ఎలక్ట్రిక్ టూవీలర్ వాడుతున్నారా.. వానాకాలంలో ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు.. లేదంటే జేబు ఖాళీ
వానాకాలంలో మన వెహికల్స్ మీద మరింత శ్రద్ధ చూపిస్తుంటాం. ఈ మధ్యకాలంలో మన దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ల సంఖ్య బాగా పెరిగింది. పెట్రోల్ టూవీలర్ల లాగే, వానాకాలంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు కూడా ప్రత్యేక శ్రద్ధ, సంరక్షణ అవసరం.
నీటి గుండా ఈవీలు దూసుకుపోతున్నాయని చూసి.. వాన మమ్మల్ని ఏం చేయదు అని ఏ ఈవీ యజమాని అయినా అనుకుంటే అది తప్పు. వర్షం, వాతావరణంలోని తేమ వాహనం ఎలక్ట్రిక్ భాగాలకు నష్టం కలిగించవచ్చు. వానాకాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సురక్షితంగా ఉపయోగించడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వాహనాలను వర్షం నుంచి రక్షించడానికి వాటర్ ప్రూఫ్ కవర్ ఉపయోగించడం మంచిది. కవర్ వాహనాన్ని పూర్తిగా కప్పి ఉంచుతుంది. అలాగే, వాహనానికి గాలి, వెలుతురు తగిలేలా కొద్దిగా వెంటిలేషన్ ఉండాలి. వాహనాన్ని పార్క్ చేసే ముందు పొడి వస్త్రంతో తుడవాలి.
వాహనాన్ని తడి లేని, పొడి ప్రదేశంలో పార్క్ చేయడానికి ప్రయత్నించాలి. మోటార్‌సైకిల్ లేదా స్కూటర్‌ను ఎల్లప్పుడూ పైకప్పు ఉన్న ప్రదేశంలో లేదా గ్యారేజీలో పార్క్ చేయడం మంచిది. అలాంటి ప్రదేశాలు లేకపోతే, తాత్కాలికంగా వర్షం తగలకుండా షెడ్‌లను ఉపయోగించాలి. ఎలక్ట్రిక్ టూవీలర్‌లపై నీరు పడితే బ్యాటరీ, మోటార్ వంటి ముఖ్యమైన భాగాలకు నష్టం వాటిల్లవచ్చు.

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీకి అత్యధిక నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి, బ్యాటరీ టెర్మినల్స్‌ను తరచుగా చెక్ చేయాలి. టెర్మినల్స్ పై తుప్పు, తేమ లేకుండా చూసుకోవాలి. ఎలక్ట్రిక్ టూవీలర్‌లలో రిమూవబుల్ బ్యాటరీ ఉంటే, వాటిని తీసి ఇంటి లోపల సురక్షితంగా ఉంచుకోవచ్చు.
ఛార్జ్ చేయడానికి పొడి, గాలి తగిలే ప్రదేశాన్ని సెలక్ట్ చేసుకోవాలి. వైరింగ్, కనెక్టర్లు, ఛార్జింగ్ పోర్ట్ వంటి భాగాలను వర్షం నుంచి రక్షించడానికి వాటర్‌ప్రూఫ్ టేప్ లేదా సిలికాన్ సీలెంట్ ఉపయోగించాలి. ఈ భాగాలను తరచుగా తనిఖీ చేయాలి. ఏదైనా నష్టం ఉంటే, సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలి.

వానాకాలంలో రోడ్లు తడిగా ఉంటాయి కాబట్టి, జారిపోకుండా ఉండటానికి టైర్ల ట్రెడ్ ప్యాటర్న్‌ను తనిఖీ చేయండి. టైర్లు మార్చాల్సిన సమయం వస్తే వెనుకాడకండి. టైర్ల వలె, వర్షాకాలంలో బ్రేక్ ప్యాడ్‌లపై కూడా శ్రద్ధ పెట్టాలి. బురద పేరుకుపోయి బ్రేకింగ్ సిస్టమ్‌ను ప్రభావితం చేయవచ్చు కాబట్టి, వర్షం తర్వాత బ్రేక్‌ప్యాడ్‌లను శుభ్రం చేయడానికి గుర్తుంచుకోండి.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: పైన చెప్పిన ఈ సాధారణ చిట్కాలను పాటిస్తే, వర్షాకాలంలో మీ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను బాగా రక్షించుకోవచ్చు. వర్షాకాలంలో బురద, ధూళి వాహనం భాగాలకు నష్టం కలిగించవచ్చు. కాబట్టి, వాహనాన్ని తరచుగా శుభ్రం చేయండి. నెలకు ఒకసారి సర్వీస్ సెంటర్‌లో తనిఖీ చేయించుకోవాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








