Mini Cooper JCW కొనుగోలు చేసిన మలయాళి స్టార్.. ఎవరో తెలుసా?

మలయాళీ సినీ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన నటుల జాబితాలో ఒకరు 'పృథ్వీరాజ్ సుకుమారన్'. పృథ్వీరాజ్ కేవలం నటుడు మాత్రమే కాదు, ఇతడు ప్రొడ్యూసర్, డైరెక్టర్ మరియు ప్లే బ్యాక్ సింగర్ కూడా. 'శివపురం' అనే తెలుగు సినిమాలో కూడా పృథ్వీరాజ్ నటించి తనదైన ముద్రను వేసుకున్నాడు. పృథ్వీరాజ్ కేవలం సినీ పరిశ్రమపై మాత్రమే కాకుండా అతనికి లగ్జరీ కార్లపై కూడా ఎక్కువ ఆసక్తి ఉంది. ఈ కారణంగానే ఇప్పటికే పృథ్వీరాజ్ అనేక లగ్జరీ వాహనాలను కలిగి ఉన్నారు.

Mini Cooper JCW కొనుగోలు చేసిన మలయాళి స్టార్.. ఎవరో తెలుసా?

ఈ నేపథ్యంలో భాగంగానే పృథ్వీరాజ్ ఇటీవల ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ అయిన Mini Cooper యొక్క JCW ని కొనుగోలు చేశారు. Mini Cooper JCW అనేది మంచి పర్ఫామెన్స్ అందించే బ్రాండ్ యొక్క అధునాతన మోడల్. పృథ్వీరాజ్ ఈ కొత్త Mini Cooper JCW డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బయటపడ్డాయి. అంటే కాకుండా దీనికి సంబంధించిన వీడియోను "మల్లు కార్ టాక్స్" అనే యూ ట్యూబ్ ఛానల్ షేర్ చేసింది.

Mini Cooper JCW కొనుగోలు చేసిన మలయాళి స్టార్.. ఎవరో తెలుసా?

Mini Cooper (మినీ కూపర్) ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు కలిగి ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చేరారు. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ కొనుగోలు చేసిన Mini Cooper సాధారణ మోడల్ కి భిన్నంగా ఉంటుంది. ఈ మోడల్ రెగ్యులర్ మినీ కూపర్ యొక్క పర్ఫామెన్స్ బేస్డ్ వెర్షన్, కావున ఇహి కొన్ని కాస్మొటిక్స్ అప్డేట్స్ పొందుతుంది.

Mini Cooper JCW కొనుగోలు చేసిన మలయాళి స్టార్.. ఎవరో తెలుసా?

పృథ్వీరాజ్ ఈ కొత్త కారుని తన భార్య 'సుప్రియ మీనన్‌'తో కలిసి డెలివరీ తీసుకుంటున్నట్లు మీరు ఇక్కడ ఫోటోలలో చూడవచ్చు. ఇక్కడ కనిపించే ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంది.

Mini Cooper JCW కొనుగోలు చేసిన మలయాళి స్టార్.. ఎవరో తెలుసా?

ఇక్కడ మీరు చూస్తున్న Mini Cooper JCW లేదా జాన్ కూపర్ వర్క్స్ ఎడిషన్ 2019 లో భారతీయ మార్కెట్లో విడుదల చేయబడింది. ఇందులో టెయిల్‌గేట్ వద్ద సాధారణ మినీ కారు బ్యాడ్జ్ కాకుండా మినీ కూపర్ JCW ఎడిషన్ బ్యాడ్జింగ్‌ను పొందుతుంది. ఇందులో రెడ్ హైలైట్‌లు కారుకు మరింత స్పోర్టివ్ లుక్ ఇస్తాయి. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

Mini Cooper JCW కొనుగోలు చేసిన మలయాళి స్టార్.. ఎవరో తెలుసా?

Mini Cooper JCW హ్యాచ్‌బ్యాక్ అదే 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఇది ఇప్పుడు సాధారణ వెర్షన్ కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 234 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మిషన్‌తో జతచేయబడింది.

Mini Cooper JCW కొనుగోలు చేసిన మలయాళి స్టార్.. ఎవరో తెలుసా?

కారు మొత్తం డిజైన్ సాధారణ మినీ కూపర్ ఎస్ మాదిరిగానే ఉంటుంది. అయితే సాధారణ వెర్షన్ కంటే ఇంజిన్ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, కారు ఇప్పుడు అనుకూలమైన సస్పెన్షన్ మరియు పెద్ద డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది. ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

Mini Cooper JCW ఎడిషన్ కారు కేవలం 6.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే ఈ Mini Cooper JCW (మినీ కూపర్ జెసిడబ్ల్యు) దాని రెగ్యులర్ మోడల్ వంటి ఇంటీరియర్ డిజైన్‌ను పొందుతుంది. అయినప్పటికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Mini Cooper JCW కొనుగోలు చేసిన మలయాళి స్టార్.. ఎవరో తెలుసా?

Mini Cooper JCW యొక్క క్యాబిన్ బ్లాక్ అండ్ రెడ్ థీమ్‌లో చాలా స్పోర్టియర్‌గా కనిపిస్తుంది. ఈ కారులో 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే, హెడ్స్ అప్ డిస్‌ప్లే, హెర్మన్ మరియు కోర్డాన్ స్పీకర్ సిస్టమ్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో JCW కస్టమ్ స్పోర్ట్స్ సీట్లు ఉన్నాయి.

Mini Cooper JCW కొనుగోలు చేసిన మలయాళి స్టార్.. ఎవరో తెలుసా?

Mini Cooper JCW అనేది భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్. దీని ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ .45.50 లక్షలు. ఇటీవల కంపెనీ తన 2022 JCW కారుని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ 2022 మినీ జాన్ కూపర్ వర్క్స్ కారు డిజైన్ మార్పులతో కొత్త సస్పెన్షన్ సెటప్‌ను పొందుతుంది.

Mini Cooper JCW కొనుగోలు చేసిన మలయాళి స్టార్.. ఎవరో తెలుసా?

2022 మినీ జాన్ కూపర్ వర్క్స్ కారు ఎల్ఈడీ హెడ్‌లైట్లు, రేడియేటర్ గ్రిల్ మరియు బంపర్‌పై పెద్ద ఎయిర్ టెక్‌ను కలిగి ఉంది. ముందు వైపు సైడ్ ప్యానెల్లు మరియు రియర్ బంపర్‌లో డిఫ్యూజర్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ఫీచర్స్ అన్ని కూఆ వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ కొత్త Mini Cooper JCW తో పాటు, కేరళలో రిజిస్టర్ అయిన లంబోర్ఘిని హురాకాన్ స్పోర్ట్స్ కారు యొక్క ఫస్ట్ ఓనర్ కూడా. పృథ్వీరాజ్ రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే కయెన్ వంటి లగ్జరీ వాహనాలను కూడా కలిగి ఉన్నారు.

Most Read Articles

English summary
Mollywood actor prithviraj gifts himself new mini cooper jcw edition details
Story first published: Thursday, September 30, 2021, 11:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X