రోడ్డు ప్రమాదాల సంఖ్య 2024 నాటికి 50% తగ్గుతుంది; నితిన్ గడ్కరీ

భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి రేటు క్రమంగా పైపైకి వెళ్తోంది. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖా చాలా వరకు చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలు సజావుగా జరిగితే వచ్చే మూడేళ్లలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల రేటు 50% తగ్గుతుందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

రోడ్డు ప్రమాదాల సంఖ్య 2024 నాటికి 50% తగ్గుతుంది; నితిన్ గడ్కరీ

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోడ్డు నిర్మాణ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. కావున రోడ్ల నాణ్యత మరియు భద్రతా చర్యలను మెరుగుపరచడం ద్వారా 2024 లోపు రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

రోడ్డు ప్రమాదాల సంఖ్య 2024 నాటికి 50% తగ్గుతుంది; నితిన్ గడ్కరీ

2030 నాటికి రహదారి భద్రతా చర్యలను పూర్తిగా అమలు చేయడమే ఈ విభాగం లక్ష్యమని, నితిన్ గడ్కరీ అధికారికంగా తెలిపారు. ఈ లక్ష్యం ఏ మాత్రం ఆలస్యం జరిగినా చాలా మంది వాహనదారులను కోల్పోవాల్సివస్తుంది. అంటే నివేదికల ప్రకారం దాదాపు ఆ సమయానికి 6 లక్షల నుంచి 7 లక్షల మంది ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉంది.

రోడ్డు ప్రమాదాల సంఖ్య 2024 నాటికి 50% తగ్గుతుంది; నితిన్ గడ్కరీ

కేంద్ర రవాణాశాఖ ఇప్పటికే దీనికోసం చాలా వరకు కొత్త సంస్కరణ చర్యలు తీసుకుని వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పారిశ్రామిక సంస్థ ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ దీని గురించి ప్రస్తావించారు.

రోడ్డు ప్రమాదాల సంఖ్య 2024 నాటికి 50% తగ్గుతుంది; నితిన్ గడ్కరీ

భారతదేశంలో దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలిసింది. కానీ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల వల్ల ఈ ప్రమాదాల సంఖ్య 2024 కల్లా దాదాపుగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మొత్తానికి రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రోడ్డు ప్రమాదాల సంఖ్య 2024 నాటికి 50% తగ్గుతుంది; నితిన్ గడ్కరీ

ప్రస్తుత నివేదికల ప్రకారం భారతదేశంలో రోజుకు 400 మందికి పైగా రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. భారతదేశంలో ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ రికార్డు గత ఏడు సంవత్సరాలలో తన విభాగం చేసిన అతిపెద్ద వైఫల్యమని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ సంఖ్యను తగ్గించడానికి రహదారి నాణ్యత మరియు భద్రతా చర్యలను అభివృద్ధి చేయాలని గడ్కరీ అన్నారు.

రోడ్డు ప్రమాదాల సంఖ్య 2024 నాటికి 50% తగ్గుతుంది; నితిన్ గడ్కరీ

రహదారులను సురక్షితంగా ఉంచడానికి రవాణా శాఖ చురుకుగా పనిచేస్తోంది. సుమారు 50% రోడ్డు ప్రమాదాలు రోడ్ ఇంజనీరింగ్ సమస్యల వల్ల జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ (రోడ్ మరియు ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌తో సహా), ఎకానమీ, లాజిస్టిక్స్ మరియు విద్య యొక్క నాలుగు అంశాలను పునర్నిర్మించడం మరియు బలోపేతం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఈ విభాగం తీవ్రంగా కృషి చేస్తోందని గడ్కరీ చెప్పారు.

రోడ్డు ప్రమాదాల సంఖ్య 2024 నాటికి 50% తగ్గుతుంది; నితిన్ గడ్కరీ

రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాలను తగ్గించడానికి రవాణా శాఖకు సహాయం చేయడానికి బీమా కంపెనీలు ముందుకు రావాలని నితిన్ గడ్కరీ అన్నారు. అంతే కాకుండా భీమా సంస్థలు ప్రమాద బాధితులకు అండగా నిలబడాలని ఆయన సూచించారు. భీమా సంస్థల సహకారం ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. భవిష్యత్ లో భీమా కంపనీలు కూడా సహకరించాలి.

రోడ్డు ప్రమాదాల సంఖ్య 2024 నాటికి 50% తగ్గుతుంది; నితిన్ గడ్కరీ

దేశవ్యాప్తంగా 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని గడ్కరీ తెలిపారు. డ్రైవర్ల కొరతను అధిగమించడానికి వెనుకబడిన జిల్లాల్లో 2 వేల డ్రైవింగ్ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు. దీని ద్వారా డ్రైవర్ల కొరత చాలా వరకు తగ్గుతుంది.

Most Read Articles

English summary
Road Accidents Will Be Reduced By 50% By 2024. Read in Telugu.
Story first published: Saturday, June 19, 2021, 9:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X