ఈ కారులో అంత స్పెషల్ ఏముందో తెలుసా?

మలయాళ చిత్ర పరిశ్రమలో మోహన్‌లాల్‌ పరిచయం అక్కర్లేని పేరు. మాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఆయన పొందారు. ప్రస్తుతం కేరళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. చాలా మంది నటుల మాదిరిగానే మోహన్‌లాల్‌కి కార్లు అంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలో చాలా కార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఆయన గ్యారేజీలో చేరిన కారు చాలా ప్రత్యేకం. ఆ వివరాలు మీకోసం.

మోహన్‌లాల్‌కి ఖరీదైన కార్లు, ఆధునిక SUVలపై గొప్ప అభిరుచిని కలిగి ఉన్నారు. మోహన్ లాల్ కు ఎక్కువగా క్లాసిక్ కార్లు అంటే చాలా ఇష్టం. అతని వద్ద ప్రస్తుతం 1986 మెడల్‌కి చెందిన హిందుస్థాన్ అంబాసిడర్ మార్క్ 4 కారు ఇంకా ఉంది. దీనిబట్టే చెప్పవచ్చు అతని క్లాసికల్ కార్లు అంటే ఎంత ఇష్టమో. అతను కొనుగోలు చేసిన కార్లలో ఇదే మొదటి కారు కావడం విశేషం. అతని కార్ల సేకరణలో తాజాగా మరొక వింటేజ్ కారు చేరింది.

Mohanlal Cadillac Car

రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ఉపయోగించిన కారుతో ఆయన కనిపించారు. ఈస్క్ 007 ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఓ పోస్ట్ లో మోహన్ లాల్ కొత్త రేంజ్ రోవర్ అమెరికన్ లగ్జరీ కారు పార్క్ చేసినట్లు చూపించారు. అయితే ఈ కారును మోహన్ లాల్ మామ, ప్రముఖ సినీ నిర్మాత కె.బాలాజీ కొనుగోలు చేశారు. బాలాజీ మొదట ఈ క్యాడిలాక్ ను అంబానీ నుంచి కొనుగోలు చేశారు. అలానే అతను నిర్మించిన అనేక చిత్రాలలో కూడా ఈ కారును వినియోగించారు.

ఈ కారు 1958 మోడల్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ క్యాడిలాక్ సెడాన్‌గా ఉంది. 38 ఏళ్ల నుంచి ఈ కారు చాలా చక్కగా మెయింటెయిన్ చేయబడింది. కొన్నేళ్ల క్రితం మోహన్ లాల్ ఈ లగ్జరీ సెడాన్ తయారీని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ కారు ఇప్పటివరకు చెన్నైలో ఉంది. ఈ అమెరికన్ లగ్జరీ సెడాన్ ను తాజాగా కొచ్చికి తీసుకువచ్చి మోడిఫికేషన్ చేయించారు.

ఇప్పటి వరకూ ఈ సెడాన్ ఫుల్ షేడ్ డీప్ రెడ్ లేదా మెరూన్ కలర్ లో ఉంది. ఈ సెడాన్ పునరుద్ధరణ పనులను కొచ్చిలోని ఫ్లెమింగో గ్యారేజీలో మోడిఫై చేశారు. ఈ పునరుద్ధరణ పనులతో పాటు, కారుకు రీ పెయింట్ కూడా వేశారు. ఇది ఇప్పుడు వైట్ కోటింగ్ షేడ్ ని వేయించారు. ఈ కారు ప్రస్తుతం క్రేజీ లుక్ లో దర్శనమిస్తుంది. అన్ని అమెరికన్ కార్ల మాదిరిగానే, ఇక్కడ కనిపించే క్యాడిలాక్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది.

నిర్మాత బాలాజీ ఈ లగ్జరీ సెడాన్ ను అంబానీ నుంచి ఎప్పుడు కొనుగోలు చేశారనే విషయం అందుబాటులో లేదు. ఈ క్లాసిక్ సెడాన్ ఎంఎఎస్ 2100 రిజిస్ట్రేషన్ నంబర్ ని కలిగి ఉంది. ఈ క్యాడిలాక్ ఖచ్చితమైన మోడల్ అందుబాటులో లేదు. అయితే, ఈ చిత్రాన్ని చూస్తే, ఇది క్యాడిలాక్ ఫ్లీట్వుడ్ బ్రోమ్ 4-డోర్ల సెడాన్ లాగా దర్శనమిస్తుంది. ఈ సెడాన్ కారు కూపే, సెడాన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

Producer k balaji Cadillac car

ఈ కారు వివిధ రకాల ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ కారు ఇంజన్ స్పెసిఫికేషన్స్ తెలియకపోయినప్పటికీ ఈ కారు ఆటోమేటిక్ ట్రన్స్‌మిషన్‌తో ఉంది. మోహన్ లాల్ ముఖ్యంగా టయోటా బ్రాండ్ కి అభిమాని. దీనికి చెందిన క్రూయిజర్ టయోటా ఇన్నోవా క్రిస్టాతో సహా మొదటి తరం టయోటా ఇన్నోవాను కూడా కలిగి ఉన్నాడు. మాలీవుడ్‌ నటుల్లో టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీని కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు.

పైన తెలిపినట్లుగా మోహన్ లాల్ కు టయోటా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకందా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతని దగ్గర ఒకటి కాదు రెండు ఇన్నోవా క్రిస్టా ఎంపీవీలు ఉన్నాయి. ఇటీవలే రేంజ్ రోవర్ ఫ్లాగ్‌షిప్ SUVని కొనుగోలు చేశాడు. LWB వెర్షన్ అయిన 4.4 లీటర్ వీ8 ఆటోబయోగ్రఫీ వేరియంట్ గా ఇది విడుదలైంది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.3.32 కోట్లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 29, 2023, 11:48 [IST]
English summary
Mohanlal brought dhirubhai ambani cadillac car visuals gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+