దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో చేరిన మరో లగ్జరీ కారు; ధర రూ. 2.45 కోట్లు

ప్రముఖ నటుడు మరియు మమ్ముట్టి కుమారుడైన దుల్కర్ సల్మాన్ భారతీయ ప్రేక్షకులకు సుపరిచితుడు. దుల్కర్ సల్మాన్ తెలుగు, తమిళం మరియు మలయాళం భాషల్లో అనేక సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను కలిగి ఉన్నాడు. సెకండ్ షో అన్న మలయాళ చిత్రంతో దుల్కర్ సల్మాన్ సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో చేరిన మరో లగ్జరీ కారు; ధర రూ. 2.45 కోట్లు

దుల్కర్ సల్మాన్ కేవలం మలయాళ నటుడు మాత్రమే కాదు. అతను పాన్ ఇండియా స్టార్. ఇతడు తమిళ మరియు తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా ఒక డిటెక్టివ్ థ్రిల్లర్‌లో నటించింది. ఈ కారణంగానే ఇతనికి పెద్ద ఎత్తులో అభిమానులు ఉన్నారు.

దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో చేరిన మరో లగ్జరీ కారు; ధర రూ. 2.45 కోట్లు

నటుడు దుల్కర్ సల్మాన్ కి నటన అంటే ఎంత ఇష్టమో కార్లు మరియు బైకులంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగానే దుల్కర్ సల్మాన్ అనేక లగ్జరీ కార్లు మరియు బైకులను కలిగి ఉన్నాడు. దుల్కర్ సల్మాన్ సూపర్ కార్లు మరియు బైకులపై వెళ్తున్నప్పుడు చాలా సార్లు గుర్తించబడ్డాడు.

దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో చేరిన మరో లగ్జరీ కారు; ధర రూ. 2.45 కోట్లు

దుల్కర్ సల్మాన్ ఎప్పటికప్పుడు మార్కెట్లోని లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల దుల్కర్ సల్మాన్ మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ నుంచి ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటపడ్డాయి. ఇక్కడ దుల్కర్ సల్మాన్ ఈ ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీతో ఉన్న ఫోటోలను చూడవచ్చు.

దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో చేరిన మరో లగ్జరీ కారు; ధర రూ. 2.45 కోట్లు

ఏఎమ్‌జి జి63 అనేది భారతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ బ్రాడ్ యొక్క ఎస్‌యూవీలలో ఒకటి. మెర్సిడెస్ ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీ ధర దేశీయ మార్కెట్లో 2.45 కోట్లు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు ఈ ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీని కలిగి ఉన్నారు.

దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో చేరిన మరో లగ్జరీ కారు; ధర రూ. 2.45 కోట్లు

ఇప్పుడు నటుడు దుల్కర్ సల్మాన్ కలిగి ఉన్న పెద్ద గ్యారేజ్ లోని సూపర్ కార్లు, ఎస్‌యూవీలు మరియు పాతకాలపు కార్లుతో పాటు ఈ కొత్త కారు కూడా చేరింది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కొనుగోలుచేసి ఈ కోట మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీ సైనో ఆలివ్ గ్రీన్ షేడ్‌తో పాటు బ్లూ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ అపోల్స్ట్రేతో కూడిన క్యాబిన్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూవీ బ్లాక్ కలర్ వీల్స్ కలిగి ఉంటుంది.

దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో చేరిన మరో లగ్జరీ కారు; ధర రూ. 2.45 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీలో 4.0-లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 577 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది. మెర్సిడెస్-ఎఎమ్‌జి జి 63 ఎస్‌యూవీ మంచి ఆఫ్-రోడ్ సామర్త్యం కలిగిన ఎస్‌యూవీ. ఇది 4 మ్యాటిక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో చేరిన మరో లగ్జరీ కారు; ధర రూ. 2.45 కోట్లు

ఈ లగ్జరీ ఎస్‌యూవీ మంచి డిజైన్ కలిగిఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, పనామెరికానా గ్రిల్ మరియు బాక్సీ సిల్హౌట్‌తో ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటి వాటిని కలిగి ఉంటుంది. దుల్కర్ సల్మాన్ తో పాటు మెర్సిడెస్- ఎఎమ్‌జి జి 63 ఎస్‌యూవీ కలిగి ఉన్న ఇతర ప్రముఖ నటులు ఆసిఫ్ అలీ, జిమ్మీ షెర్గిల్, అఖిల్ అక్కినేని, రామ్ కపూర్.

దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో చేరిన మరో లగ్జరీ కారు; ధర రూ. 2.45 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ 350 డి ఇప్పుడు భారతదేశంలో లగ్జరీ ఎస్‌యూవీగా విక్రయించబడింది. ఇది లీటర్ వి6 టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 281 ​​బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ 350డి ధర కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది.

దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో చేరిన మరో లగ్జరీ కారు; ధర రూ. 2.45 కోట్లు

దుల్కర్ సల్మాన్ కలిగి ఉన్న విలాసవంతమైన లగ్జరీ కార్లలో జాగ్వార్ XJL, మెర్సిడెస్ బెంజ్ ఎస్- క్లాస్, పోర్షే పనామెరా, టయోటా ల్యాండ్ క్రూయిజర్, ఆడి ఏ7 స్పోర్ట్ బ్యాక్, మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యు123 మరియు వోల్వో ఎస్టేట్ వంటివాటితోపాటు. ఖరీదైన బైకులను కూడా కలిగి ఉన్నాడు.

Most Read Articles

English summary
Mollywood star dulquer salman new ride is a mercedes amg g63 suv in olive green shade details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X