రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

భారతదేశంలో రోడ్ల పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలోని రోడ్లపై సున్నా రోడ్డు ప్రమాదాల లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ (MoRTH) కృషి చేస్తోంది. ఈ మేరకు దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగిన 14 రాష్ట్రాలను కేంద్ర మంత్రిత్వ శాఖ గుర్తించింది.

రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

ఆయా రాష్ట్రాలలో రోడ్డు భద్రతను పెంచడానికి కేంద్రం రూ. 7,270 కోట్ల పథకాన్ని ప్రారంభించనుంది. కేంద్రం గుర్తించిన ఈ 14 రాష్ట్రాలలో రోడ్డు ప్రమాదాలు సుమారు 85 శాతం ఉన్నట్లు గుర్తించారు. ఈ నిధులతో రోడ్లను అభివృద్ధి చేయడం, రోడ్లపై భద్రతను పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించాలని కేంద్రం భావిస్తోంది.

రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

ఈ పథకం కోసం కేటాయించిన మొత్తం విలువలో రవాణా మంత్రిత్వ శాఖ రూ. 3,635 కోట్ల బడ్జెట్ మద్దతును అందిస్తుండగా, ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకుల రూ. 1,818 కోట్లను రుణంగా తీసుకోనున్నారు. మొత్తం వ్యయంలో, వాటి పనితీరు ఆధారంగా 14 రాష్ట్రాలకు రూ. 6,725 కోట్లు పంపిణీ చేయబడతాయి మరియు సామర్ధ్య నిర్మాణ కార్యకలాపాల కోసం రూ. 545 కోట్లు ఖర్చు చేయబడతాయి.

రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

ప్రభుత్వం గుర్తించిన ఈ 14 రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, బీహార్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిషా, హర్యానా మరియు అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో రోడ్డు భద్రతను మెరుగుపరచడమే కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం.

రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు మరణాల రేటును తగ్గించే లక్ష్యంలో అట్టడుగు స్థాయిలో ఉన్న రాష్ట్రాలలో రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి ఈ పథకం సహాయం చేస్తుంది. ఈ కార్యక్రమం ఒక అవుట్‌పుట్ మరియు ఫలిత-ఆధారిత (అవుట్‌పుట్ డ్రైవెన్) పథకం, దీనిలో పనితీరు ఆధారంగా రాష్ట్రాలకు గ్రాంట్లు పంపిణీ చేయబడతాయి.

రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

ఈ పనితీరును 11 తప్పనిసరి (మ్యాన్‌డేటరీ) మరియు 3 ఎంపిక సూచికల (ఎలెక్టివ్ ఇండికేటర్స్) ఆధారంగా అంచనా వేయడం జరుగుతుంది. మరణాల తగ్గింపు లక్ష్యాన్ని సాధించడానికి మోటార్ వాహన సవరణ చట్టం (2019) ఒక ముఖ్యమైన జోక్యంగా తీసుకువచ్చినట్లు MoRTH తయారు చేసిన ప్రాథమిక ప్రాజెక్ట్ నివేదిక పేర్కొంది.

రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

గడచిన 2019 సంవత్సరంలో భారతదేశంలో 4.49 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 1.51 లక్షల మంది మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తం మరణాలలో, 1,27,379 మంది పైన పేర్కొన్న 14 రాష్ట్రాలలోనే సంభవించడం గమనార్హం. గత ఐదు సంవత్సరాలలో మరణాల సంఖ్య స్థిరంగా ఉంది. గత సంవత్సరం, కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గడంతో, దేశవ్యాప్తంగా 1.32 లక్షల రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.

రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

ఈ కొత్త రోడ్డు భద్రతా పథకం క్రింద మార్చి 2027 నాటికి భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో మరణాల రేటును 30 శాతం తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం కింద, ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ (IRAD) 2022-23 నాటికి అన్ని రాష్ట్రాలలో ప్రారంభించబడుతుంది. దీని కింద, అన్ని ప్రధాన రహదారులు మరియు జిల్లా రహదారులపై ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలు మరియు సమస్యలు పరిష్కరించబడతాయి.

రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

ఈ కొత్త విధానం ప్రకారం, అన్ని రాష్ట్రాలు రహదారులు మరియు పట్టణ రహదారుల యొక్క రహదారి భద్రతా తనిఖీని నిర్వహించడం తప్పనిసరిగా ఉంటుంది. అంతే కాకుండా, 2022-23 సంవత్సరం నుండి, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ 'ఛాలెంజ్ రౌండ్' ను కూడా ప్రారంభిస్తుంది. దీని ప్రధాన లక్ష్యం రాష్ట్రాలకు రహదారి భద్రత మరియు నాణ్యత ఆధారంగా ప్రోత్సాహకాలను అందించడం. ఇది రహదారి భద్రత విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య పోటీని పెంచుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

జాతీయ రహదారుల ఆడిట్ కొనసాగుతోంది

గత ఏడాది నవంబర్ నుంచి దేశంలో జాతీయ రహదారుల ఆడిట్ జరుగుతోంది. దీని కింద, రోడ్డు భద్రతా నిపుణుల బృందం దేశంలోని వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఆడిట్ చేస్తోంది. దీనితో పాటుగా హైవేలలో ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్) కూడా గుర్తిస్తోంది. ఈ ఆడిట్ నివేదిక ఆధారంగా, కంపెనీలు రోడ్ల తయారీలో మార్పులు చేయాల్సి ఉంటుంది. హైవేపై ప్రమాదాలను తగ్గించడమే ఈ చొరవ యొక్క ప్రధాన లక్ష్యం.

రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

కార్ కంపెనీలకు గడ్కరీ విజ్ఞప్తి

ఇదిలా ఉంటే, దేశంలోని రోడ్లపై సేఫ్టీని పెంచేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల కార్ కంపెనీలకు ఓ విజ్ఞప్తి చేశారు. సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) ప్రతినిధి బృందాన్ని కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ సేఫ్టీని పెంచడానికి కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్ లను అయినా ఇన్‌స్టాల్ చేయాలని తయారీదారులను కోరారు.

రోడ్ సేఫ్టీ కోసం రూ.7270 కోట్లు, లబ్ధి పొందనున్న 14 రాష్ట్రాలు: ఏపి, తెలంగాణాలో కూడా..

హై-ఎండ్ కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్ లను ఆఫర్ చేసే కంపెనీలు ఎంట్రీ లెవల్ కార్లలో 1 లేదా 2 ఎయిర్‌బ్యాగ్ లను మాత్రమే ఆఫర్ చేయటం ఎంత వరకూ కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. కార్లలో ఎయిర్‌బ్యాగ్ ల సంఖ్యను పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలలో మరణాల రేటును సమర్థవంతంగా తగ్గించవచ్చని నితిన్ గడ్కరీ అన్నారు.

ఏప్రిల్ 1, 2021 నుండి దేశంలోని కార్ల తయారీ సంస్థలు అన్నీ కూడా తమ కొత్త కార్లలో తప్పనిసరిగా రెండు (డ్యూయల్) ఎయిర్‌బ్యాగులను అందించాల్సి ఉంటుంది. వీటిలో ఒకటి డ్రైవర్ కోసం మరొకటి ఫ్రంట్ ప్యాసింజర్ కోసం. ఇప్పటికే తయారైన కార్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి గడువు తేదీని 31 డిసెంబర్ 2021 గా నిర్ణయించారు.

Most Read Articles

English summary
Morth announces rs 7270 crore road safety scheme 14 states to get benefit from this scheme
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X