Just In
- 10 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 13 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 14 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 14 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
వేద మంత్రాన్నివింటే లాభమొస్తుందా...ఎలా..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Movies
‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వారెవ్వా.. జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్‌కి 300 కార్లతో స్వాగతం చెప్పిన అభిమానులు
సాధారణంగా స్వాతంత్య్ర సమరయోధులో లేక సమాజం యొక్క బాగుకోసం జైలుపాలైన వ్యక్తులు జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు ఘనంగా స్వాగతించడం మనం చూసి ఉంటాం. కానీ ఇప్పుడు హత్యలు చేసి జైలుకెళ్లిన వారు విడువులైప్పుడు అంతకు మించి స్వాగతం పలుకుతున్నారు. ఇటీవల రెండు హత్య కేసులో మూడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన తరువాత విడుదలైన ఒక ప్రముఖ రౌడీకి అతని సహచరులు ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. ఇది వినటానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే..

రెండు హత్యలకు జైలు శిక్ష అనుభవిస్తున్న ఇతని పేరు గజానన్ మర్నే. యితడు మహారాష్ట్రలోని పింప్రి-చిన్చ్వాడ్ కు చెందినవాడు. హత్య కేసులో గత మూడేళ్లుగా ముంబైలోని తలేజా జైలులో వున్నాడు. మూడేళ్లు పూర్తి చేసుకుని జైలు నుంచి ఇటీవల విడుదలయ్యాడు.

గజానన్ మర్నే విడుదల గురించి సమాచారం తెలుసుకున్న అతని సహచరులు మరియు మద్దతుదారులు అందరూ విడుదలయ్యే ఉదయాన్నే ముంబై తలేజా జైలు ఎదుట చేరారు. గజానన్ విడుదలై జైలు గేట్ బయటకు రాగానే అందరూ ఎంతో ఉత్సాహంగా పూల వర్షం కురిపించారు.
MOST READ:ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న సూపర్ ఉమెన్ వీడియో

అంతే కాకుండా అతనిపేరుతో నినాదాలు కూడా చేశారు. గజానన్ ని తన అభిమానులు ఎంతగానో ఉత్సాహంతో స్వాగతం పలకడం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు. ఇక్కడ అతన్ని స్వాగతించడానికి దాదాపు 300 కి పైగా కార్లు జైలుకు తరలి వచ్చాయి. అతను తన స్వగ్రామానికి బయలుదేరే వరకు ఈ కార్లన్నీ ఉత్సాహంగా స్వాగతం పలికాయి. ఈ ర్యాలీ గొప్ప రాజకీయ నాయకుల కాన్వాయ్ కంటే ఎక్కువగా తలపించింది.

ఈ ర్యాలీ సమయంలో గజానన్ తన కారు యొక్క సన్‌రూఫ్ గుండా నిలబడి తన మద్దతుదారులకు చేతులు ఊపుతూ అభివాదం చేసాడు. ర్యాలీ మొత్తంలో అతనిపై పువ్వుల వర్షం కురిసింది.
MOST READ:మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కూల్ రియాక్షన్

ప్రయాణ సమయంలో సన్ రూప్ ద్వారా బయటకు రావడం నేరం. అంతే కాకూండా ఈ ర్యాలీ సమయంలో కొంతమంది అధికారులు టోల్ చెల్లించడానికి తమ వాహనాలను ఏ టోల్‌గేట్ వద్ద పార్క్ చేయలేదని నివేదించారు.

తరువాత, వారు ముంబై మరియు పూణే, ఎక్స్‌ప్రెస్‌వే మధ్య ఎక్స్‌ప్రెస్‌వేను అడ్డుకోవడానికి కార్లను నడిపారు. దీని ఫలితంగా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద చాలా రద్దీ ఏర్పడింది. ఇలాంటి చర్యలు చేస్తున్న వారిపై పోలీసులు త్వరలో తదుపరి చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.
MOST READ:రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?
గజానన్ మర్నేపై పోలీసులు త్వరలోనే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రసిద్ధ రౌడీలు అమన్ బడే మరియు పప్పు కవాడే హత్యకు సంబంధించి అతను గతంలో జైలు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించిన తరువాత ఈ విధమైన ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి మళ్ళీ నేరాలకు పాల్పడ్డాడు.

ఒక రౌడీ షీటర్ కి ఇంత ఘన స్వాగతం పలకడం ముంబై-పూణే నివాసితులకు షాక్ ఇచ్చింది. ఇటీవల ముఖ్యంగా, తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పు తీసుకువచ్చిందని కొందరు నమ్ముతున్న శశికళ విడుదల సమయంలో కూడా ఇటువంటి చర్య జరగలేదు. ఇదిలావుండగా, గజానన్ ర్యాలీలో ఈ నేరాలకు పాల్పడిన వారందరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
Image Courtesy: Lokmat