Just In
- 23 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- 16 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
Don't Miss
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- News
తుని ఘటనలో ముద్రగడకు రైల్వేకోర్టు సమన్లు- ఇతర నిందితులకూ- రాష్ట్రం వదిలేసినా
- Sports
'అనుకోకుండా క్రికెటర్ అయ్యా.. టీమిండియా జెర్సీ ధరిస్తానని అసలు ఊహించలేదు'
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పాస్టాగ్ లొల్లి షురూ.. ఇంట్లో పార్క్ చేసి ఉన్న కారుకి రూ.310 టోల్ చార్జ్!
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15, 2021వ తేదీ నుండి జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల గుండా ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసినదే. అయితే ఈ ఫాస్టాగ్‌ల వలన ప్రయాణీకులు ఇప్పుడు కొత్త ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.

కొన్నిచోట్ల పలు బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు జారీ చేసిన ఫాస్టాగ్‌లు సర్వర్ ఇబ్బందుల కారణంగా సరిగ్గా పనిచేయకపోవటం ఒక సమస్య అయితే, అసలు టోల్ ప్లాజాల గుండా ప్రయాణించని వాహనాలకు సైతం టోల్ బిల్ రావటం మరొక సమస్య మారింది. తాజాగా ఇలాంటి సంఘటనే పూనేలో జరిగింది.

పూణేకు చెందిన ఐటీ ఉద్యోగి వినోద్ జోషి (48) తన కారును ఇంట్లోనే పార్క్ చేసి ఉన్నప్పటికీ, అతని ఫాస్టాగ్ ఖాతా నుండి రూ.310 కట్ అయినట్లు మేసేజ్‌లు అందుకున్నాడు. ఆ రోజంతా (బుధవారం నాడు) తన కారు ఇంట్లోనే ఉందని, కేవలం తన పాపను స్కూల్‌కి డ్రాప్ చేయటానికి మాత్రమే ఉదయం కారును బయటకు తీశానని చెప్పారు.
MOST READ:కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?

ఆరోజు తను పూనే-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్లలేదని, కారు ఇంట్లోనే పార్క్ చేసి ఉండటం తన సిసిటివి కెమెరాలో కూడా రికార్డ్ అయి ఉందని జోషి చెప్పారు. పార్క్ చేసి ఉన్న కారుకి టోల్ బిల్ రావటం ఏంటని, ఆయన తన పేమెంట్ బ్యాంక్స్‌ని, ఫాస్టాగ్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.

బుధవారం నాడు వాషి టోల్ ప్లాజా వద్ద తన ఫాస్టాగ్ ఖాతా నుండి మొదట రూ.40 కట్ అయినట్లు ఎస్ఎమ్ఎస్ అందుకున్నట్లు జోషి చెప్పారు. ఆ తర్వాత ఉదయం 8.40 గంటలకు ఖలాపూర్ టోల్ ప్లాజా వద్ద రూ.203 కట్ అయినట్లు రెండవ ఎస్ఎమ్ఎస్ వచ్చింది. దాని తరువాత, మళ్ళీ తాలేగావ్ టోల్ ప్లాజా మధ్యాహ్నం 12.40 గంటలకు రూ.67 కట్ అయినట్లు మూడవ ఎస్ఎమ్ఎస్ వచ్చినట్లు జోషి వివరించారు.
MOST READ:చివరి రోజు పాండాతో కలిసి పని చేసిన డెలివరీ బాయ్.. ఎందుకంటే

ఇలా మూడుసార్లుగా మొత్తం రూ.310 తన ఫాస్టాగ్ ఖాతా నుండి తన ప్రమేయం లేకుండానే కట్ అయినట్లు జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన తన బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు, తన ఫాస్టాగ్‌ను ఎవరైనా క్లోన్ చేసి ఉంటారనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.

ఈ విషయం గురించి బ్యాంక్ కస్టమర్ కేర్‌తో మాట్లాడినా ఫలితం లేదని ఆయన అన్నారు. తమ ఫాస్టాగ్ వాలెట్‌లో ఎక్కువ డబ్బు ఉంచినట్లయితే, తాను ఎక్కువ డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
MOST READ:మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

ఎక్స్‌ప్రెస్‌వేలో టోల్ ప్లాజాకు బాధ్యత వహిస్తున్న సంస్థ మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎమ్ఎస్‌ఆర్‌డిసి)కు ఈ విషయం గురించి త్వరలో ఫిర్యాదు చేయబోతున్నానని జోషి చెప్పారు.

ఈ అంశంపై ఎమ్ఎస్‌ఆర్‌డిసి చీఫ్ జనరల్ మేనేజర్ స్పందించారు. దీని గురించి అయన మాట్లాడుతూ, ఫాస్టాగ్ వాలెట్ గురించి కొన్ని రకాల ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, ఈ తరహా ఫిర్యాదు రావటం ఇదే మొదటిసారి అని, దీనిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ తప్పనిసరిగా మారింది. ఫాస్టాగ్ లేని వాహనదారుల నుండి రెట్టింపు టోల్ చార్జీలను వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు, కోటి ఫాస్టాగ్‌లు అమ్ముడయ్యాయని, దేశంలో దాదాపు 80 శాతం వాహనాలు ఫాస్టాగ్‌ను కలిగి ఉన్నట్లు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
మూలం: TOI