మూన్‌వాకర్స్‌ ఎలక్ట్రిక్‌ షూస్‌.. బ్యాటరీతో నడిచే ఈ బూట్లతో ఎన్నో లాభాలు.!!

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆటోమొబైల్‌ రంగంలో విస్తృతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాస్తంత దూరం వెళ్లాలన్నా, ప్రతీ అవసరానికి వాహనాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ వాహనాల రాకతో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయనే చెప్పవచ్చు. అయితే సరికొత్తగా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ షూస్‌ హవా నడుస్తోంది.

పూర్వ కాలంలో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే నడిచి వెళ్లేవారు. ఆ తర్వాత గుర్రాల ద్వారా రవాణా అవసరాలు తీరాయి. ఆ తర్వాత వాహనాలు అందుబాటులోకి రావడంతో ఇక నడిచే అవసరం దాదాపు తగ్గిందనే చెప్పవచ్చు. కాగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఇవన్నీ అందుబాటులో వచ్చేసరికి సైక్లింగ్‌, వాకింగ్‌ అంటూ బరువు తగ్గించుకోవడానికి వాటిపై ఆధారపడుతున్నాం.

Moonwalkers-Electric-Shoes

ఈ కాలంలో ప్రయాణానికి వాహనాలపై ఆధారపడే చాలా మంది ఇప్పుడు వ్యాయామంగా నడకపై ఆధారపడుతున్నారు. కాకపోతే ఆరోగ్యానికి మేలు చేసినా.. సమయం వృథా కావడం వల్ల చాలా మంది తక్కువ దూరాలకు కూడా టూ వీలర్లను తీసుకెళ్తున్నారు. అయితే దానికి ప్రత్యామ్నాయంగా జాగర్స్‌ కోసం ఎలక్ట్రిక్‌ షూస్‌ ప్రజాదరణ పొందాయి.

ఈ విప్లవాత్మక ఆవిష్కరణను US ఆధారిత స్టార్టప్ కంపెనీ షిఫ్ట్ రోబోటిక్స్(Shift Robotics) అభివృద్ధి చేసింది. సంప్రదాయ షూ కంటే రెండింతలు వేగంగా నడిచేలా చేసే ఎలక్ట్రిక్‌ షూస్‌ని సంస్థ కనిపెట్టింది. ఇవి వేసుకున్నాక జాగర్‌ గంటకు 11 కిలోమీటర్ల వేగంతో నడవగలడని ఎలక్ట్రిక్‌ షూస్‌ మేకర్స్‌ పేర్కొన్నారు. అయితే దీన్ని స్కేట్‌ అనుకుంటే పొరపాటే.. ఇవి అసలైన షూసే తప్ప స్కేట్లు కాదని కంపెనీ స్పష్టం చేసింది.

Moonwalkers-Electric-Shoes

మూన్‌వాకర్స్ అని పిలువబడే ఈ ఎలక్ట్రిక్ షూస్ బ్యాటరీ శక్తి మీద ఆధారపడి పనిచేస్తాయి. ఈ మోటరైజ్డ్ షూస్‌, తక్కువ సమయంలో వేగంగా నడవడానికి, గమ్యాన్ని చేరుకోవడానికి జాగర్స్‌కి దోహదపడతాయి. అంటే మీరు జాగింగ్‌ చేసే సమయంలోనే రెట్టింపు వేగంతో నడవచ్చని షిఫ్ట్‌ రోబోటిక్స్‌ పేర్కొంది.

ఇది AI డ్రైవ్ ద్వారా పని చేస్తుంది. ఇంకా ఇందులో బ్రష్‌లెస్ మోటార్ ఇన్‌బిల్ట్‌గా రావడం విశేషం. రహదారిపై గుంతలు లాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ షూస్‌ను తయారు చేశారు. ఈ షూస్‌ IP45 వాటర్ రెసిస్టెంట్ కావడం వల్ల వర్షం పడినా సురక్షితంగా ఉంటాయి.

Moonwalkers-Electric-Shoes

USB టైప్-సి పోర్ట్ ద్వారా ఈ షూస్‌ని ఛార్జ్ చేయవచ్చు. 10 కిలోమీటర్ల దూరం వరకు ఫాస్ట్ వాక్ చేయవచ్చు. అయితే నేడు మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పరిశీలిస్తే ఇవి ఎక్కువ రేంజ్‌ ఇవ్వదు. ఇవి మాల్స్‌, ఎయిర్‌పోర్టులో ధరించే షూస్‌తో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. కానీ ఈ ఎలక్ట్రిక్‌ షూస్‌లోనూ కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.

మూన్‌వాకర్స్‌ ఎలక్ట్రిక్‌ షూస్‌ బరువు విషయానికొస్తే ఒక్కో షూ దాదాపు 2 కిలోల బరువు ఉంటుందని సంస్థ తెలిపింది. ఇవి ఒక సైజులో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పురుషుల కోసం తయారు చేయబడిన వీటి సైజ్‌ EU 42-45. అయితే ఈ షూస్‌ ధరించిన వారి గరిష్ఠ బరువు 100 కిలోలకు మించకూడదు.

Moonwalkers-Electric-Shoes

మూన్‌ వాకర్స్‌ ఎలక్ట్రిక్‌ షూస్ ఒక్కో జత ధర US$1,399. భారత కరెన్సీ ప్రకారం వీటి ధర దాదాపు రూ.1.16 లక్షలు. వీటి ధర ఎలక్ట్రిక్‌ సైకిళ్లు, స్కూటర్లతో పోలిస్తే ఎక్కువే అనిపించినా.. సైకిళ్లను పెడల్‌తో తొక్కాల్సి ఉంటుంది. ఈ షూస్‌ను ధరిస్తే మీరు వాకింగ్‌ చేసిన ఫీల్‌తో డబుల్‌ స్పీడ్‌తో నడవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, October 28, 2023, 11:13 [IST]
English summary
Moonwalkers electric shoes helps you to walk faster than usual price features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+